Ryzen_renoir Posted September 21, 2020 Report Posted September 21, 2020 Just now, DaatarBabu said: Who is this idiot to question high court ? Does he think he know more about law than high court judges ? We demand high court to take contempt case against him Quote
snoww Posted September 21, 2020 Author Report Posted September 21, 2020 మీ గ్యాగ్ ఆర్డర్‌ను సవరించండి 21 Sep, 2020 03:35 IST|Sakshi మీ ఉత్తర్వులవల్ల నా హక్కులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ అత్యంత పవిత్ర హక్కని రాజ్యాంగం చెబుతోంది ఈ హక్కులో మీడియా హక్కులు కూడా మిళితమై ఉన్నాయి హైకోర్టు ఉత్తర్వులు ఆ పవిత్ర హక్కును కాలరాసేలా ఉన్నాయి హైకోర్టులో న్యాయవాది మమత రాణి ఇంప్లీడ్ పిటిషన్ సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఇద్దరు కుమార్తెలపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలను పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో ప్రచురించడం లేదా ప్రసారం చేయరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలైంది. తెలంగాణ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది గలేటి మమత రాణి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అంతేకాక.. అమరావతి భూ కుంభకోణం కేసులో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ దమ్మాలపాటి శ్రీనివాస్ దాఖలు చేసిన వ్యాజ్యంలో తమను ప్రతివాదిగా చేర్చుకుని, తమ వాదనలు వినాలని మమత రాణి తన అనుబంధ పిటిషన్‌లో కోర్టును కోరారు. ఆంక్షలతో పౌరుల హక్కులకు భంగం అధికరణ–19 ప్రకారం.. ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ అత్యంత పవిత్రమైన హక్కుగా రాజ్యాంగం గుర్తించిందని మమత రాణి తన అనుబంధ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ పవిత్ర హక్కులో మీడియా హక్కులు కూడా మిళతమై ఉన్నాయన్నారు. ఈ హక్కులను కాలరాసే విధంగా పూర్తిస్థాయి ఆంక్షలు విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేయడంవల్ల రాజ్యాంగంలోని అధికరణ–19(1) (ఏ) ద్వారా పౌరులకు సంక్రమించిన హక్కులకు భంగం కలిగించడమేనని ఆమె వివరించారు. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు రాజ్యాంగం ప్రకారం అపరిమితమైనది కాదని.. అధికరణ–19(2) కింద రాజ్యాంగం ఆ హక్కుపై కొన్ని పరిమితులు విధిస్తోందని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ కేసులో పూర్తిస్థాయి నిషిద్ధ ఉత్తర్వులు జారీచేయడం భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులకు విఘాతం కలిగించడమే అవుతుందని.. న్యాయస్థానాలు ఇలా చేయడానికి వీల్లేదన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును పలు న్యాయస్థానాల తీర్పులు సమర్థించాయని వివరించారు. ప్రజాస్వామ్య మనుగడకు మీడియా హక్కులు ఎంతో అవసరమని ఆమె తెలిపారు. హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఉత్తర్వులవల్ల తన హక్కులు ఎంతో ప్రభావితం అయ్యాయన్నారు. అందువల్ల ఈ కేసులో తనను ప్రతివాదిగా చేర్చుకుని తన వాదనలను వినాలని ఆమె కోర్టును కోరారు. అలాగే, ఈ ఏడాది జనవరి 10న ‘అనురాధా భాసిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును మమత రాణి తన వ్యాజ్యంలో ప్రస్తావించారు. పత్రికా స్వేచ్ఛపై జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ఏం చెప్పిందంటే.. ప్రజాస్వామ్యంలో పత్రికలు స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితులు ఉండాలి. స్వేచ్ఛాయుత హక్కు రాజ్యాంగం ప్రసాదించిన అత్యంత పవిత్రమైన హక్కు. ఈ హక్కులను ప్రభుత్వాలతో సహా అందరూ గౌరవించాలి. