Jump to content

***** Andhra High Court Daily Updates ******

snoww

Recommended Posts

పోలీసులు ఏదో ఒకటి తేల్చుకోండి

రాష్ట్రంలో ‘రూల్‌ ఆఫ్‌ లా’ ఉందా? లేదా?

ప్రజాహక్కులను కాపాడేందుకే పోలీసులు

‘పొలిటికల్‌ బాస్‌’ల కోసం కాదు

వ్యతిరేకంగా ఉత్తర్వులిస్తే కష్టాల్లో పడతారు

అప్పుడు ఏ నేతా మీ రక్షణకు రారు

హెబియస్‌ కార్పస్‌ కేసులో హైకోర్టు ఫైర్‌

కోర్టుకు హాజరైన తూర్పు గోదావరి ఎస్పీ 

అమరావతి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోలీసులు అవలంబిస్తున్న వైఖరిని హైకోర్టు మరోమారు తూర్పారబట్టింది. రాష్ట్రంలో అసలు ‘రూల్‌ ఆఫ్‌ లా’ ఉందా లేదా అని నిగ్గదీసి అడిగింది. పోలీసులు ప్రజా హక్కులను రక్షించేందుకే ఉన్నారు తప్ప, ‘పొలిటికల్‌ బాస్‌’ల మనసెరిగి వ్యవహరించేందుకు కాదని కటువుగా వ్యాఖ్యానించింది. బ్యూరోక్రాట్లు, పోలీసు అధికారులు రాజకీయాలు కావాలనుకుంటే యూనిఫారం వదిలేసి వెళ్లాలని, యూనిఫారంలో ఉంటే ప్రజా హక్కులు కాపాడాల్సిందేనని తేల్చిచెప్పింది.

‘‘తలుపులు పగలగొట్టి ఒక న్యాయవాది ఇంట్లోకి అర్ధరాత్రి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయనేమైనా నేరస్థుడా? అంత అత్యుత్సాహం ఎందుకు?’’ అని నిలదీసింది. నేరస్థుడి ఇంట్లోకి సైతం ఆ విధంగా జొరబడకూడదని పేర్కొంది. ఒక న్యాయవాదికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుడి హక్కుల పరిరక్షణ ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలమని దుయ్యబట్టింది. ప్రజలకు అధికారులు జవాబుదారీగా ఉండాలని, వారి హక్కులను పరిరక్షించాలని హితవు పలికింది. ‘పోలీసు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే మేం తీసుకోవాల్సిన చర్యలు తీసేసుకుంటాం. అధికారులకు వ్యతిరేకంగా మేం ఉత్తర్వులిస్తే కష్టాల్లో పడతారు. అప్పుడు ఏ నేతా మిమ్మల్ని ఆదుకోవడానికి రారు’’ అని హెచ్చరించింది. ఆదివారం అర్ధరాత్రి తన భర్త, న్యాయవాది సుభా్‌షచంద్రబో్‌సను తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు, ఏలేశ్వరం పోలీసులు అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారని, ఇంటికొచ్చి తలుపులు పగలగొట్టి దౌర్జన్యంగా తీసుకెళ్లారని పేర్కొంటూ పీ వెంకటప్రియదీప్తి హైకోర్టులో సోమవారం హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై స్పందించిన జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం.. సుభా్‌షచంద్రబో్‌సను తమ ముందు హాజరు పరచాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని ఆదేశిస్తూ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మి హైకోర్టులో నేరుగా హాజరై వివరణ ఇచ్చారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పోలీసులు ఇంటికెళ్లిన సమయంలో చంద్రబోస్‌ పారిపోయారని, ఆయన పోలీసుల అదుపులో లేరని పేర్కొన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారని, ఈ ఘటనపై దర్యాప్తు కోసం డీజీపీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైందని పేర్కొన్నారు. 

పర్యవసానాలు వారికి తెలుసు..

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వీవీ సతీశ్‌ వాదనలు వినిపిస్తూ.. చంద్రబో్‌సను పోలీసులు అర్ధరాత్రి తీసుకెళ్లారని, దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ను పరిశీలించాలని అభ్యర్థించారు. ధర్మాసనం స్పందిస్తూ.. పోలీసులే బలవంతంగా తీసుకెళ్లారని పిటిషనర్‌ చెబుతుంటే.. ఆయన పారిపోయారని ఎలా చెబుతారని ఎస్పీని ప్రశ్నించింది. ఏదేని రాజకీయ కారణంతో ఇలా చెబుతున్నారా అని అనుమానం వ్యక్తంచేసింది. బోస్‌కు ప్రాణహాని ఉందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘‘కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగా ఏ పోలీసు అధికారీ అలాంటి సాహసం చేస్తారనుకోవడం లేదు. ఒకవేళ అలాంటిదేదైనా జరిగితే పర్యవసానం ఎలా ఉంటుందో వారికి తెలుసు. ఈ వ్యవహారాన్ని ఎలా చక్కదిద్దాలో కూడా మాకు తెలుసు’’ అని కటువుగా వ్యాఖ్యానించింది. 

మీరు డైరెక్ట్‌ ఎస్పీనా లేక ప్రమోటీనా?

