Jump to content

Every NRI family future story..so whats resolution?

anna_vendy

Recommended Posts

వెనుదిరగ లేని ముందడుగు ! 

     వెంకటరమణ ! ఆర్ అండ్ బి లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ !  భార్య-  ప్రభావతి- గృహిణి . పిల్లలు ఆనంద్,  అమృత .

చక్కనైన సంసారం ! అనోన్య దాంపత్యం ! పిల్లలిద్దరూ చక్కగా చదువుతారు . ముందుగా ఆనంద్ కు,  రెండేళ్లకు అమృత కు మంచి ఇంజనీరింగ్ కాలేజీ లో సీట్ వచ్చింది . ఇంజనీరింగ్ కాలేజీ ల లో కొంతమంది డ్రగ్స్ తీసుకొంటారని వెంకటరమణ కు తెలుసు . తన పిలల్లు ఎక్కడ తప్పుదారి పడుతారో అని ఆందోళన చెందాడు ." ప్రేమ వ్యవహారాలు , మద్యం,  డ్రగ్స్   ఇలాంటివి మంచిది కాదు ,  నేను  నిజాయితీగా ఉద్యోగం చేయడం వల్ల,  పెద్దగా ఆస్తులు కూడబెట్టలేదు . మీ చదువే మీ భవిష్యత్తు!" అని  పిల్లలకు పదేపదే చెప్పేవాడు  . ప్రభావతి కూడా పిల్లలిద్దరికీ ఇలాంటి విషయాలు చెప్పేది .

 ఆనంద్,  అమృత ఒకరి తరువాత  ఒకరు ఇంజనీరింగ్ లో పట్టభద్రులయ్యారు  . అమెరికా లో మంచి కాలేజీ ల లో,  పిజి సీట్ సాధించారు .ఆ  రెండు సార్లు వెంకటరమణ తన ఫ్రెండ్స్  కు,  కాలనీ వారికి ఇంట్లో పార్టీ ఇచ్చాడు . అదృష్టం అంటే వెంకటరమణ దంపతులదే అని.. ఇద్దరు పిల్లలు చక్కగా చదువుకొని అమెరికా కు వెళ్లారు అని అందరూ చెబుతుంటే  ఎంతో సంతోష పడ్డాడు . 

  ఆనంద్ , అమృత...  పిజి తరువాత అమెరికా లో జాబ్ సంపాదించి టెక్సాస్ లో ఒకరు , న్యూ జెర్సీ లో ఒకరు సెటిల్ అయ్యారు . వెంకట రమణ ఇద్దరికీ సంబంధాలు వెదికి ఘనంగా పెళ్లి చేసాడు . "ఈ కాలం పిల్లలు ప్రేమ దోమ అని ఏదేదో చేసి తల్లితండ్రులకు తలవంపులు తెస్తారు . నా పిల్లలు చక్కగా  సంప్రదాయాన్ని పాటించారు" అనుకొని మురిసి పోయాడు . "మన పెంపకం కదండీ "అంది ప్రభావతి .  

వెంకట రమణ రిటైర్ అయ్యాడు .రిటైర్ కావడానికి ముందే  సంవత్సరానికి ఒక సారి అమెరికా కు  వెళ్లి పిల్లల దగ్గర  రెండు మూడు నెలలు గడిపే వారు . కూతురు,  అటు పై కోడలు గర్భవతులు కావడం , వారి సంరక్షణ  , పుట్టిన పిల్లల  ఆలన , పాలన , కొడుకు పంపిన డబ్బుతో కోకాపేట లో విల్లా , గండిపేట దగ్గర ప్లాట్స్ కొనడం.. ఇలా  రిటైర్ జీవితం సందడిగా గడిచి పొయ్యింది . దేవుడు నన్ను ఎంత చల్లగా చూసాడు ? ఎలాంటి టెన్సన్స్ లేకుండా నా సంసార జీవితం గడిచింది . ఇప్పుడు రిటైర్ లైఫ్ కూడా చక్కగా నడుస్తోంది" అని వెంకట రమణ చాలా సార్లు    మురిసిపోయాడు .

