Jump to content

Jagan anna development


psycopk

Recommended Posts

7 minutes ago, csrcsr said:

Pin this thread bro convenient ga ubtadi andariki 

Isonti threads pin kuda avasaram ledu…first page la top threads la vuntadi…

That is power of Chandranna..! 

  • Haha 2
Link to comment
Share on other sites

జగన్ కక్షపూరితంగా పాలిస్తున్నారు.. శ్రీలంక బాటలోనే ఏపీ: పురందేశ్వరి 

14-07-2022 Thu 08:52
  • రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగానే ఉందన్న పురందేశ్వరి
  • మద్య నిషేధం తీసుకొస్తానన్న జగన్, మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారని విమర్శ 
  • కేసుల విషయంలో జగన్‌కు బీజేపీ అండగా నిలుస్తోందన్న వాదనను కొట్టిపడేసిన వైనం
  • జనసేనతో పొత్తు కొనసాగుతుందని స్పష్టీకరణ
AP Will become like Sri Lanka Says Purandeswari

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి శ్రీలంకను తలపిస్తోందని, రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఢిల్లీలో ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని జగన్ కక్షతో పాలిస్తున్నారని ఆరోపించారు. 

ఏపీ అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించలేదన్నది అబద్ధమని, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం చాలా సహకరించిందని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడంతో ఉపాధి అవకాశాలు కరవయ్యాయన్న పురందేశ్వరి.. ప్రజలు తమ కష్టాలను సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలోని సమస్యలపై బీజేపీ ఎప్పటికప్పుడు ఆందోళనలు చేస్తూనే ఉందని పేర్కొన్నారు.

మద్య నిషేధం తీసుకొస్తామన్న జగన్ లిక్కర్ రేట్లు పెంచేసి మద్యాన్ని ఆదాయ మార్గంగా మార్చుకున్నారని ఆరోపించారు. అప్పులు, ఉచిత పథకాలతో ఏపీ కూడా శ్రీలంకలా మారే అవకాశం ఉందన్నారు. రాష్ట్రం పరిస్థితి ఆందోళనకరంగానే ఉందన్నారు. కేసుల విషయంలో జగన్‌కు బీజేపీ పూర్తిగా సహకరిస్తోందన్న ఆరోపణలపై పురందేశ్వరి స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. 

ఇక రాష్ట్రంలో పొత్తుల గురించి అధినాయకత్వం ఆలోచిస్తుందని, అది తమ పని కాదన్నారు. జనసేనతో పొత్తు మాత్రం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని పురందేశ్వరి స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేయాలన్న నిర్ణయం జాతీయ విధానంలో భాగమని ఆమె వివరించారు.

Link to comment
Share on other sites

పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం గ‌డువును 2024కు పొడిగించిన కేంద్రం 

19-07-2022 Tue 16:52
  • పోల‌వ‌రం ప్రాజెక్టుపై ప్ర‌శ్నించిన టీడీపీ ఎంపీ క‌న‌క‌మేడ‌ల‌
  • రాజ్య‌స‌భ‌కు రాత‌పూర్వ‌క స‌మాధానం ఇచ్చిన కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ‌
  • ఈ ఏడాది ఏప్రిల్ నాటికే పూర్తి కావాల్సి ఉంద‌ని వ్యాఖ్య‌
  • రాష్ట్ర ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్య‌మ‌ని వెల్ల‌డి
polavaram project deadline extended again

పోలవ‌రం ప్రాజెక్టును పూర్తి చేయ‌డానికి నిర్దేశించిన గ‌డువును కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోమారు పొడిగించింది. 2024 జులై నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయ‌డానికి సాధ్య‌ప‌డుతుందని కేంద్ర జ‌ల శ‌క్తి శాఖ మంగ‌ళవారం పార్ల‌మెంటులో ఓ ప్ర‌క‌ట‌న చేసింది. పోల‌వ‌రం ప్రాజెక్టును ఎప్ప‌టిలోగా పూర్తి చేస్తార‌ని టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర కుమార్ అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంగ‌ళ‌వారం రాజ్య‌స‌భ‌లో రాత‌పూర్వ‌క స‌మాదానం చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికే పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంద‌ని అందులో కేంద్రం వెల్ల‌డించింది.

