Jump to content

‘రక్షించండి నాన్న అని ఆఖరి సెల్ఫీ వీడియో’


TampaChinnodu

Recommended Posts

close

 

విజయవాడ: విజయవాడలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి కర్కశంగా వ్యవహరించడంతో పాటు పోలీసులు కూడా ఏం చేయలేని నిస్సహాయత కారణంగా ఓ పన్నేండేళ్ల పాప బలైంది. ‘బ్రతకాలని ఉంది.. నన్ను బ్రతికించండి నాన్న’ అంటూ పది రోజుల పాటు అతడి ఇంటికి తిరిగినా కనికరించకపోవడంతో క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారి చివరకు ప్రాణాలు కోల్పోయింది. ప్రాణం పోవడానికంటే ముందు ఆ పాప మాట్లాడిన వాట్సాప్‌ వీడియో అందరినీ కంటతడిపెట్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. మాదంశెట్టి శివకుమార్‌, సుమశ్రీలు భార్య భర్తలు. ఇరువురు విడిపోయారు.

వారికి సాయిశ్రీ అనే పాప ఉంది. అయితే, వారు విడిపోయే సందర్భంలో సాయిశ్రీ పేరిట దుర్గాపురంలో ఓ ఇంటిని రాసిచ్చాడు శివకుమార్‌. అతడు ఓ రౌడీ షీటర్‌.. పైగా స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో పాటు పలువురి నాయకుల అండదండలు ఉన్నాయి. అయితే, అనూహ్యంగా సాయిశ్రీ ఇటీవల క్యాన్సర్‌ బారిన పడింది. ఆమెను రక్షించుకునేందుకు తల్లి సుమశ్రీ తన వద్ద ఉన్న సొమ్మంతా వెచ్చించింది. మెరుగైన వైద్యం చేయించకుంటే పాప బతకదని అపోలో వైద్యులు చెప్పడంతో బెంగళూరు కేన్సర్‌ వైద్యం కోసం తీసుకెళ్లాలనుకున్నారు.

సాయిశ్రీకి కేన్సర్‌ ఉన్నట్లు తెలుసుకున్న శివకుమార్‌ అదే అదనుగా చూసుకొని ఎమ్మెల్యే బోండా అండదండలతో కొంత మంది కబ్జాదారులతో దుర్గాపురంలో కూతురుకి రాసిచ్చిన ఆ ఇంటిని కబ్జా చేయించారు. అయితే, తన ప్రాణం రక్షించుకునేందుకు ఆ ఇంటిని అమ్ముకునే అవకాశం ఇవ్వాలంటూ సాయిశ్రీ, ఆమె తల్లి సుమశ్రీ శివకుమార్‌ ఇంటి చుట్టూ దాదాపు పది రోజులు తిరిగారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాణాలు పోతున్నాయి నాన్న అని కన్న కూతురు చెబుతున్నా శివకుమార్‌ మనసు కరగలేదు. పైగా బెదరింపులకు దిగాడు. దీంతో అరకొర వైద్యం మాత్రమే పొందుతున్న సాయిశ్రీ  ప్రాణాలు కోల్పోయింది.

Link to comment
Share on other sites

  • Replies 49
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    15

  • mettastar

    5

  • vendetta

    5

  • Prabhas_Fan

    3

Top Posters In This Topic

Just now, pahelwan said:

RIP :('

kanna bidda ne champukunna kasayi edava thandri. Daniki adhikara pulka party MLA support. Pichi Lk lu

yes man. pathetic. Differences vunna kooda, how can one do this to own daughter.

Link to comment
Share on other sites

5 minutes ago, Peddayana said:

Disturbing :(  couldn't watch the full video , very sad 

Yeah, Was very hard to watch the video now knowing the kid is no more :(((((((( 

Link to comment
Share on other sites

నన్ను బతికించు డాడీ..

