Jump to content

రూ.2వేల నోటును కూడా రద్దు చేస్తారా?

TampaChinnodu

Recommended Posts

రూ.2వేల నోటును కూడా రద్దు చేస్తారా? 
రాజ్యసభలో వివరణ కోరిన విపక్షాలు 
26brk-rj1a.jpg

న్యూదిల్లీ: ‘పెద్దనోట్ల రద్దు తర్వాత తీసుకొచ్చిన రూ.2వేల నోటును కేంద్రం రద్దు చేయాలనుకుంటుందా? కొత్తగా రూ.వెయ్యి నాణేన్ని తీసుకురావాలనుకుంటుందా? దీనిపై ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలి’ అంటూ రాజ్యసభలో విపక్షాలు వివరణ కోరాయి. ఆ సమయంలో జైట్లీ సభలోనే ఉన్నా.. విపక్షాల ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

రాజ్యసభ శూన్యగంటలో సమాజ్‌వాద్‌ పార్టీకి చెందిన నరేశ్‌ అగర్వాల్‌ ఈ అంశంపై పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తారు. ‘రూ.2వేల నోటును ప్రభుత్వం రద్దు చేయాలనుకుంటోంది. ఆర్‌బీఐ ఇప్పటికే ఆ నోటు ముద్రణను ఆపివేయాలని సూచించింది. ఒకవేళ రద్దు నిర్ణయం తీసుకుని ఉంటే సభలో ఆ విషయాన్ని వెల్లడించాలి’ అని డిమాండ్‌ చేశారు. ఆర్‌బీఐ 3.2 లక్షల కోట్ల రూ.2వేల నోట్లను ముద్రించిందని, ప్రస్తుతం ఈ నోట్ల ముద్రణను ఆపి వేసిందని నరేశ్‌ అగర్వాల్‌ సభకు తెలిపారు. ఇప్పటికే ఒకసారి నోట్లను రద్దు చేశారని, రెండోసారి కూడా అలాంటి ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తోందని అన్నారు. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరణ ఇవ్వాలి అని డిమాండ్‌ చేశారు.

దీనిపై రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పీజే కురియన్‌ స్పందిస్తూ ‘అది ఆర్‌బీఐ చర్య’ కదా అని అనగా.. ఇది వరకు చేపట్టిన నోట్ల రద్దు నిర్ణయం కూడా ఆర్‌బీఐది కాదని నరేశ్‌ అగర్వాల్‌ అన్నారు. తొలిసారి నోట్ల రద్దు అంశాన్ని ఆర్‌బీఐ తిరస్కరించినప్పటికీ ప్రభుత్వం దాన్ని చేపట్టిందన్నారు. రెండోసారి కూడా ప్రభుత్వమే ఆ నిర్ణయం తీసుకుంటోందని తెలిపారు.

దీనిపై కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ మాట్లాడుతూ కొత్తగా రూ.వెయ్యి నాణేన్ని తీసుకొస్తున్నట్లు తెలిసిందని, దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీని గురించి రోజూ వింటున్నామని చెప్పారు. ‘అది ఎంతవరకు నిజం? కేవలం మీడియా రాతలేనా? ఏది నిజం?’ అంటూ ప్రశ్నించారు. తాము పర్సులకు బదులు ఆ నాణెల కోసం బ్యాగులు కొనుగోలు చేయాలా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రూ.2వేల నోటు రద్దుకు సంబంధించి వూహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉందని జేడీయూ నేత శరద్‌యాదవ్‌ కూడా కోరారు.

Link to comment
Share on other sites

back fire avvudoo emo 2000 note ban chesthe... ippatike kastam ayithundi antunnaru... 

Country corruption free avvali kani janalu matram konchem kastam kuda orchukoru... endo emo...

Link to comment
Share on other sites

3 hours ago, Ara_Tenkai said:

back fire avvudoo emo 2000 note ban chesthe... ippatike kastam ayithundi antunnaru... 

Country corruption free avvali kani janalu matram konchem kastam kuda orchukoru... endo emo...

Prajalu sahakarinchaaru evaru kadanlega... Ippudu kuda ACB raids lo vaatillo pedda pedda officers ni pattukuntunnaru valla daggara anta cash that too new currency ela vastondi that too hardly 6-7 months after demonitization, adi chuse maamulu janalaki kaaledi...

Link to comment
Share on other sites

Just now, Kool_SRG said:

babu ki sahakarichadam ante. samanyudu sarvam sanka nak poyi bank la mundu boche pattuku nilabadali ani antunnademo.

Link to comment
Share on other sites

3 minutes ago, Mitron said:

babu ki sahakarichadam ante. samanyudu sarvam sanka nak poyi bank la mundu boche pattuku nilabadali ani antunnademo.

Malli gattiga amayina ante neeku desi bhakthi ledu malli edava sodi @~`

Link to comment
Share on other sites

1 minute ago, Kool_SRG said:

Malli gattiga amayina ante neeku desi bhakthi ledu malli edava sodi @~`

banisatvam nara narallo jeernunchuku poyindi manaku.. 

evademi chesina noretti adga koodadhu... 

aa rbi gademo siggu lekunda parliament lo inka notelu lekkedutunnam anta. lk balls gallu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...