కొడుకు,  కూతురు,  తమ పిల్లలతో   సంవత్సరానికి ఒక సారి ఇండియా కు వచ్చేవారు . ఆ వారం- పది రోజులు సందడే సందడి . తాము మూడు నెలలు అమెరికా లో .. మిగతా సమయం లో వాట్సాప్,  స్కైప్ వీడియో కబుర్లు . పిల్లలు  దూరతీరం లో వున్నారు అంటే ప్రభావతి కి నమ్మశక్యం అయ్యేది కాదు .

 దంపతుల అరవైయ్యవ దశకం జీవితం  మూడు స్కైప్ కాల్స్ ఆరు ముద్దులతో గడిచిపోతోంది  

   ఈ లోగా కోవిద్ వచ్చింది . అమెరికా కు వెళ్లే అవకాశం లేకపోయింది .  దంపతులిద్దరూ ఇంటికే పరిమితం . కొడుకు కూతురు రెగ్యులర్ గా వీడియో కాల్ చేసేవారు . మాస్క్ పెట్టుకోండి .. బయటకు వెళ్ళకండి అని పదేపదే జాగ్రత్తలు చెప్పేవారు . తన పై తన పిలల్లకు ఎంత ప్రేమో చూసి వెంకటరమణ మురిసి పోయేవాడు . 

   ఇప్పుడు మనవలు  మానమరాళ్ళు ఎనిమిది- పది సంవత్సరాల వయసులోకి వచ్చారు . చిన్నప్పుడు" గ్రాండ్పా.. "  అమ్మమ్మా " అని పిల్లలు చక్కగా మాట్లాడేవారు . ఇప్పుడు వీడియో కాల్ చేసి పదేపదే పిలిచినా కనబడడం లేదు ." ఆన్లైన్ క్లాస్ లో వున్నారు" అని ఒక సారి.." ఫ్రెండ్స్ తో ఆడుకుంటున్నారు అని  ఒక సారి  సమాధానం  వచ్చింది . 

   అమృత ఒక సారి తల్లితో  " అమ్మా !    ఏమీ అనుకోకు .. సామి { సంయుక్త } కు మీతో మాట్లాడాలంటే బోర్ అంట . మీరు పదేపదే "బాగున్నారా ? ఏమి చేస్తున్నారు ? అన్నం తిన్నారా ? బాగా చదువుతున్నారా " అని ఆడుగుతారట. రొటీన్ QUESTIONS .. రొటీన్ ఆన్సర్స్ . బోరింగ్" అంటోంది . పైగా నీకేమో  ఇంగ్లీష్ సరిగ్గా రాదు . నాన్న  ఇండియన్ స్లాంగ్ లో మాట్లాడితే దానికి అది జోక్ లాగా వుంది . పడీపడీ  నవ్వుతోంది . నాకు కోపం వచ్చింది .తిట్టేసాను . 1098 కు ఫోన్ చేస్తాను అని నన్నే బెదిరిస్తోంది . అన్నయ పిల్లలు  మా పిల్లలు "మేము  ఇండియా కు రాము . ఇక్కడే ఉంటాము . మీరు వెళ్ళిరండి" అంటున్నారు . మీకు ఎలా చెప్పాలో తెలియక ఆనంద్ బాధపడుతున్నాడు " అని చెప్పింది . 

ప్రభావతి మనసు చివ్వుక్కు మంది . డిన్నర్ సమయం లో భర్తకు చెప్పి కన్నీళ్లు పెట్టుకొంది. " పిచ్చిదానిలా ప్రవర్తించకు. మన పిల్లలు మనకు ఏమి లోటు చేసారు?  చక్కగా చూసుకొంటున్నారు . ఇక మనవలు మానవరాండ్ర  సంగతి అంటావా ? పాపం . చిన్న పిల్లలు . అక్కడే పుట్టి పెరిగారు . వారికేమి తెలుసు ? అయినా పండెమిక్  పేరుతొ మనం  కలిసి చాన్నాళ్లు  అయ్యింది  . ఇప్పడు వేవ్ ఎలాగూ తగ్గిపోయింది  . అమెరికా కు వెళుదాము . అన్నీ సర్దుకొంటాయి  " అని భార్య కు దైర్యం చెప్పి   ప్రయాణ ఏర్పాట్లు చేసాడు .