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికల ప్రాచుర్యం ఎంతగానో పెరిగింది. పత్రికలను అడ్డుకుంటే సమాచార వ్యాప్తికి అడ్డుకట్ట వేసినట్లే. భావ ప్రకటన, వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఇంటర్నెట్ వినియోగం వంటి స్వేచ్ఛలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంది. రాజ్యాంగంలోని అధికరణ–19 ప్రకారం.. ప్రాథమిక హక్కుల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఒకటి. దీని ద్వారా అతి ఎక్కువ మందికి తక్కువ కాలంలో సమాచారాన్ని చేరవేసే సౌలభ్యం ఉంది. దాన్ని మేం కాదనడంలేదు. వివిధ సాకులు, కారణాలు చూపి, ఆ సౌలభ్యాన్ని కాలరాయడానికి వీల్లేదు. పత్రికా స్వేచ్ఛను కూడా ప్రభుత్వాలు కాపాడాలి. జర్నలిస్టులు తమ విధులను నిర్వర్తించుకునేందుకు అవకాశం ఇవ్వాలి. Quote
snoww Posted September 21, 2020 Author Report Posted September 21, 2020 రాజధాని రైతుల పిటిషన్లపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. పాలనా రాజధాని విశాఖకు తరలివెళ్లినా, లేకపోయినా... అక్కడ గెస్ట్ హౌస్ కడతామని న్యాయస్థానానికి అడ్వకేట్ జనరల్ తెలిపారు. రైతుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపిస్తున్నారు. Quote
snoww Posted September 23, 2020 Author Report Posted September 23, 2020 అవును.. అందరికీ సంతృప్తే! పోలీసుల బెదిరింపులపై హైకోర్టు కామెంట్ ఆ విషయాన్ని గుర్తించామంటూ ధర్మాసనం నర్మగర్భ వ్యాఖ్యలు చట్ట నిబంధనలు పాటించకపోతే ఎలా? చాలా కేసుల్లో పోలీసులది ఇదే తీరు చీరాలలో యువకుడి అనుమానాస్పద మృతి దర్యాప్తు సీబీఐకి ఇవ్వదగినదేనని వ్యాఖ్య రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సీబీఐ డైరెక్టర్‌కు నోటీసులు తదుపరి విచారణ అక్టోబరు 1కి వాయిదా Quote
snoww Posted September 23, 2020 Author Report Posted September 23, 2020 రాజధాని అంశంపై ఏపీ హైకోర్టులో జనసేన అఫిడవిట్ దాఖలు అమరావతి: రాష్ట్ర ప్రజలకు రాజధానిపై ఉండే హక్కులను, రాజధాని కోసం భూములిచ్చిన రైతుల అంశంపై జనసేన పార్టీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. తమ్మిరెడ్డి శివశంకర్ రూపొందించిన అఫిడవిట్‌ను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆమోదంతో లాయర్ చల్లా అజయ్ కుమార్ కోర్టులో దాఖలు చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘‘రాష్ట్రానికి ఉన్న బాధ్యతలను రాజధాని కోసం భూములిచ్చిన రైతుల హక్కులను, రాష్ట్ర ప్రజలకి రాజధానిపై ఉండే హక్కులను జనసేన పార్టీ ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తూ శివశంకర్ గారు తయారు చేసిన అఫిడవిట్, పవన్ గారి ఆమోదంతో లాయర్ శ్రీ చల్లా అజయ్ కుమార్ దాఖలు చేశారు’’ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. Quote
snoww Posted October 5, 2020 Author Report Posted October 5, 2020 రాజధాని కేసులపై నేటి నుంచి హైకోర్టులో రోజువారీ విచారణ జరుగనుంది. అంశాల వారీగా పిటీషన్లు విచారించాలని ధర్మాసనం నిర్ణయించింది. హైబ్రిడ్ సిస్టం ద్వారా ఢిల్లీ నుంచే న్యాయవాదులు వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని పిటీషనర్లు విజ్ఞప్తి చేశారు. దీనిపై కోర్టు ఈరోజు నిర్ణయం తీసుకోనుంది. విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణం కోర్టు ధిక్కరణపై సీఎస్ సంతకంతో కౌంటర్ దాఖలు చేయాలని గతంలో ధర్మాసనం ఆదేశించగా... అందుకు ప్రభుత్వం సమయం కోరిన విషయం తెలిసిందే. Quote
DaatarBabu Posted October 5, 2020 Report Posted October 5, 2020 రాజధాని అంశంపై రోజువారీ విచారణ అమరావతి: రాజధాని మార్పు సంబంధిత కేసులపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం రేపటి నుంచి రోజువారీ విచారణ చేయాలని నిర్ణయించింది. రాజధాని మార్పుపై మొత్తం 229 అనుబంధ పిటిషన్లు ఉన్నట్లు తెలిపింది. పిటిషన్లను అంశాల వారీగా విభజించి విచారణ జరపనున్నట్లు వెల్లడించింది. మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టు ముందుగా విచారణ చేస్తుందని న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ తెలిపారు. మరోవైపు స్టేటస్ కో ఉత్తర్వులు కొనసాగుతాయని ధర్మాసనం చెప్పినట్లు మరోన్యాయవాది లక్ష్మీనారాయణ వెల్లడించారు. ప్రస్తుతం ఆన్‌లైన్ విధానంలో విచారణ జరుగుతోందని, కీలకపత్రాలు పరిశీలన చేయాల్సి వస్తే ప్రత్యక్ష విచారణ జరిగే అవకాశముందని ఆయన అన్నారు. Quote
