Jump to content

17 years drunk boy play boy story


anna_vendy

Recommended Posts

ఫేస్బుక్ మితృడు ఒకరు, తన బంధువుల అబ్బాయి చెడుదారిలో వెళుతున్నాడని, దయ చేసి కౌన్సిలింగ్ చేయాలని రెండు వారాల క్రితం మెసెంజర్ ద్వారా అభ్యర్తించాడు . నేను బిజీ గా ఉండడంతో సమయం దొరకలేదు . చివరకు నిన్న అపాయింట్మెంట్ ఇచ్చాను .

 

నిన్న:

 

 ముందుగా ఆ మిత్రుడు నా రూమ్ లోకి వచ్చాడు . ఆ అబ్బాయి గురించి అయన చెప్పిన విషయాలు . " ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు .తండ్రి కాలేజీ ప్రిన్సిపాల్ . అయిదు- పది కోట్ల ఆస్థి ఉంది ఫస్ట్ ఇయర్ లో 50 % మార్కులు సాధించాడు . ఇప్పటికి నలుగురు గర్ల్స్ ఫ్రెండ్స్ . తాగడం అలవాటు ఉంది. ఎంతో మంది మానసిక వైద్యుల దగ్గరికి తీసుకొని వెళ్ళాము . వారిని బురిడీ కొట్టిస్తున్నాడు . తనలో ఎలాంటి సమస్య లేనట్టు వారిని నమ్మిస్తున్నాడు . ఇంత మంచి అబ్బాయి ని ఎందుకు తెచ్చారు? అని వారు అడిగే పరిస్థితి.ఒక సారి బ్లెడ్ తో చేయి కోసుకున్నాడు "

 

మీరు బయట కూర్చోండి . ఇప్పుడు ఆ అబ్బాయి ని రూమ్ లోకి పంపండి అన్నాను .

 

ఆ అబ్బాయి ... 

బక్క పలచగా ఉన్నాడు. కళ్ళద్దాలతో ఉన్న అతన్ని చూస్తే బుద్ధిమంతుడు, అమాయకుడు అనిపిస్తుంది . తమిళ్ హీరో ధనుష్ లాగ వున్నాడు . 

 

ఇప్పటికే కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ హాజరయిన అనుభవం ఉంది ." తాగడం మంచిది కాదు .. ఇది బుద్ధిగా చదువుకునే వయసు .. బాగా చదువుకో " లాంటి మాటల్ని నా నుంచి ఆ అబ్బాయి ఎక్సపెక్ట్ చేస్తుంటాడు .

 

రోగాన్ని బట్టి మందు వెయ్యాలి .. కీలెరిగి వాతపెట్టాలి కదా ! తాను వెళుతున్నది సరైన మార్గం .. అనవసరంగా ఈ సైకాలజిస్ట్ అంకుల్స్ నాకు నీతి బోధలు చేస్తున్నారు అనుకునేవాడిని ఏ విధంగా ట్రీట్ చెయ్యాలి ? ఎలా చెయ్యాలో నాకు తెలుసు . అదే పద్దతిలో ట్రీట్మెంట్ మొదలుపెట్టాను . 

 

"పేరేంటి ?"

 

 ఆన్సర్ వచ్చింది 

 

నా అట మొదలయ్యింది ! 

 

  ." హే! నిన్ను ఫలానా పబ్ లో చాలా సార్లు చూసాను "

 

    "ఆ పబ్ లోనా ? అక్కడికి నేను ఒకటో రెండో సార్లు వెళ్ళాను . బహుశా ఈ పబ్స్ లో ఎక్కడో చూసివుంటారు "అని రెండు మూడు పబ్స్ పేరు చెప్పాడు . తాను తరచూ అక్కడికి వెళుతుంటాని గర్వంగా చెప్పాడు .

 

   మెల్లగా నా ట్రాప్ లో పడ్డాడు . అతన్ని అదే మూడో లో ఉండనించి...

