Jump to content

VIKRANT RONA Movie review


Telugumoviereviews

Recommended Posts

VIKRANT RONA Movie review 

vikrant%20rona%20review.webp

 

'ఈగ', 'బాహుబలి', 'సైరా నరసింహారెడ్డి' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ తాజాగా 'విక్రాంత్ రోణ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమాపై సుదీప్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కేజీఎఫ్' ఫ్రాంచైజ్ తర్వాత కన్నడ నుంచి వస్తున్న ఆ స్థాయి సినిమా అని చెప్పుకున్నారు. అయినా ఈ సినిమాపై తెలుగులో మాత్రం బజ్ క్రియేట్ కాలేదు. మరి మౌత్ టాక్ తో ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించే అంత కంటెంట్ ఈ మూవీలో ఉందో లేదో తెలుసుకుందాం.

కథ:-
అటవీ ప్రాంతంలో ఉండే కమరొట్టు అనే గ్రామంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. చనిపోయిన వారిలో ఎక్కువగా చిన్న పిల్లలుంటారు. ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆ ప్రాంత ఇన్ స్పెక్టర్ కూడా దారుణంగా హత్య చేయబడతాడు. ఇదంతా కమరొట్టులోని పాత బంగ్లాలో ఉన్న భూతం పనేనని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. అటు వైపు వెళ్ళడానికి కూడా భయపడుతుంటారు. అలాంటి ప్రాంతానికి కొత్తగా ఇన్ స్పెక్టర్ గా వస్తాడు విక్రాంత్ రోణ(సుదీప్). వచ్చీ రాగానే, పాత ఇన్ స్పెక్టర్ ని ఎవరు హత్య చేశారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? దీని వెనక ఎవరున్నారు? అంటూ విచారణ మొదలుపెడతాడు. ఈ క్రమంలో విక్రాంత్ తెలుసుకున్న విషయాలేంటి? హత్యల వెనక ఎవరున్నారు? నిజంగానే అక్కడ భూతం ఉందా? అసలు విక్రాంత్ కి ఆ ఊరికి సంబంధం ఏంటి? అనేది మిగతా కథ.

వరల్డ్ వైడ్ కంటెంట్ ని ఇంట్లో కూర్చొని చూస్తున్న ఈ ఓటీటీ యుగంలో మిస్టరీ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాలంటే.. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ లో కూర్చొని చూసేలా చేయగలగాలి. కానీ 'విక్రాంత్ రోణ' అలా చేయలేకపోయింది. అక్కడక్కడా థ్రిల్ చేస్తూ ఒక మాదిరి సినిమాలా మిగిలిపోయింది. For more information visit Teluguone.com official website

Click here to get full Review about Vikrant Rona movie

Link to comment
Share on other sites

vikranth-rona-telugu.webp

గత కొద్ది వారాలుగా టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాలు వరుసగా పరాజయం పాలవుతుంటే అనూహ్యంగా కన్నడ మూవీ 'విక్రాంత్ రోణ' తెలుగులో విజయం సాధించింది. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా నాలుగు రోజుల్లో తెలుగు డబుల్ ప్రాఫిట్స్ తీసుకొచ్చింది.

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా మూవీ 'విక్రాంత్ రోణ' జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

29న విడుదలైన 'రామారావు ఆన్ డ్యూటీ'కి నెగటివ్ టాక్ రావడంతో పాటు నాలుగో రోజు ఆదివారం కావడంతో ఏకంగా రూ.1.01 కోట్ల షేర్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో 2.92 కోట్ల షేర్(5.80 కోట్ల గ్రాస్) వసూలు చేసి మంచి లాభాలతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. For more information visit Teluguone.com official website

Click here to get more information about Vikrant Rona Movie updates

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...