ఈ సంద‌ర్భంగా ఏపీ ప్రభుత్వంపై కేంద్ర జ‌ల శ‌క్తి శాఖ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డింది. రాష్ట్ర ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం చోటుచేసుకుంటోంద‌ని ఆరోపించింది. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వ‌హ‌ణ‌లోనూ రాష్ట్ర ప్ర‌భుత్వ వైఖ‌రి లోప‌భూయిష్టంగా ఉంద‌ని విమ‌ర్శించింది. కరోనా కూడా ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి కారణంగా నిలిచిందని కేంద్రం తెలిపింది. ఈ నేప‌థ్యంలోనే పోల‌వరం ప్రాజెక్టు గ‌డువును మ‌రోమారు పొడిగించ‌క త‌ప్ప‌డం లేద‌ని కేంద్రం వెల్ల‌డించింది.

Link to comment
Share on other sites

అప్పు పుట్టిన ప్ర‌తి చోటా రుణాలు తీసుకుంటున్నారు... ఏపీ అప్పుల‌పై కేంద్రం వ్యాఖ్య‌ 

26-07-2022 Tue 14:16
  • 2022-23 ఏడాదిలో రూ.44,574 కోట్ల రుణాల‌కు ఏపీకి అనుమ‌తి
  • తొలి నెల‌లోనే రూ.21,890 కోట్ల రుణాన్ని తీసుకున్న రాష్ట్ర ప్ర‌భుత్వం
  • తొలి 3 నెల‌ల్లో ప‌రిమితిలో స‌గానికి పైగా రుణాల సేక‌ర‌ణ‌
  • టీడీపీ ఎంపీ క‌న‌క‌మేడల ప్ర‌శ్న‌కు కేంద్ర ఆర్థిక శాఖ స‌మాధానం
uninon government statement on ap debts in rajya sabha once again

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న రుణాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోమారు పార్ల‌మెంటు వేదిక‌గా వివరాలు పేర్కొంది. అప్పు పుట్టిన ప్ర‌తి చోటా రాష్ట్ర ప్ర‌భుత్వం రుణాలు తీసుకుంటోంద‌ని కేంద్రం వ్యాఖ్యానించింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం రాజ్య‌స‌భ‌లో టీడీపీ ఎంపీ క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి పంక‌జ్ చౌద‌రి లిఖిత‌పూర్వ‌క స‌మాధానం ఇచ్చారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం మొత్తానికి అనుమ‌తించిన రుణాల్లో స‌గానికి పైగా రుణాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం తొలి 3 నెల‌ల్లోనే సేక‌రించింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. 

2022-23 ఆర్థిక సంవ‌త్స‌రానికి నిక‌ర రుణ ప‌రిమితి కింద ఏపీకి రూ.44,574 కోట్ల రుణాల‌కు కేంద్రం అనుమ‌తించింద‌ని మంత్రి వివ‌రించారు. ఇందులో మొద‌టి 9 నెల‌ల‌కు గాను రూ.40,803 కోట్ల రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వానికి అనుమ‌తి ఉంద‌ని తెలిపారు. తొలి 3 నెల‌ల్లోనే రాష్ట్ర ప్ర‌భుత్వం 50 శాతానికి మించి అప్పులు తీసుకుంద‌న్నారు. అందులో ఏప్రిల్ నెల పూర్త‌య్యేనాటికే... అంటే ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభమైన తొలి నెల‌లోనే రూ.21,890 కోట్ల రుణాన్ని తీసుకుంద‌ని మంత్రి తెలిపారు

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...