 

    " అవునా .. ఉండొచ్చు . సరిగా గుర్తు లేదు . ఒక సారి బాగా డాన్స్ చేస్తున్నావు . కాస్త తూగుతూ కనిపించవు . అయినా నీ కంట్రోల్ సూపర్ . ఎన్ని పెగ్స్ కొడుతావు ?

 

    పిల్లోడు ఫుల్ ఖుషీ .. ఏదో నీతి బోధలు చెబుతాడు అనుకొంటే ఈ అంకుల్ మంచి చాట్ చేస్తున్నాడు అనుకొన్నాడు .

 

 "ఫైవ్ పెగ్స్ కొడుతాను . అయినా ఫుల్ కంట్రోల్ " అన్నాడు . 

 

 " వావ్ .. గ్రేట్ . ఏంటి బీరా ? బీరైతే పెగ్స్ అనరు కదా ?" 

 

 " ఇంకా బీర్ ఏంటి . బెకార్డి.. బేకార్దీ రేర్ .. హండ్రెడ్ పైపెర్స్.. టీచర్స్ .. బ్లాక్ డాగ్ రెగ్యులర్ .."

 

" వావ్. ఫుల్ కాస్టలీ బ్రాండ్స్ .. ట్రెండీ... మీ డాడ్ బాగా సంపాదిస్తుంటాడు . ఏమి చేస్తాడు ?"

 

  డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్" .. చాల గర్వంగా చెప్పాడు .

 

 "మమ్మీ ?"  

 

 " చనిపోయింది" మొఖంలో బాధ .

 

  "ఎక్కడ ఉంటావు ? ఇంట్లో ఎవరెవరు వుంటారు ?".. 

 

  "మా నాన్న .. ఫలానా టౌన్ లో ఉద్యోగం చేస్తున్నాడు . అక్కడే ఉంటాడు . మేము సిటీ లో .. నేను .. నా కజిన్ .. మా అవ్వ .

 

"నలుగురు గర్ల్స్ ఫ్రెండ్స్ లో ఎవరితో ఎక్కువ ఎంజాయ్ చేసావు ?{ నిజానికి నేను ఇక్కడ అతని భాషలో మాట్లాడాను . ఆ పదాల్ని ఇక్కడ రాయలేను } ఈ ప్రశ్న తో అతనిలో మార్పు వచ్చింది . తాను నా ట్రాప్ లో పడి అసలు విషయాలు వాగేస్తున్నానని అర్థం చేసుకొన్నాడు . "ఇప్పుడు నాకు ఒకే గర్ల్ ఫ్రెండ్ సర్ "అన్నాడు . { నాకు అర్థం అయ్యిందేమిటంటే గతం లో ఒకరి తరువాత ఒకరు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు . బ్రేక్ అప్ అయ్యింది . ఇప్పుడు ఈ అమ్మాయి . తాను కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ . సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడు . నేను ఎప్పుడైతే నలుగురు గర్ల్స్ ఫ్రెండ్స్ అన్నానో .. ఇది తన ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ కు తెలిస్తే కష్టం .. అందుకే ఏ గర్ల్ ఫ్రెండ్ తో నీకు ఎక్కువ మజా వచ్చింది ? అనే ప్రశ్నకు ఉలిక్కి పడి వాస్తవ లోకం లోకి వచ్చేసాడు . అటు పై నేను అడిగిన ప్రశ్నలకు తప్పుడు సమాదానాలు ఇవ్వడం మొదలు పెట్టాడు . ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 70 మార్కులు అన్నాడు ." నేను ఎప్పుడో కానీ పబ్ కు పోను . ఎప్పుడో ఒక్క సారి అయిదు పెగ్స్ కొట్టాను అదే మీకు చెప్పాను.. తప్పుగా అనుకోవద్దు .. నేను మారిపోయాను " అని నటించడం మొదలు పెట్టాడు . 