DaatarBabu Posted October 6, 2020 Report Posted October 6, 2020 స్టేటస్ కో కొనసాగుతుంది: హైకోర్టు అమరావతి: రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై జనవరిలో శాసనమండలిలో జరిగిన చర్చలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈనెల 9వ తేదీ నాటికి పూర్తి వివరాలు, సీడీలు సీల్డు కవర్‌లో న్యాయస్థానానికి అందజేయాలని స్పష్టం చేసింది. అమరావతికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో ఇవాళ్టి నుంచి రోజు వారీ విచారణ ప్రారంభమైంది. మొదటి రోజు 15 పిటిషన్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. రాజధాని వ్యాజ్యాల అనుబంధ పిటిషన్లపై విచారణను హైకోర్టు ఈనెల 9కి వాయిదా వేసింది. అన్ని కేసులపై స్టేటస్ కో కొనసాగుతుందని ధర్మాసనం వెల్లడించింది. విశాఖలో అతిథిగృహం నిర్మాణానికి సంబంధించిన పిటిషన్‌ను విచారిస్తూ ... ముఖ్యమంత్రి వసతి కోసం నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉన్నాయో చెప్పాలని కోరినట్టు న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. Quote
snoww Posted October 8, 2020 Author Report Posted October 8, 2020 జడ్జిలు, కోర్టులపై మీడియా, సోషల్ మీడియాలో కొందరు ప్రజా ప్రతినిధులు చేస్తున్న కామెంట్లపై హైకోర్టు సీరియస్ అయింది. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు పోలీసులకు చురకలు అంటించింది. కేసులు ఎందుకు నమోదు చేయాలని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ‘‘ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారా?. కోర్డులపైనే దాడికి దిగుతారా?. న్యాయ వ్యవస్థపై యుద్ధం ప్రకటిస్తున్నారా?. స్పీకర్ పదవిలో ఉండి ఇదేం పద్ధతి?. సీతారాం, విజయసాయి ఇతరులపై కేసులేవి?. దేశంలో ఇంకెక్కడైనా ఇలాంటి పరిస్థితి ఉందా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. Quote
snoww Posted October 10, 2020 Author Report Posted October 10, 2020 హైకోర్టు ప్రశ్న.. కరోనా వల్లే ఆగాయన్న ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయిగా! ఎస్‌ఈసీయే సమాధానం చెప్పాలి: ధర్మాసనం అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): కరోనా వల్లే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించలేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టు ధర్మాసనానికి తెలిపారు. గ్రామ పంచాయతీలకు, వార్డులకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ న్యాయవాది తాండవ యోగేశ్, విజయవాడకు చెందిన ఏవీ కృష్ణమూర్తి వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వ న్యాయవాది సి.సుమన్ వాదనలు వినిపిస్తూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదని వివరించారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ.. మరి ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు కదా, ఇక్కడ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది ఏమిటని ప్రశ్నించింది. అయితే, దీనిపై వివరణ ఇవ్వాల్సింది ప్రభుత్వం కాదని, ఎన్నికల కమిషన్ చెప్పాలని ధర్మాసనం పేర్కొంది. దీనికి సమాధానం చెప్పాలంటూ ఎస్‌ఈసీకి నోటీసులు జారీ చేసి... విచారణను వచ్చేనెల 2వ తేదీకి వాయిదా వేసింది. Quote
