Jump to content

మరే దేశంలో కనపడని ఆర్థిక సూత్రం మన రాష్ట్రంలో ఉంటుంది. ఏదైనా సంస్థలో నష్టాల్లో ఉంటే, వెంటనే అది అందించే సేవల ధరలు పెంచేస్తారు. ధరలు పెంచేస్తే ఆదాయం పెరిగిపోయి లాభాల బాటలో పడతాం అనే ఆలోచన దానికి కారణం. 


JackSeal

Recommended Posts

జరిగేది ఏమిటంటే, ధరలు పెంచుకొంటూ పోతే వినియోగదారులు ప్రత్యామ్నాయం చూసుకుంటారు. వినియోగదారులు తగ్గటం వలన ఆ సంస్థ/రంగం మరింత నష్టపోవటం తప్ప మరేమీ జరగదు. ప్రస్తుతం ఎంతమంది మన సేవలు వాడుతున్నారు, ఆ సంఖ్య ఎలా పెంచవచ్చు, వారు మరల మరల రావాలనిపించే విధంగా అనుభూతి కల్పిస్తున్నామా అని ఆలోచించి, చివరిగా చెయ్యాల్సింది ధర పెంచటం.

దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మన ఆర్టీసీ. గతంలో ఒక ప్రభుత్వ పాలనలో ఆర్టీసీ టికెట్ ధరలు పెంచుకొంటూ పోవటం వలన ప్రయాణీకులు షేర్ ఆటోలకు అలవాటు పడ్డారు. ఎక్కడ చూసినా అయిదుగురు పట్టే ఆటోల్లో పదిమంది దాకా వేలాడుతూ కనపడేవారు. రోడ్ల మీద ఆక్సిడెంట్ లు పెరిగి చాలా మంది పోయేవారు. అయినా ప్రజలు ఆ షేర్ ఆటో లే వాడేవారు. కారణం, ఆర్టీసీ టికెట్ ధర కన్నా తక్కువ ఖర్చు అవ్వటం వలన. ఆర్టీసి మరింత నష్టాల్లోకి కూరుకుపోయింది. ఒకానొక సమయంలో ఆ సంస్థని ప్రైవేటు వారికి అమ్మేసే ప్రయత్నం కూడా జరిగింది.

తర్వాత ప్రభుత్వం మారింది. ఆర్టీసి అధికారులు నష్టాలు చూపించి టికెట్ ధరలు పెంచుకోవటానికి అనుమతి కోసం వెళితే, ప్రజలకు మీరు మెరుగైన సేవలు అందించి occupancy ratio పెంచండి, తర్వాత ధరల గురించి ఆలోచిద్దాం అన్నారు. ఆ అయిదేళ్ళు టికెట్ ధరలు పెంచకుండానే ఆర్టీసీ నడిచింది గతంలో కంటే మెరుగైన ఆదాయంతో.

మరో ఉదాహరణ, Facebook. సేవలు ఉచితంగా అందిస్తూ అకౌంట్ల సంఖ్య ఎలా పెంచాలి, వారు తిరిగి రావటానికి ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తుంది కానీ, సంవత్సరానికి ఒక్క రూపాయి ఫీజు పెట్టినా మొత్తం కూలిపోతుంది.

పదిమంది వద్ద ఒక్కొక్కరి వద్దా పది రూపాయల లాభం వేసుకుంటే వంద లాభం వస్తే, 20 మంది వద్ద ఆరు రూపాయల వస్తే నూట ఇరవై వస్తుంది. ఒక పక్క లాభం పెరుగుతుంది, మరో పక్క వినియోగదారుడు తిరిగి వచ్చే అవకాశం పెరుగుతుంది. ఎక్కువ మందిని మన దగ్గరకు రప్పించుకుంటే వారిని ఎలా monetize చెయ్యవచ్చు అనేది తర్వాత ఆలోచించవచ్చు!

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...