Jump to content

'తల' లేకుంటే తలలు పగులుతాయ్: తేల్చిచెప్పి&#3


kingmakers

Recommended Posts

తలకాయలాంటి హైదరాబాద్ లేని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తమకొద్దనే వద్దని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. అందువల్ల తలలేని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తే మాత్రం ఇక్కడ తలకాయలు పగులుతాయ్ అని హెచ్చరించారు. అదేసమయంలో రాష్ట్ర విభజన అంటూ జరిగితే ఒక అంగుళం భూమిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.

న్యూఢిల్లీ నుంచి ప్రచురితమయ్యే ప్రముఖ ఆంగ్లపత్రిక ఒకటి జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సమర్పించనున్న నివేదికపై ఒక కథనాన్ని ప్రచురించింది. ఇందులో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సూచన చేయనుందని పేర్కొంది.

దీనిపై కేసీఆర్ శుక్రవారం హైదరాబాద్‌లో స్పందించారు. ఆంగ్లపత్రిక ప్రచురించిన కథనంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రాంతంలో తెలంగాణ ఏ విధంగా విలీనమైందో అదేవిధంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాటి సరిహద్దుల రేఖకు కాస్త అటూఇటూ జరిగినా నాలుగు కోట్ల తెలంగాణ ప్రాంత ప్రజలు అంగీకరించేందుకు సిద్ధంగా లేరన్నారు.

హైదారాబాద్ లేని తెలంగాణ ఏర్పాటును తాము కలలో కూడా ఊహించుకోలేమన్నారు. ఈ సందర్భంగా జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి, ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఒక హెచ్చరిక చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లేకుండా ఇదే జరిగితే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఉవ్వెత్తున ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. అదేసమయంలో ఆ పత్రిక కథనాన్ని కేసీఆర్ కొట్టిపారేశారు.

Link to comment
Share on other sites

×
×
  • Create New...