 

ఇక వాడి నుంచి నిజాలు రావు అని నాకు తెలుసు . అయినా నాకు రావాల్సిన సమాచారం వచ్చింది . అతను అబద్ద చెప్పాల్సిన అవసరం లేని ప్రశ్నలు అడిగాను . ఏమి కావాలనుకొంటున్నావు ? " ఆర్కిటెక్ట్ " 

 

నా కౌన్సెలింగ్ ప్రక్రియ లో గేరు మార్చాను . 

 

" ఏంటి ? నిజంగానే ? ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 250 మార్కులు . సెకండ్ ఇయర్ లో అదీ వచ్చే అవకాశం లేదు . నువ్వు ఎంసెట్ రాసి రాంక్ సాధించి బి ఆర్క్ చేసి ఆర్కిటెక్ట్ అయిపోదమనే ? ఇదేమైనా వెబ్ సిరీస్ సినిమా నా ? రాబొయ్యేది రోబో యుగం . మూడొంతుల ఆర్కిటెక్ట్ ఉద్యోగాలు రోబోలు ఎత్తుకెళ్ళి పోతాయి . అదే పనిగా రేయి పగలు చదివిన వారే ఉద్యోగాలకోసం వెతుకులాడుకొనే స్థితి ఉంటుంది . నువ్వేమో పబ్ లు.. అయిదు పెగ్గులు . ఒరేయ్ .. నీ ఏజ్ 17 .. అప్పుడే విస్కీ .. వోడ్కా ..అయిదు పెగ్గులు .. నేను చాలా డిఫరెంట్ అని అనుకొంటావు .. నీ లాంటి ప్రతోడు అలాగే అనుకొంటాడు . ఈ భూలోకం నీ లాంటోళ్లను ఎంతమంది ని చూసి ఉంటుంది ? ప్రతోడికి అదే జీవ వ్యవస్థ .. అదే కిడ్నీ లు .. అదే హార్మోనులు .. అరేయ్ .. నువ్వు మందు గ్లాస్ పట్టుకొనేంత వరకే నువ్వు .. అటు పై దానికి బానిస .. దాని కంటూ కొన్ని రూల్స్ ఉంటాయి . తన పద్దతి ప్రకారం అది పని చేసుకొంటూ పోతుంది . 17 ఏళ్లకు అయిదు పెగ్గులు .మానేసాను .. ఎప్పుడో కానీ పబ్ కు వెళ్ళను అని నువ్వు కహానీ లు చెబితే నమ్మడానికి నేనేమీ లోకం తో టచ్ పోయిన వెర్రి అంకుల్ ని కాను{ ఇక్కడ కూడా నేను వాడిన పదం వేరు . ఇక్కడ దాన్ని రాయలేను } . అరేయ్ .. మారడం నీ చేతిలో లేదు . ఇప్పుడు అయిదు పెగ్స్ .. మరో సంవత్సరం లో హాఫ్ బాటిల్ .. పొద్దునే లేస్తే చుక్క పడక పొతే బెడ్ నుంచి లేవలేని స్థితి త్వరలో వచ్చేస్తుంది . ఇప్పటికే కిడ్నీ లు సగం దొ.. సి ఉంటాయి . ఐదేళ్లకు ఐసీయూ. అరేయ్ .. నీ లాంటి ప్రతోడు . నేను ఫుల్ కంట్రోల్ వున్నాను .. జస్ట్ ఎంజాయ్ చేస్తూ చదువు కొంటాను అనుకొంటాడు . డోపామైన్ అనేది ఒకటి ఉంటుంది . 17 ఏళ్లకే నలుగురు అమ్మాయిల తో సెక్స్ .. డోపామైన్, ఇంకా ఇంకా కావాలి అంటుంది . రేపు ఇంకా ఎంజాయ్ చేయడానికి ఏముంటుంది ? నీ తాగుడికి సెక్స్ పొటెన్సీ చస్తుంది . చదువులో ఫెయిల్ .. ఉద్యోగం లేదు .. నిన్ను పోషిస్తున్న మీ నాన్న కొన్నేళ్లకు రిటైర్ ..అటు పై గోడపై ఫోటో గా మిగిలిపోతాడు . నీకు ఆస్థి వుంది అనుకొంటున్నావు . అది కూడా కర్పూర హారతి లాగ కరిగిపోతుంది . ఉద్యోగం లేని నువ్వు ఏదో పొడిచేద్దామని ఏదో వ్యాపారం మొదలెడుతావు . ఉన్న ఆ అయిదు కోట్ల ఆస్థి మటాష్{ వీడికి ఒక తమ్ముడు ఉన్నాడు. మొత్తం పది కోట్ల ఆస్థి అనుకొంటే వీడి ఆస్థి అయిదు } . అద్దం లో మొఖం చూసుకున్నావా ? 17 ఏళ్లకే బక్క పీనుగులా వున్నావు . నీ గ్లామర్ చూసి అమ్మాయిలు పడ్డారనుక్కొంటున్నావా ? పేస్ చూసుకో .. ఇప్పుడు నువ్వు ఫుల్ కాష్ పార్టీ .. పబ్ ట్రీట్ .. అదీ అట్రాక్షన్ . ఐదారేళ్ళకి ఉద్యోగం సద్యోగం లేక చేతిలో చిల్లి గవ్వ లేని సన్నాసి గా మిగులుతావు . అప్పుడు నీ గర్ల్స్ ఫ్రెండ్ ఎవడితోనో తిరుగుతుంటే అప్పుడు నీకుంటుంది చూడు.... ఇప్పుడు నీ ఎంజొమెంట్ మీ నాన్న క్రెడిట్ . రేపు నీ బస్టాండ్ బతుకు నీ క్రెడిట్ "

