Jump to content

Mamatha ,bjp lakshman, harsha kumar, VH on CBN arrest


psycopk

Recommended Posts

22 hours ago, psycopk said:

Bhuma Akhila Priya: చంద్రబాబు అరెస్ట్ అంటే గొప్ప పని అనుకుంటున్నారేమో... అది మీ అంతం!: భూమా అఖిలప్రియ 

11-09-2023 Mon 22:36 | Andhra
  • జగన్ మార్పు తీసుకువస్తారని ఓటేస్తే ఉన్న ఉద్యోగాలు పోతున్నాయన్న అఖిలప్రియ
  • వారిని రౌడీలుగా, గూండాలుగా మార్చి, జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శ
  • చంద్రబాబు వయస్సుకు కూడా మర్యాద ఇవ్వలేదని ఆగ్రహం
  • పోలీసులు మనసు చంపుకొని చంద్రబాబును అరెస్ట్ చేశారని వ్యాఖ్య
  • ప్రజలు గుర్తు పెట్టుకుంటారు... వైసీపీకి డిపాజిట్లు రావన్న మాజీ మంత్రి
 
Bhuma Akhila Priya on chandrababu arrest

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్, కస్టడీ నేపథ్యంలో ఆ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోమవారం ఓ వీడియోను విడుదల చేశారు. రాష్ట్రానికి ఏం దౌర్భాగ్యం పట్టిందో కానీ ఇలాంటిది (అరెస్ట్) చూడాల్సి వచ్చిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారన్నారు. నేడు బంద్ సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా మద్దతిచ్చారన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. 

చంద్రబాబు కంటే జగన్ ఇంకా ఎక్కువ మార్పు తీసుకువచ్చి, యువతకు ఉద్యోగాలు తీసుకువస్తారని భావించి 2019లో ఓటేశారని, కానీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు పోతున్నాయన్నారు.

వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను రౌడీలుగా, గూండాలుగా మార్చి, వారి జీవితాలతో ఆడుకుంటున్నారని దుయ్యబట్టారు. రాయలసీమకు న్యాయరాజధాని తీసుకువస్తామని చెప్పి మోసం చేశారన్నారు. వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి సహా ఆ పార్టీ నాయకులు కక్ష సాధింపులు, వారి కుటుంబ ఆస్తులు పెంచుకోవడం పైనే దృష్టి సారించినట్లుగా కనిపిస్తోందన్నారు. 

చంద్రబాబు అరెస్ట్ అంటే గొప్పపని అన్నట్లుగా మీడియా ముందుకు వస్తున్నారని, కానీ అది మీ అంతం అని తెలుసుకోవాలన్నారు. ప్రజలు మీకు ది ఎండ్ అని ఇవ్వబోతున్నారు... వైసీపీ నాయకులకు ఇక రాజకీయ భవిష్యత్తు లేదు, ప్రజలు మిమ్మల్ని చరిత్రహీనులుగా చూస్తారన్నారు.

చంద్రబాబు వయస్సుకు కూడా మర్యాద ఇవ్వలేదన్నారు. డెబ్బై మూడేళ్లు ఉన్న రాజకీయ నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేయడం విడ్డూరమన్నారు. మమ్మల్ని అడ్డుకునేవారు లేరనే విధంగా విర్రవీగుతున్నారని, కనీసం గవర్నర్ సంతకం కూడా లేకుండా అరెస్ట్ చేశారన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యే సమయంలో తాము కళ్లారా చూశామన్నారు. నంద్యాల ప్రోగ్రాం పూర్తయ్యాక ఆయన అలసిపోయి పడుకుంటే, అర్ధరాత్రి రెండు గంటలకు ఆయనను లేపి, తెల్లవారుజామున తీసుకు వెళ్లారన్నారు. ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.

ఒకప్పుడు వైసీపీ ఉండేది అనే స్థాయికి తీసుకువస్తున్నారన్నారు. వైసీపీ జెండా పట్టుకున్న చాలామంది కూడా ఈ అరెస్ట్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారన్నారు. పోలీస్ డిపార్టుమెంటులో చాలామంది తమ మనసును చంపుకొని, ఉన్నతాధికారుల ఒత్తిడితో అరెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారన్నారు. పోలీస్ డిపార్టుమెంట్‌లో ఒకరిద్దరు అత్యుత్సాహం చూపించి ఉండవచ్చు... కానీ మిగతావారంతా బాధపడుతున్నారన్నారు.

తాము అధికారంలోకి వస్తే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామని చెప్పిన వైసీపీ... కనీసం స్పెషల్ టీ కూడా కేంద్రాన్ని అడగలేకపోతోందని విమర్శించారు. కేవలం కేసులకు భయపడి కేంద్రం ఆడించినట్లుగా ఆడుతోందన్నారు. టీడీపీపై కక్ష సాధింపు చర్యలు మాత్రమే వైసీపీ లక్ష్యమన్నారు. ఎప్పుడూ టీడీపీని తిట్టడం, అక్రమ కేసులు పెట్టడం తప్ప అభివృద్ధిపై మాట్లాడారా? నిధులు తీసుకు వచ్చిన విషయాలు చెప్పారా? అని ప్రశ్నించారు.