    24  గంటల ప్రయాణం .. మొదట్లో సహకరించినట్టుగా ఇప్పుడు ఆరోగ్యం సహకరించడం లేదు . అమెరికా కు చేరిన వెంటనే వెంకటరమణ దంపతులిద్దరూ ఖాయిలా పడ్డారు . ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చింది . కొడుక్కి బాగా ఖర్చయ్యింది . 

అటు పై   అమెరికా లో నే కోవిద్ వాక్సిన్ రెండు డోసులు తీసుకొని ఇండియా కు తిరిగి వచ్చారు . ఇండియా కు వచ్చినప్పటి నుంచి  వెంకట రమణ దంపతులిద్దరికీ ఆరోగ్యం క్షీణించింది . వెంకటర రమణ కు మతిమరుపు వచ్చింది . ఏదో చేయబోయి ఏదో చేస్తున్నాడు . గుర్తు రావడం లేదు . రెండు వారాల్లో ఇంత మార్పు ఎలా వచ్చిందో అర్థం కాలేదు . వయసు ప్రభావమా ? దూర ప్రయాణం వల్లనా ? జెట్  లాగ్ వల్లనా ? లేక వాక్సిన్ ప్రభావమా ? భార్య కు  నడుము నొప్పి , కూర్చుంటే కాళ్ళు వాచిపోతున్నాయి , గ్లాస్ నీళ్లు తాగినా కడుపు ఉబ్బి పోతోంది అంటోంది . ఇద్దరికీ ఒకే సారి ఇలా ఆరోగ్యం పాడైపోవడం ఏంటి ?  "

అనేక ఆసుపత్రులు తిరిగారు .. రకరకాల మందులు వాడారు .. మందులు తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్  బోనస్ . ఆరోగ్యం మరింత క్షీణించింది .. 
ఇప్పుడు  వెంకటరమణ దంపతుల్లో భయం ... ఆందోళన .. తొలి సారిగా ఒంటరి తనాన్ని ఫీల్ అవుతున్నారు . కొడుకు ఫోన్ చేసి "మాకు వయస్సు అయిపోతుంది . మీ అమ్మ కూర్చుంటే  లేవలేని స్థితి . నాకు  ఏమీ చేస్తున్నానో తెలియడం లేదు  . ఓపిక  చచ్చిపోతోంది . మేము ఇక వచ్చి అక్కడే సెటిల్ అయిపోతాము . నిజానికి 24  గంటలు ప్రయాణం చేసే ఓపిక లేదు, కానీ తప్పదు  " అని చెప్పాడు .  

అమెరికా లో ఆనంద్ .. సున్నిత మనస్కుడు . తల్లితండ్రులంటే ఎంతో ప్రేమ,  గౌరవం . వారికి వృద్ధాప్యం సమీపిస్తోంది . తోడు కావాలి . ఆసరా కావాలి . తనకేమో లీవ్ దొరకదు . దొరికినా వారం పది రోజులు . వృద్ధ్యాప్యం లో తల్లితండ్రులను చూసుకోలేని తన స్థితికి తనపై తనకే కోపం,  విసుగు! . కానీ ఏమి చేయగలడు ? అమెరికా లో పీజీ కోసం వచ్చినపుడు జాబ్ వచ్చినపుడు వెనుదిరగ లేని   ముందడుగు వేస్తున్నాని తాను అనుకోలేదు . ఈ వయసు లో ఇండియా కి వెళ్లి అక్కడ స్థిరపడలేడు . జాబ్ అయితే వస్తుంది కానీ,  ఇక్కడి వర్క్ కల్చర్ కి అలవాటు పడ్డ తాను అక్కడ సెటిల్ కాలేడు. ఏది ఏమైనా వెళుదాము అనుకొంటే పిల్లలు అసలు ఒప్పుకోరు . వారం ట్రిప్ కే" మేము రాము .. హాట్ వెథర్ .. పొల్యూషన్ .. బోర్ "అంటున్నారు . పూర్తిగా ఇండియా కు రిలోకేట్ అవుదామంటే  ఒప్పుకొనే సమస్యే లేదు. పోనీ తలితండ్రుల్ని ఇక్కడికే రమ్మందాము అంటే వారికి ఆసుపత్రి ఖర్చులు తడిచి మోపెడవుతోంది. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం తో లాస్ట్ టైం లోన్  తీసుకొని హాస్పిటల్ బిల్స్ కట్టాల్సి వచ్చింది . ఇప్పుడైతే పిల్లల ఎడ్యుకేషన్ ఫ్రీ .. వారి కాలేజీ చదువులకు బోలెడు డబ్బు కూడబెట్టాలి . ఇప్పటికీ లోన్ రికవరీ నెల సరి వాయిదాలు భారంగా ఉన్నాయి  . పోనీ అమ్మ నాన్న ను మంచి ఎగ్జిక్యూటివ్ వృద్ధాశ్రమం లో చేర్పిద్దాము అంటే .. ఆ మాట వారికి చెప్పడానికే తనకు భయం వేస్తోంది . చెల్లి అమృత ది ఇదే పరిస్థితి . ఏమి చెయ్యాలో అర్థం కాక ఆనంద్ సోఫా లో కూర్చొని ఆలోచిస్తున్నాడు . 