Posted On: Sunday,May 14,2017
1494785558.35.jpg

- తండ్రితో పోరాడి ఓడిన కుమార్తె
- క్యాన్సర్‌ బారినపడి మృత్యువాత
- 'నాన్న నీకు దండం పెడతా! నన్ను కాపాడు' అంటూ చివరిసారిగా వాట్సప్‌లో వీడియో పెట్టిన చిన్నారి శివశ్రీ
- అయినా కనికరించని తండ్రి కఠిన హృదయం
ప్రజాశక్తి - విజయవాడ సిటీ ప్రతినిధి:
              'డాడీ ప్లీజ్‌ డాడీ.. నన్ను బతికించు. నీకు దండం పెడతాను. వైద్యం అందించి నన్ను కాపాడు. నాకు బతకాలనుంది డాడీ. స్కూలుకెళ్లి ఫ్రెండ్స్‌తో ఆడుకోవాలని, మంచిగా చదుకోవాలని ఉంది డాడీ. ఏదోఒకటి చేసి నన్ను బతికించు. నాకు క్యాన్సర్‌ అంటే నువ్‌ నమ్మడం లేదు కదూ.. నా చేతులు చూడు డాడీ నల్లబడ్డాయి. నా మొహం చూడు డాడీ ఎలా ఉందో.. ఎప్పుడూ నన్ను వెంకట సుబ్బమ్మ అంటూ మీ అమ్మతో పోల్చుతావు కదా డాడీ.. మీ అమ్మ అనుకుని వైద్యం చేయించు. అమ్మ దగ్గర నిజంగా డబ్బులు లేవు డాడీ. అన్నీ అయిపోయాయి. నాకు ఇంకా మూడురోజులే టైం ఉంది. నేను చనిపోతే నా చావుకు మీరే కారణం డాడీ' అంటూ.. క్యాన్సర్‌ బాధితురాలు శివశ్రీ తన వాట్సప్‌ వీడియోలో మాట్లాడిన మాటలివి. తనను బతికించమంటూ వేడుకున్న ఆ చిన్నారి ఆవేదన యావత్‌ రాష్ట్రాన్ని కన్నీళ్లు పెట్టించింది. అయినా ఆ తండ్రి కఠిన హృదయం కరగకపోవడంతో.. పదమూడేళ్లకే ఆ చిన్నారికి నిండు నూరేళ్లు నిండాయి.
విజయవాడ దుర్గాపురంలో ఆదివారం జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాపితంగా తీవ్ర సంచలనానికి దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. మాధవశెట్టి శివకుమార్‌, సుమశ్రీల కుమార్తె మాధవశెట్టి వెంకట సాయి కృష్ణ శివశ్రీ(13) కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. అయితే ఆ దంపతులిద్దరూ గొడవలు, మనస్పర్థలతో విడిపోయారు. దీంతో శివశ్రీ తల్లివద్దే ఉంటోంది. 2007లో తన కుమార్తె పేరుతో దుర్గాపురం ఈడ్పుగంటి లక్ష్మణరావు వీధిలో గల నాగేంద్ర టవర్స్‌ గ్రౌండ్‌ఫ్లోర్‌లోని ఒక ప్లాట్‌ను కొనుగోలు చేశారు. అప్పట్లో తమ కుమార్తె మైనర్‌ కావడంతో సంరక్షకునిగా తన భర్త మాధవశెట్టి శివకుమార్‌ పేరు పెట్టారు. భర్తకు మధ్య మనస్పర్థలు రావడంతో అతను బెంగుళూరులో ఉంటున్నాడు. తన కుమార్తె బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతూ ఉండడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయిస్తూ కొంత కాలంగా అక్కడే ఉంది. ఎలాగైనా ఖరీదైన వైద్యం అందించి బతికించుకోవాలని బిడ్డ పేరుతో ఉన్న అపార్టుమెంట్‌ను అమ్మి వైద్యం చేయించాలనుకుంది.

