Jump to content

హైదరాబాదులో 11 స్కైవేలు ఇవిగో!


timmy

Recommended Posts

హైదరాబాదులో 11 స్కైవేలు ఇవిగో!      07:50 PM

హైదరాబాదు ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ నియంత్రించేందుకు హైదరాబాదులో 11 స్కైవేలు నిర్మించాలని అన్నారు. పలు చోట్ల ఎలివేటర్లు, కారిడార్లు, మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్లు నిర్మించాలని ఆయన స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ప్రదేశాల ఎంపిక కోసం చర్చించారు.

హరిహర కళాభవన్ నుంచి ఉప్పల్, మాసబ్ ట్యాంక్ నుంచి హరిహరకళాభవన్ కు, నాగార్జున సర్కిల్ నుంచి మాదాపూర్ కు, తార్నాక నుంచి ఈసీఐఎల్ కు, చార్మినార్ నుంచి బీహెచ్ఈఎల్ మార్గాల్లో ఈ 11 స్కైవేలు నిర్మించాలని ఆయన ఆదేశించారు. మధ్యలో మెట్రో రైలు మార్గం అడ్డం వస్తే దాని మీదుగా స్కై వే నిర్మించాలని ఆయన అధికారులకు సూచించారు.

Link to comment
Share on other sites

హైదరాబాద్‌లో స్కైవేలు: సీఎం కేసీఆర్
Updated : 12/19/2014 7:08:09 PM
skyway.jpg
హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ అధికారులతో సమీక్ష జరిపారు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు నగరంలో 11 చోట్ల స్కైవేలు నిర్మించాలని సీఎం ప్రతిపాదించారు. పలుచోట్ల ఎలివేటర్లు, కారిడార్లు, మల్టిలెవెల్ గ్రేడ్ సెపరేటర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అవసరమైన ప్రదేశాల ఎంపిక కోసం సమీక్షలో చర్చ జరిపారు.

స్కై వేలు నిర్మించే ప్రాంతాలు:
హరిహరకళాభవన్-ఉప్పల్, మాసబ్ ట్యాంక్-హరిహరకళాభవన్, నాగార్జున సర్కిల్-మాదాపూర్, తార్నాక-ఈసీఐఎల్, చార్మినార్-బీహెచ్ఈఎల్ మార్గాల్లో స్కైవేలు నిర్మించాలని సీఎం ఆదేశించారు. మెట్రో రైలు మార్గం అడ్డువస్తే దానిపై నుంచి స్కైవేలు పోనియాలని పేర్కొనా్నరు.

 

Link to comment
Share on other sites

×
×
  • Create New...