   కొడుకు దగ్గరకు వచ్చి హే డాడ్ .. వాట్ happened . వై అర్ యు క్రయింగ్? " అన్నాడు 

    .ఆనంద్ తన మనసులో " దేవుడా . బాగా చదువుకోవడం నా తప్పా ? అమెరికా లో జాబ్ సంపాదించడం నా తప్పా ? అమ్మా నాన్న ను,  అలాగే కన్న పిల్లలని ప్రేమించడం నా తప్పా ? కాదే !. మారేందుకు నాకీ శిక్ష? " 

ఇదే సమయానికి ఇండియా లో వెంకటరమణ ఆలోచిస్తున్నాడు "నేనెంతో అదుష్టవంతుడు అనుకొన్నాను   . పిల్లల  చదువు .. అమెరికా లో సీట్ .. జాబ్.. పెళ్లి .. మొత్తం కలలాగా . అవతలి వారి కళ్ళుకుట్టేలా జరిగిపోయింది .   నేను  జీవితం లో కోరుకొంది  కట్టే కాలే దాకా ఆనందం గా బతకడమే . కానీ ఇదేంటి జీవితం  లో చివరి దశ ఇలా అయిపోతోంది? . తోడు లేదు .. నీడ లేదు .. పని వారు వున్నారు. నిజమే  .. కానీ ఆ ఆప్యాయత అనురాగం .. ఎక్కడి నుంచి వస్తుంది? వెలితి .. బాధ . అర్థం కాని  స్థితి .  పిల్లలని బాగా చదివించడం తప్పా?  వారు బాగా చదివి అమెరికా లో స్థిరపడితే సంతోషపడడం తప్పా ? నేను అందరి మధ్య తరగతి తల్లితండ్రులాగా ఆలోచించాను . తండ్రిగా నా బాధ్యత నెరవేర్చాను . తన కొడుకు బంగారం .. కూతురు అపరంజి . ఇప్పుడు కూడా తామంటే ఎంతో ప్రేమ . తప్పు ఎవరిదీ కాదు ! మరి జీవితం లో చివరి దశ లో నా కెందుకీ శిక్ష ?  "
  
ప్రేమే నేరమా ?

తప్పెవరిది కాదు . కానీ తల్లితండ్రులకు , వారి పిల్లలకు ఈ శిక్ష . ఎందుకు ?  ప్రేమించడమే వారి నేరమా ?  ? ఇండియా లో స్థిరపడినా తల్లితండ్రుల బాగోగులు పట్టించుకోలేని పిల్లలు ఎంతో మంది . వారు బేఫికర్ గా బిందాస్ గా బతికేస్తున్నారు . 