 

 చదువు సాగదని , ఉద్యోగం వచ్చే అవకాశం లేదని, ఆరోగ్యం పాడైపోతుందని నేను చెప్పినప్పుడు ఆ మొఖం లో ముందు గా నిర్లప్తత .. అటు పై కొద్దిగా ఆందోళన .. నేను చెప్పే కొద్దీ ఆందోళన తీవ్రమైంది . చివరిగా నీ గర్ల్ ఫ్రెండ్ ఎవడినో చూసుకొంటుంది అంటే మాత్రం రోషం పొడుచుకొని వచ్చింది . " ఆ అమ్మాయి లాంటిది కాదు . నేనేంటే ప్రాణం ఇస్తుంది " అన్నాడు " " అబ్బా .. అమర ప్రేమ .. ఇద్దరూ బ్లేడ్ బ్యాచ్ అన్న మాట . అన్నట్టు మొన్న మీ నాన్న తిట్టాడని బ్లేడ్ తో చేతిని కోసుకొన్నవట కదా. బలే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావు . సరే రా ..ఆ అమ్మాయి మంచిదే .. డబ్బు లేక పొతే బాయ్ ఫ్రెండ్ ను మార్చేసే రకం కాదు . సరే . మరి అమ్మాయిని ఏమి పెట్టి పోషిస్తావురా ? భోపాల్ కు వెళ్లి ఆవు కొనుక్కొని దాని పాలమ్మి బతకడానికి ఇది తేజ సినిమా కాదు నాయినా! లైఫ్ .