ఇక్కడే కథ అడ్డం తిరిగింది
ఇన్నాళ్లూ ఆ ఇంటిని సుమశ్రీ అద్దెకు ఇచ్చారు. ఇటీవల అద్దెకుంటున్న వారిని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అనుచరులమంటూ గడ్డం రవి అనే వ్యక్తి వారిని బెదిరించి ఖాళీ చేయించి ఇంటిని ఆక్రమించారు. తన ఇంటిని ఇతరులు ఆక్రమించడమేమిటని ప్రశ్నిస్తే బోండా ఉమా కార్యాలయానికి వెళ్లి మాట్లాడుకోవాలని ఆక్రమణదారులు చెప్పారని గత నెల చివరి వారంలో దీక్ష చేపట్టిన సందర్భంలో బోరున విలపించింది. ఇంత తతంగం జరుగుతున్నా సుమశ్రీ భర్త తెరమీదకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే భర్త మాధవ శెట్టి శివకుమార్‌ సహకరించకపోవడంతో బిడ్డను కోల్పోయ్యానని సుమశ్రీ బోరున విలపించారు. భార్యభర్తల మధ్య నలిగిపోతున్న ఆ చిన్నారి చివరి నిమిషంలోనూ తల్లితో కలిసి ఉండాలని వాళ్ల నాన్నకు సెల్‌ ఫోన్‌, వాటప్స్‌ ద్వారా విజ్ఞప్తి చేయడం చూస్తుంటే తల్లిదండ్రుల ఎడబాటు మధ్య తాను ఎలా నలిగిపోయిందనే విషయం ఇట్టే అర్థమవుతోంది.

ఎమ్మెల్యే బోండా ఉమా పాత్ర..
పాప మృతికి కారణమైన శివకుమార్‌ ఎమ్మెల్యే బొండా ఉమా అనుచరుడు. ఇల్లు అమ్మడం ఇష్టం లేక.. ఎమ్మెల్యే బోండా ఉమాతో మాట్లాడించి తన అనుచరులను పంపారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆ ఇంట్లోకి వచ్చిన వారు కూడా ఎమ్మెల్యే అనుచరులమంటూ బెదిరింపులకు దిగారని అంటున్నారు. అంతేకాకుండా న్యాయం కోసం వేళ్తే.. తమను లెక్కచేయలేదని బాధితులు చెబుతున్నారు. తనను, తన కుమార్తెను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన సెంట్రల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, పాపకు వైద్యం అందించవద్దని సలహాలు ఇచ్చిన న్యాయవాది ఎస్‌.శేషగిరిరావు కూడా పాప మృతికి కారకులేనని ఆరోపించారు. శివకుమార్‌ తనను, తన బిడ్డను వేధింపులకు గురిచేశాడని తల్లి సుమశ్రీ ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమార్తె చనిపోవడానికి కారకులైన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కోరారు.

భర్త, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ 
కుమార్తె మృతికి కారణమైన శివకుమార్‌, ఆక్రమణదారులపై సుమోటోగా కేసును స్వీకరించి తమకు న్యాయం చేయాలని బాధితురాలు ఆవేదనతో కోరింది. తన కుమార్తె మృతికి కారకులైన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. తన కుమార్తె మరణానికి పూర్తి బాధ్యుడు పాప తండ్రి మాధంశెట్టి శివకుమార్‌ అని ఆరోపించారు.

నాకు ఎక్కడా న్యాయం జరగలేదు : తల్లి సుమశ్రీ 
చైల్డ్‌ వెల్ఫేర్‌కు కంప్లెయింట్‌ ఇస్తే మీరు ఎమ్మెల్యే పేరు చెబితే మీకు ట్రీట్‌మెంట్‌ అందదు. మీకు ట్రీట్‌మెంట్‌ ముఖ్యం అంటూ కంప్లెయింట్‌ తీసుకోలేదు. నా కూతురు పడ్డ కష్టాలు, చిత్రహింసలకు గురి చేసిన మాధం శెట్టి శివకుమార్‌పై యాక్షన్‌ తీసుకోవాలని పోలీసులను కోరినా వారు నా గోడు ఆలకించలేదు. నాకు ఎక్కడా న్యాయం జరగలేదు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...