  కానీ మన కథలో ఆనంద్ కు కన్నీళ్లే . తండ్రి వెంకటరమణ కు కన్నీళ్లే . అలాగే అమృత కు ప్రభావతి కి కూడా . ఎందుకు  మనసున్నందుకా వారికీ శిక్ష ? మనసున్న వారికి సుఖం ఉండదా ? 

కథ లో పాత్రలు నాలుగే . నిజ జీవితం లో ఇలాంటి వారు నేడు లక్షల్లో . ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి ? ఆలోచించండి . చర్చించండి .

  • Sad 1
Link to comment
Share on other sites

10 minutes ago, anna_vendy said:

Bro .. india lo vunna vallu antha parents ni super ga chuskuntara.  It’s part of life . Manam old age ki vachina alone ga ne vundali .. 

Link to comment
Share on other sites

1 minute ago, siva604 said:

Summary of story:

Kids are successful

Made lot of money

Venkatramana uncle also successful

Everyone is doing good .. They can pay hospital bills with ease. 

As Anand has green card he can come and spend sometime with parents if they are really sick..

In these India news articles:

Endless whining about abroad settled kids

India kids all full love and affection

Lol my azz

Well said .. lavada lo story 

Link to comment
Share on other sites

Naaku thelisina konni examples:

Family1:

Dad: retired elecrical engineer . Moved to USA along with his wife after retirement.

Daughter:Neurologist in KS. 

Son : Cardiologist in KS

Parents: Living good life in USA, Drive around and fly around.. goes to relative houses in different states

Family 2:

Dad: retied gynecologist in India. Mom home maker. Moved to USA after retirement and living with their daughter who is a psychiatrist and administrator.

They have 2 other daughters who live in different states. They travel around and enjoy.

There are lots of happy folks all over.. 

  • Upvote 2
Link to comment
Share on other sites

mana parents left villages and moved to cities , next gen left cities and went abroad , next gen vere planets ki potaru emo , its life cycle , nirantara prakriya ani pakka thread lo oka peddayana cheptunde..

Link to comment
Share on other sites

5 minutes ago, siva604 said:

Idi affluent families stories .. USA is good for parents who could drive and move around on their own 

  • Upvote 1
Link to comment
Share on other sites

2 minutes ago, Simple123 said:

Idi affluent families stories .. USA is good for parents who could drive and move around on their own 

Yeah. Overall people are happy. My parents are in Hyd. Eat and drink whatever they want .. walking... watching tv serials movies.. going to temples.. lots of free time to chit chat with friends.. what else they want lol

Link to comment
Share on other sites

7 minutes ago, Galactus said:

mana parents left villages and moved to cities , next gen left cities and went abroad , next gen vere planets ki potaru emo , its life cycle , nirantara prakriya ani pakka thread lo oka peddayana cheptunde..

I’m already on venus bro

too much gas undi ikkada, abho smell matram baundhi

Link to comment
Share on other sites

2 minutes ago, siva604 said:

Yeah. Overall people are happy. My parents are in Hyd. Eat and drink whatever they want .. walking... watching tv serials movies.. going to temples.. lots of free time to chit chat with friends.. what else they want lol

Yup … I know few friends parents who come here and enjoy on their own … they make friends here .. have kitty parties .. gatherings .. temple visits .. travel together 

Link to comment
Share on other sites

8 minutes ago, Galactus said:

mana parents left villages and moved to cities , next gen left cities and went abroad , next gen vere planets ki potaru emo , its life cycle , nirantara prakriya ani pakka thread lo oka peddayana cheptunde..

You put your kids in residential schools your kids throw you in retirement homes 

I am prepared to put myself in retirement home when I cross 70

Link to comment
Share on other sites

1 minute ago, Midnightsun said:

I’m already on venus bro

too much gas undi ikkada, abho smell matram baundhi

Maa kulapollaki oka city reserve cheyyi baa 

Link to comment
Share on other sites

Just now, kevinUsa said:

Ok agraharam kuda reserve cheyi bro please

Already india modda kudichindi caste valla.. let’s make Venus also like that 

Link to comment
Share on other sites

Just now, Simple123 said:

Already india modda kudichindi caste valla.. let’s make Venus also like that 

Maku agraharam matram mandatory bro

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...