 

   నీ భవిష్యత్తు చిత్రం చెబుతా విను .. ప్రకృతి అను దేవుడు అను... నీకిచ్చిన ఎంజోయ్మెంట్ లు అన్ని 17 ఏళ్లకే కానించేసావు . సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ కివెళ్ళడానికి రైలు ఎక్కావు. 24 గంటల పయనం . ఫస్ట్ ఏసీ లో దూరావు . నీ దగ్గర ఉన్న ఫుడ్ మొత్తం వరంగల్ స్టేషన్ వచ్చేలోపు తినేసావు డబ్బు ఖర్చుపెట్టేసావు . ఇంకా 22 గంటల జర్నీ వుంది . ఏమి తింటావు ? టాయిలెట్ లో దూరుతావా ? టీసీ వస్తాడు . వరంగల్ లోనో మంచిర్యాల లోనో నిన్ను ప్లాట్ ఫారం పైకి గెంటేస్తాడు . అక్కడ RPF వచ్చి నాలుగు పీకి పోతాడు . ఢిల్లీ కి పోలేవు .. సికింద్రాబాద్ కు తిరిగి రాలేవు . వరంగల్ ప్లాట్ ఫారం పై ముష్టి బతుకు బతికి ఏదో ఒక రోజు పోతావు .. నీకు ఇరవై అయిదు ఏళ్ళు వచ్చేటప్పటికి నీ ఫ్యూచర్ ఇది . పైసా లేదు .. ఉద్యోగం లేదు . తండ్రి ఆసరా లేదు . గర్ల్ ఫ్రెండ్ అసలే లేదు .. 17 ఏళ్లకే జీవితం ఫుల్ ఎంజాయ్ చేశాను అనుకొంటున్నావు కదరా .. ఇదిగో చూడు .. నా ఏజ్ .. నాకు సిక్స్ ప్యాక్ . రెండేళ్ల క్రితం మలేషియా లో అంతకు ముందు న్యూజిలాండ్ లో BUNGY జంప్ చేశా . మరో సంవత్సరం లో ఇంకో సరి చేస్తా . ఇదీ నా ఫిట్నెస్ . లైఫ్ అంటే పెద్ద జర్నీ .. ప్రతి రోజు .. ప్రతి నెల... ప్రతి సంవత్సరం ఎంజాయ్ చెయ్యాలి . ఎంజాయ్ అంటే నువ్వు అనుకోనిది కాదు . అది నీకు పాడె . పెగ్గు పైన పెగ్గు కొట్టినప్పుడు... అమ్మాయి ని .. చేసినప్పుడు వచ్చిన మజా.కు . పది రెట్లు.. వంద రెట్లు... వడ్డీ తో సహా రేపు మూల్యం చెల్లించాలి . కిడ్నీ లు .. లివర్ లు .. మటాష్ .. ఐసీయూ లో .. ప్రతి క్షణం నీ పెగ్గులు రగ్గులు గుర్తుకు వస్తాయి . నేనేదో డబ్బు తీసుకొని కౌన్సిలింగ్ చేసే ప్రొఫషనల్ అనుకొంటున్నావేమో .. అది నా వృత్తి కాదు . నా సర్వీస్ కి లెక్క కడితే నా ఫీజు నువ్వు ఇచ్చుకోలేవు . సాయంకాలం అయిదవుతోంది . ఇప్పటికే నా జిం కు లేట్ అయ్యింది . ఇక నువ్వు వెళ్ళు.. అల్ ది బెస్ట్ తొక్క తోటకూర అని చెప్పను .. నీకు అన్నీ వరస్ట్లే ఇక.. ఇక పో ..అన్నా..

 

నా షాక్ ట్రీట్మెంట్ పని చేసింది . ఎమోషనల్ అయిపోయాడు . "సర్.. నేను మారాలి అనుకొంటున్నాను . ఒకటి రెండు సార్లు ట్రై చేశాను . కానీ డ్రింక్ మానలేక పోతున్నాను. నా లవ్ మాత్రం సిన్సియర్ సర్ " అన్నాడు .

