Jump to content

హ్యుండయ్' కూడా హుష్ కాకే


sid_22

Recommended Posts

[color=red][size=18pt]హ్యుండయ్' కూడా హుష్ కాకే!
భారీ రాయితీలకు సీఎం ససేమిరా
అచ్చిరాని ఆటోమొబైల్ రంగం
[/size][/color]
[size=14pt]హైదరాబాద్ : రాష్ట్రానికి ఆటోమొబైల్ రంగం అచ్చిరావటం లే దు. ఆంధ్రప్రదేశ్*కు వచ్చినట్లే భావించి న హ్యుండ య్ మోటార్స్ విడిభాగాల తయారీ యూనిట్ కూడా హుష్*కాకి అనేలా కన్పిస్తోంది. దీంతో రాష్ట్రంలో రూ. 500 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు అటకెక్కినట్లే. ఎందుకంటే.. కం పెనీ కోరుతున్న విధంగా 'భారీ' రాయితీలు ఇవ్వటానికి సీఎం రోశయ్య అంగీకరించటం లేదని పరిశ్రమల శాఖ వ ర్గాలు తెలిపాయి.

వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి గత నెలలోనే ఎంవోయూ కుదరాల్సి ఉన్నా.. రాయితీల అంశంపై పీటముడి పడటంతో కంపెనీ వెనక్కిపోయినట్లు పరిశ్రమల శాఖ వర్గాలు చెబుతున్నాయి. హ్యుం డయ్ మోటార్స్ మాత్రం రాష్ట్రంలో ఆటోమొబైల్ విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటుకు తమిళనాడు తరహాలోనే 21 ఏళ్ల పాటు వంద శాతం వ్యాట్ రాయితీ ఇవ్వాలని కోరుతోంది. దీంతో పాటు విద్యుత్*కు సంబంధించి ప్రస్తుత పారిశ్రామిక విధానంలో ప్రకటించిన 0.75 పైసల సబ్సిడీతో పాటు తమకు అదనపు రాయితీ కావాలనీ కో రుతోంది.

కానీ, పరిశ్రమలకు సరఫరా చేసే విద్యుత్*పై ఇప్పుడు యూనిట్*కు రూ. 3.53 వసూలు చేస్తోంది. 21 ఏళ్ల వంద శాతం వ్యాట్ రాయితీకి కూడా సీఎం ఆమోదించడం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హ్యుండయ్ మో టార్స్ ఆటో విడిభాగాల యూనిట్ కో సం చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్ ప క్కనే ఉచితంగా 50 ఎకరాలు కేటాయించి.. మరో 50 ఎకరాలు రిజర్వ్ చే సి పెట్టాలని సర్కారు తొలుత భావించింది.

కాగా, ఆటోమొబైల్ రంగంలో రాష్ట్రం ఎంతో వెనకబడి ఉన్నందున హ్యుండయ్ మోటార్స్ కోరుతున్నట్లు తమిళనాడు తరహా రాయితీలు ఇవ్వ టం సముచితమేనని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. భారీ ఎత్తున ఆటోమొబైల్ యూనిట్లున్న త మిళనాడు ప్రభుత్వమే ఈ సంస్థలకు రాయితీలు ఇస్తున్నప్పుడు.. చెప్పుకోద గ్గ ఆటోమోబైల్ పరిశ్రమ ఒక్కటి కూ డా లేని మన రాష్ట్రంలో రాయితీలకు ససేమిరా అనటం సరికాదన్నది వీరి వాదన.

హ్యుండయ్ వంటి కంపెనీ రాష్ట్రానికి వస్తే.. తర్వాత ఇతర కంపెనీ లు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుందని.. ఆ సమయంలో ప్రభు త్వం పెద్దగా రాయితీలు ఇవ్వకపోయి నా ఇబ్బంది ఉండదని వీరు చెబుతున్నారు. హ్యుండయ్ కంపెనీ కోరుతున్న విధంగా ప్రభుత్వం భారీ రాయితీలు ఇస్తే తప్ప హ్యుండయ్ యూనిట్ రాష్ట్రానికి రావటం ఇక అనుమానమేనని తెలుస్తోంది.[/size]


Rosaiah gaa elli Hussain sagar lo dookara poi Pichi fook gaaa..... [img]http://www.bewarsetalk.net/discus/movieanimated6/ms.control.gif[/img]

Link to comment
Share on other sites

×
×
  • Create New...