చంద్రబాబు బయటకు వస్తే... మరిన్ని కేసులు పెట్టి, మళ్లీ మళ్లీ జైలుకు పంపించాలని రోజా, ఇతర మంత్రులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా దానికి వెయ్యి రెట్ల బలంతో, కసితో ఆయన ముందుకు వస్తారన్నారు. తమ పార్టీ అధినేతతో కలిసి ముందుకు నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకులకు డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబును అరెస్ట్ చేశాక, తండ్రిని చూసేందుకు వెళ్లిన లోకేశ్‌ను అడ్డుకున్నారన్నారు. వైసీపీ ఈ రాష్ట్ర రాజకీయాల్లో మానవత్వాన్నే చంపేసిందన్నారు. చంద్రబాబును జైలుకు పంపించేంత వరకు మీరు చేసిన అక్రమాలు, పాపాలు, అన్యాయాలు ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారని, వైసీపీకి డిపాజిట్లు కూడా రావన్నారు. బంద్‌కు సహకరించిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. 

 
 

Ticket confirm ayite eemeki

Link to comment
Share on other sites

On 9/11/2023 at 1:43 PM, psycopk said:

k laxman: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ బీజేపీ నేత కే లక్ష్మణ్ స్పందన 

11-09-2023 Mon 17:32 | Both States
  • చంద్రబాబు అరెస్ట్ సరికాదన్న తెలంగాణ బీజేపీ నేత
  • ఎలాంటి వివరణ అడగకుండా ఎలా అరెస్ట్ చేస్తారని వ్యాఖ్య
  • ఎఫ్ఐఆర్‌లో పేరు చేర్చకుండా అరెస్ట్ చేయడం సరికాదన్న లక్ష్మణ్
 
BJP Laxman responds on Chandrababu arrest

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌పై బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ స్పందించారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు అరెస్ట్ సరికాదన్నారు. ఎలాంటి వివరణ అడగకుండా టీడీపీ అధినేతను అరెస్ట్ చేశారన్నారు. ఎఫ్ఐఆర్‌లో పేరు చేర్చకుండానే అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఆయనను అరెస్ట్ చేసిన తీరును బీజేపీ తప్పుబడుతోందన్నారు.

మరోవైపు, చంద్రబాబు హౌస్ రిమాండ్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ పూర్తయింది. హౌస్ రిమాండ్ కంటే చంద్రబాబుకు రాజమండ్రి కేంద్రకారాగారంలోనే భద్రత ఉంటుందని సీఐడీ వాదనలు వినిపించింది. ఈ క్రమంలో కేంద్రకారాగారంలో భద్రతపై మరింత వివరణ కావాలని చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అడిగారు. చంద్రబాబుకు ముప్పు విషయంలో సంబంధిత అంశాలను లూథ్రా... న్యాయమూర్తికి వివరించారు.

Maree murisi poku thathoo vallaki kanukaa cbn support chesthe Modi thatha TDP ongobettastahduu 

Link to comment
Share on other sites

mynampalli hanmantharao: చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన మైనంపల్లి హన్మంతరావు 

15-09-2023 Fri 19:09 | Both States
చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమన్న మైనంపల్లి
ఐటీ రంగంలో ఆయన వల్ల అనేకమందికి ఉద్యోగాలు వచ్చాయని వ్యాఖ్య
అరెస్ట్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలా కనిపిస్తోందన్న తెలంగాణ ఎమ్మెల్యే 
 
Mynampalli Hanmantharao responds on Chandrababu arrest

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌పై తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు స్పందించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... టీడీపీ అధినేత అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు. ఆయనకు ముఖ్యమంత్రిగా అపార అనుభవం ఉందని, ఐటీ రంగంలో ఆయన వల్ల అనేకమందికి ఉద్యోగ అవకాశాలు దక్కాయన్నారు. చంద్రబాబు అరెస్ట్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలా కనిపిస్తోందన్నారు.

రెస్టును ఖండించిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ

చంద్రబాబు అరెస్టును సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కూడా ఖండించింది. అనుమానాల ప్రాతిపదికన అరెస్ట్ చేయడం ఏమాత్రం సరికాదని పేర్కొంది. ఆధారాలు చూపకుండా ఆరోపణలపై అరెస్ట్ బాధాకరమని, అంతేకాకుండాప్రతిపక్ష నేత అరెస్ట్‌లో పారదర్శకత కనిపించలేదని పేర్కొంది. రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న చంద్రబాబు భద్రతపై అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, ఎల్వీ సుబ్రహ్మణ్యం, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తదితరులు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీలో ఉన్నారు.

Link to comment
Share on other sites

Chandrababu: చంద్రబాబు స్వేచ్ఛను హరించడం దురదృష్టకరం: మాజీ కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు 

16-09-2023 Sat 07:04 | Both States
  • చంద్రబాబుకు మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత సురేశ్ ప్రభు మద్దతు
  • టీడీపీ అధినేత స్థాయి, వయసులను అనుసరించి వ్యవహరించి ఉండాల్సిందని వ్యాఖ్య
  • ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం ఉండాలన్న సురేశ్ ప్రభు
 

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సురేశ్ ప్రభు మద్దతు ప్రకటించారు. చంద్రబాబు తన స్వేచ్ఛకు దూరంకావడం దురదృష్టకరమంటూ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా వ్యాఖ్యానించారు. 

‘‘నేను ప్రయాణంలో ఉన్నాను. ప్రజల గౌరవాభిమానాలు పొందుతున్న నాయకుడు చంద్రబాబుకు చట్టబద్ధంగా లభించిన స్వేచ్ఛను దూరం చేసిన దురదృష్టకరమైన ఘటన గురించి ఇప్పుడే విన్నా. ప్రజాబలం ఉన్న పార్టీ అధినేతగా చంద్రబాబు స్థాయి, వయసుకు తగ్గట్టుగా ఆయనతో వ్యవహరించి ఉండాల్సింది. భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణ, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే స్వేచ్ఛ ఉండాలని ప్రజాస్వామ్యం చెబుతోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

 
 
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...