Jump to content

ల్యాండ్ టైట్లింగ్ ఒక భయంకరమైన చట్టం. మీరు కష్టపడి సంపాదించిన చిన్న ఇల్లు కూడా మిగిలే పరిస్థితి ఉండదు


psycopk

Recommended Posts

Nara Lokesh: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో మీ భూమి, మీ ఇల్లు మీది కాదు :నారా లోకేశ్ 

10-05-2024 Fri 12:09 | Andhra
  • ల్యాండ్ టైటిలింగ్ చట్టం రాకతో భూ సంబంధిత ఫిర్యాదులు పెరిగాయన్న లోకేశ్ 
  • అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ
  • కూటమిని అధికారంలోకి తీసుకురావాలని లోకేశ్ పిలుపు
 
Nara Lokesh and Chandra Babu Naidu reacts on Land Titiling act

ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో మీ ఇల్లు మీది కాదని, మీ భూములు మీవి కావని ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తెలుగుదేశం నేత నారా లోకేశ్ రాష్ట్ర ప్రజలకు ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో 2020 ఏప్రిల్ నుంచి 2023 మే వరకు రెవెన్యూ శాఖకు 1.34 లక్షల భూ సంబంధిత ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అందులో భూ ఆక్రమణలపై ఫిర్యాదులు 31 వేలు కాగా, రికార్డుల్లో తప్పులు దొర్లిన అంశంపై 39 వేల ఫిర్యాదులు ఉన్నాయన్నారు. ఇక వైఎస్సార్ కడప జిల్లాలో 1,892 భూ ఆక్రమణల ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఫిర్యాదు చేయనివ్వకుండా బెదిరించిన, ఫిర్యాదులు అధికారులు తీసుకోని ఘటనలు అనేకం ఉన్నాయని నారా లోకేశ్ చెప్పారు. 

ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా మీ భూములకు సంబంధించిన దస్తావేజులు చేతికివ్వరని, అధికారం, డబ్బు,కండబలం  ఉంటే ఎటువంటి భూమినైనా రాజకీయనేతలు కొట్టేసే అవకాశముందని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. సరైన కాగితాల్లేవని యజమానులనే జైల్లో పెట్టే అవకాశముందని తెలిపారు. భూ హక్కులపై వారసత్వాన్ని అధికారులు మాత్రమే నిర్ణయించగలుగుతారని లోకేశ్ వెల్లడించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా జగన్ మోహన్ రెడ్డి మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టే అవకాశముందని, మీకు అన్యాయం జరిగిందని కోర్టులకూ కూడా వెళ్లలేని పరిస్థితులు ఏర్పడతాయని వివరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.

మరోవైపు కూటమి అధికారంలోకి రాగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా హామీ నిచ్చారు. స్థిరాస్తితో మనిషికి ఉండే అనుబంధం భూమికి చెట్టుకు ఉన్నంతగా ఉంటుందని తెలిపారు. వందల తరాలకు సరిపడా ఆస్తులను దోచుకుని దాచుకోవడమే కానీ, ఆ తరాల మధ్య ప్రేమలను సీఎం జగన్ పట్టించుకోడని అందుకే ఆయన చెల్లెలు షర్మిలను కూడా దూరం పెట్టాడని చంద్రబాబు తూర్పారబెట్టారు.

Link to comment
Share on other sites

Another u turn attempt

by shadow cm

 

Land Titling Act: ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ఆమోదించింది నాటి చంద్రబాబు సర్కారే: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 

10-05-2024 Fri 14:09 | Andhra
  • కేంద్రమే తీసుకొచ్చిన ఈ చట్టాన్ని నాడు ఎందుకు ఆమోదించారని సజ్జల నిలదీత
  • చట్టాన్ని రద్దు చేయమని ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలకు దమ్ముంటే చంద్రబాబు చెప్పగలరా అని సవాల్
  • ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలులోకి వస్తే భూవివాదాల పరిష్కారం మరింత సులభతరమవుతాయని వెల్లడి
 
YSRCP Sajjala Ramakrishna Reddy Press Meet

భూముల సర్వేలన్నీ పూర్తయి ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలులోకి వస్తే భూ వివాదాల పరిష్కారం మరింత సులభతరమవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్రం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి నాడు చంద్రబాబు ప్రభుత్వమే పూర్తిగా ఆమోదముద్ర వేసిందని ఆయన గుర్తు చేశారు. 

ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది భూ యజమానికి ప్రభుత్వం తరఫున పూర్తి హామీ ఇవ్వడమేనని సజ్జల స్పష్టం చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. నాడు టైటిలింగ్ చట్టానికి ఆమోద ముద్ర వేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని నేడు అదే పార్టీ ఈ చట్టంపై దుష్ర్పచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై టీడీపీ దుష్ర్పచారం చేస్తోందన్నారు. 

దమ్ముంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ ఓ చెత్త చట్టమని ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా ల ద్వారా చంద్రబాబు ఒక మాటైనా చెప్పించగలరా అని సజ్జల సవాల్ చేశారు. చంద్రబాబు తన పదవీ కాలంలో చేసిన మంచి పనులేమీ లేక, చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతోనే వైసీపీ ప్రభుత్వంపై ఈ విధమైన దుష్ర్పచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరైనా ఎన్నికలు దగ్గరకొస్తే తమ పార్టీ ఏంచేస్తుందో ప్రజలకు తెలిసేలా ప్రకటనలు ఇచ్చుకుంటుందని, అయితే తెలుగుదేశం పార్టీ చేయగలిగిందేమీ లేకపోవడంతోనే ఇటువంటి తప్పుడు ప్రకటనలు ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ విధమైన ప్రకటనల ద్వారా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై అభాండాలు వేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలని చంద్రబాబు చూస్తున్నారని సజ్జల తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై చంద్రబాబుది దింపుడుకళ్లెం ఆశని ఎద్దేవా చేశారు. ఇటువంటి దుష్ర్పచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని పిలుపునిచ్చారు. చంద్రబాబు హామీలను, ఆయనను ప్రజలెవరూ నమ్మడం లేదని తెలిపారు. 

Link to comment
Share on other sites

On 5/7/2024 at 12:48 AM, Sizzler said:

Edhedho matladutunnaru anna… Jagan property teeskoni evarina foreigners ki ammestada… lekunte state lo unna properties annee thana peru meedha raskuntada… WE HAVE A CONSTITUTION and WE ARE A DEMOCRACY. Please don’t spread fake news just to win a state election.  

I think you need to be more worried about CBN if there is such a scope to take over the lands. 
 

TDP&JS ki migilina oke oka weapon anukunta ee land Tilting Act… extreme levels ki veltunaru in my opinion. 

aa maathram undaali. 

Baboru last time chepparu Jagan vasthe no Amaravati no Polavaram ani, adhi nijame gaa evadyna pattichukunnadaa. Adhi asalu evariki sambandham ey ledhu annattu Jagan ki vote chesaaru. 
 

ippudu thama properties daggara ki vasthadu ani chepthunte shiver ayyi chasthunnaru. 
 

Lands ichina Amaravati farmers usuru, Land Title Act ayyi Jagan meda ki chuttukundhi. He is gone. 

Link to comment
Share on other sites

1 hour ago, andhra_jp said:

 

watched the video, Best video on land titling act. looks like Govt dint take proper precautions before passing the bill in assembly. Act is good but many loopholes which govt dint address

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...