 

"నువ్వు నదిలో కొట్టుకొని పోతున్నావు . నిన్ను రక్షించడానికి నా దగ్గర తాడు వుంది . ఆ తాడు విసిరితే నువ్వు పట్టుకోవాలి . నువ్వు పట్టుకోక పొతే నా ప్రయత్నం వృధా ." నేను తాగుడు మానాలి.. చదువు పై దృష్టి పెట్టాలి" అని ఆలోచన నీలో ఉంటే చాలు . అప్పుడు నా ట్రీట్మెంట్ నీ పై పని చేస్తుంది . మారాలి అని కోరిక నీకు లేకపోతె నా ట్రీట్మెంట్ వేస్ట్ . నువ్వు మారాలి .. పైలోకం లో ఉన్న మీ అమ్మ కోసం మారాలి . నీ గర్ల్ ఫ్రెండ్ కోసమైనా మారాలి . మారాలి మారాలి అని నీ హృదయం పదేపదే స్పదించాలి . అప్పుడు ఇంకో సారి నాఅపాయింట్మెంట్ తీసుకొని కలవు ." . 

 

వేగం గా ప్రవహిస్తున్న నది .. అందులో సుడిగుండం .. పక్కనే మొసళ్ళు .. తాను నదిలో స్విమ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాను అని భ్రమిస్తున్న 17 ఏళ్ళ దారి తప్పిన అమాయకుడు . ఈ సమాజం చెడగొట్టిన పసివాడు . వాడిని కాపాడానికి నాకు మిగిలిన ఒకే ఒక ఆధారం వాడి గర్ల్ ఫ్రెండ్ పై వాడుకున్న ప్రేమ 

 

 . మీకు అర్థం అయ్యిందా ?కాకపోతే మొత్తం మెసేజ్ ని ఇంకో సారి చదవండి . { ఇందులో ఉపయోగించిన భాష కఠినం . తప్పదు . కీలెరిగి వాతపెట్టాల్సి వచ్చిన స్థితి . మీకు అర్థం కావడానికి అదే విధంగా రాసా. సున్నిత మనస్కులకు సారీ .. నేను మాటల్ని మాత్రమే రాయగలిగాను . అతనితో మాటలాడినప్పుడు నా వాయిస్ మోడ్యులేషన్ .. నా ఫేసియల్ ఫీలింగ్స్ .. బాడీ లాంగ్వేజ్ బిన్నంగా, ప్రభావంతం గా వుంది . అది ఇక్కడ మెసేజ్ లో ప్రతిబింబించలేదు .  

 

ఈ మెసేజ్ లోని కుర్రాడు ఒంటరి కాదు . వాడిలాగా దారి తప్పిన యువత వేలల్లో .. లక్షల్లో

 

 .. పతనమైన కుటుంబ వ్యవస్థలు .. దిక్కు తెలియని పేరేటింగ్.. కుప్పకూలిన విద్యావ్యవస్థలు ... అన్నింటికీ మించి దిక్కుమాలిన రోగం .. దాని సాకుతో నెలల తరబడి స్కూల్స్ కాలేజీ లు మూత.. ఆన్లైన్ .. సెల్ ఫోన్ .. వీడియో లు . పోర్న్ లు .. మైనర్ ల కు డ్రింక్ పోసి డబ్బు సంపాదించే పబ్ లు .. మామూళ్లకు అలవాటు పడ్డ రక్షక వ్యవస్థలు .. ఇవేవీ పట్టని ప్రభుత్వాలు, రాజకీయ పార్టీ లు .. TRP రేటింగ్స్ కోసం నాటకాలాడే టీవీ చానెల్స్ .. 

 

  వెరసి కలిసి... మంచి మాట్లాడొద్దు .. చెడు జరుగుతుంటే చూడొద్దు ..

 

 ఇంటికో సైతాను .. టెర్రరిస్ట్ .. ఆస్థి కోసం డబ్బు కోసం అమ్మ నాన్న ను బ్లేడ్ తో గొంతు కోసే బ్యాచ్ లు పుట్టుకొస్తున్నాయి .. వేచి చూడండి .

 

 వద్దనుకొంటే స్పందించండి . మనిషిగా మీ వంతు పాత్ర పోసించండి . మౌనం వీడండి .

Forward as recived. 🙏👍

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...