snoww Posted October 10, 2020 Author Report Posted October 10, 2020 డైరెక్టర్‌ను పిలిచి ఆఫీసు పెట్టమనాలి ‘హెబియస్’ పిటిషన్లపై ధర్మాసనం వ్యాఖ్య సక్రమంగా ఉంటే సస్పెన్షన్లు ఎందుకు? మీడియాకు ఎందుకు భయపడుతున్నారు? పోలీసులపై వేరే జిల్లా పోలీసులతో విచారణా? అధికారులను కాపాడాలనుకుంటున్నారా? హైకోర్టు ధర్మాసనం తీవ్ర స్పందన జగన్ అక్రమాస్తుల కేసుపై ఈడీ ప్రత్యేక కోర్టు విచారణ షురూ అమరావతి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): పోలీసుల అక్రమ నిర్బంధాల కేసులను సీబీఐకి ఇవ్వాలంటే.. ఆ సంస్థ డైరెక్టర్‌ను పిలిచి విజయవాడలోనే సీబీఐ ఆఫీసు పెట్టమనాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘సీబీఐ విచారణ అవసరం లేదు. వేరే జిల్లా పోలీసులతో దర్యాప్తు చేయించాలి’ అని ప్రభుత్వం తరఫు న్యాయవాది పేర్కొనడంపై తీవ్రంగా స్పందించింది. ‘‘వాళ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటారు కదా! మీ పోలీసు అధికారులను కాపాడాలనుకుంటున్నారా?’’ అని ప్రశ్నించింది. వ్యక్తుల అక్రమ నిర్బంధానికి సంబంధించి దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం రాష్ట్రంలో ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ జరిగిందో లేదో తేలుస్తామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై గురువారం మరోమారు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వ ప్రత్యేక కౌన్సెల్, సీనియర్ న్యాయవాది ఎస్.ఎ్‌స.ప్రసాద్ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా ధర్మాసనానికీ, ప్రభుత్వ న్యాయవాదికీ మధ్య ఆసక్తికర సంవాదం జరిగింది. ఇవీ ఆ వివరాలు... న్యాయవాది: ఓ పిటిషన్‌లో అక్రమ నిర్బంధానికి గురయ్యారని చెబుతున్న దంపతులపై కేసులున్నాయి. వారు పిటిషన్‌లో అవాస్తవాలు చెప్పారు. పోలీసులు వారిని అక్రమంగా తీసుకెళ్లారని చెబుతున్న వాహనానికి టోల్‌ప్లాజా రశీదు కూడా చూపుతున్నారు. నిజానికి పోలీసులు టోల్‌ప్లాజా వద్ద డబ్బులు చెల్లించలేదు. ధర్మాసనం: ఈ కేసులో న్యాయాధికారి జ్యుడీషియరీ నివేదిక ద్వారా వాస్తవాలను తెలుసుకున్నాం. న్యాయవాది: న్యాయాధికారి ప్రధాన అంశాలను వెలికితీయలేకపోయారు. అసమగ్రమైన విచారణతో ఇచ్చిన నివేదిక. ధర్మాసనం: నిజానిజాలపై విచారణ జరిపి న్యాయాధికారి నివేదిక ఇచ్చారు. దానిని కూడా అలాగంటే ఎలా? అలాంటప్పుడు మొత్తం వాస్తవాలు వెలికితీసేందుకు ఈ వ్యవహారాన్ని స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఇవ్వాల్సి ఉంటుంది. న్యాయవాది: నేనూ ఇదే అనుకున్నాను. జ్యుడీషియరీ విచారణ చేయించాలి. ధర్మాసనం: మాటిమాటికీ జ్యుడీషియరీ ఎంక్వయిరీ అవసరమేముంది? మెరుగైన దర్యాప్తు సంస్థతోనే విచారణ చేయిద్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి కేసునూ స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఇవ్వాల్సి వస్తే.. సీబీఐ డైరెక్టర్‌ను విజయవాడలోనే ఆఫీసు పెట్టమనాల్సి ఉంటుంది. దర్యాప్తు సంస్థ నివేదికకు, జ్యుడీషియరీ నివేదికకు వ్యత్యాసం ఉన్నప్పుడు వేరే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించడమే మేలు. న్యాయవాది: సీబీఐ విచారణ అవసరం లేదు. వేరే జిల్లా పోలీసులతో దర్యాప్తు చేయించాలి. ధర్మాసనం: వేరే జిల్లా పోలీసులు కూడా ప్రభుత్వ అధీనంలోనివారేకదా! మీ పోలీసు అధికారులను కాపాడాలనుకుంటున్నారా? అంతా సక్రమంగా ఉంటే.. డీజీపీ కొంతమంది పోలీసులను ఎందుకు సస్పెండ్ చేశారు? న్యాయాధికారి విచారణ నివేదిక తప్పుడుదన్న భావన కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారా? న్యాయవాది: అది తప్పుడు విచారణ అని అనలేదు. ప్రధాన అంశాలు పేర్కొనలేదనే చెబుతున్నాను. నేను తప్పుడు నివేదిక అన్నట్లుగా ధర్మాసనం అభిప్రాయపడడం సరికాదు. రేపు మీడియాలో ఇదే వస్తుంది. ధర్మాసనం: మీరెందుకు మీడియాకు భయపడుతున్నారు? మీడియా మీకో, మాకో మార్గదర్శనం చేయలేదు. ‘మీరలా అనకండి.. ఇలా అనకండి.. మీడియా పబ్లిష్ చేస్తుంది’ అని ప్రతిసారీ చెబుతున్నారు. మీరు మీడియానే దృష్టిలో పెట్టుకుని ఉంటారా? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.