ఎస్పీని ఉద్దేశించి ‘మీరు డైరెక్ట్‌ ఎస్పీనా? లేక ప్రమోషన్‌పై ఎస్పీ అయ్యారా?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. డైరెక్ట్‌ ఎస్పీ అని ఆయన బదులిచ్చారు. ‘డైరెక్ట్‌ ఎస్పీ అయిన వారు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారన్న ఆశ ఉంటుంది. మీదైన తరహాలో వ్యవహరించండి. మీకు మరెంతో కెరీర్‌ ఉంది. ప్రజా హక్కులు కాపాడండి. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి’’ అని హితవు పలికింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని డీజీపీని, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించింది. నిర్బంధంపై దాఖలైన మరో పిటిషన్‌తో ఈ పిటిషన్‌ను జత చేయాలని సూచించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ లోపు న్యాయవాది సుభా్‌షచంద్రబో్‌సను కనుగొంటే హైకోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. తదుపరి విచారణకు హాజరుపై ఎస్పీకి మినహాయింపునిచ్చింది.

Link to comment
Share on other sites

భూములమ్మే హక్కు మీకెక్కడిది?

07232020014413n34.jpg

అవి ప్రజలవి.. ప్రభుత్వానివి కావు!

రెండింటి మధ్య తేడా తెలుసుకోండి

ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి

రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందా!

సర్కారును నిలదీసిన హైకోర్టు

విక్రయం కొత్త కాదు.. సర్కారు కౌంటర్‌

విధాన నిర్ణయాల్లో జోక్యంపై నిగ్రహం పాటించాలని వినతి

అమరావతి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ప్రజలందరికీ చెందిన ఆస్తులను అమ్మే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని రాష్ట్ర సర్కారును హైకోర్టు నిలదీసింది. ‘పబ్లిక్‌ ల్యాండ్స్‌’ (ప్రజా భూములు)కు, ప్రభుత్వ భూములకు మధ్య తేడా తెలుసుకోవాలని సూచించింది. ‘‘అయినా, ఆ భూముల్ని విక్రయించాల్సిన అవసరమేంటి? అమ్మితే తప్ప ప్రభుత్వం నడవలేని పరిస్థితి ఉందా? ప్రభుత్వమేమైనా దివాలా తీసిందా?’’ అని  ప్రశ్నించింది. ‘మిషన్‌ బిల్డ్‌ ఏపీ’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు, విశాఖ తదితర జిల్లాల్లోని భూముల్ని ఈ-వేలం ద్వారా విక్రయించడానికి చేపట్టిన చర్యలను సవాల్‌ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై బుధవారం జరిగిన విచారణ సందర్భంగా జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్రజా భూములు అన్యాక్రాంతం కాకుండా సంరక్షించే బాధ్యత ప్రభుత్వానిది. కానీ... ప్రభుత్వమే వాటిని ఇష్టానుసారంగా విక్రయిస్తామంటే ఎలా? ప్రజా భూముల్ని ప్రభుత్వం ఎలా విక్రయిస్తుంది?’’ అని ధర్మాసనం నిలదీసింది. ఆ భూముల్ని అమ్మే హక్కు మీకెక్కడిదని సూటిగా ప్రశ్నించింది. ‘‘ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. కానీ... ప్రజల ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది’’ అని ధర్మాసనం పేర్కొంది. అవి ప్రభుత్వ భూములు కాదని, ప్రజా భూములు మాత్రమేనని తేల్చిచెప్పింది. ‘నవ రత్నాలు’ కింద ఇళ్లస్థలాల పంపిణీ కోసం రూ.కోట్ల వ్యయంతో భూముల్ని కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు సంక్షేమ పథకాల అమలుకు ప్రజా ఆస్తులను విక్రయిస్తోందని పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన డీఎ్‌సఎన్‌వీ ప్రసాద్‌ బాబు వాదించారు.

ప్రభుత్వ న్యాయవాది గడువు కోరడంతో ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. కాగా, ప్రభుత్వం ఆస్తుల వేలం వేయడం గతంలోనూ అనేక రాష్ట్రాల్లో జరిగిందని ‘మిషన్‌ బిల్డ్‌ ఏపీ’ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ హైకోర్టుకు వివరించారు. కేంద్రప్రభుత్వం కూడా వృథాగా ఉన్న ఆస్తులను అమ్మజూపుతోందన్నారు. ‘‘ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకునే విషయంలో న్యాయస్థానాలు నిగ్రహం పాటించాలి. ఆస్తుల వేలంపై ఎలాంటి నిషేధాలు లేవు. దాని ద్వారా వచ్చే నిధులను ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తాం’’ అని తెలిపారు. గుంటూరులో ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న భూమిని పీవీకే నాయుడు అనే వ్యక్తి విరాళం ఇచ్చారనే దానికి రికార్డులు లేవన్నారు. అమరావతిలో అసెండస్‌ సింగ్‌బ్రిడ్జ్‌ కార్పొరేషన్‌కు కేటాయించిన 1600 ఎకరాలను కూడా విక్రయించాలని నిర్ణయించామన్నారు.

Link to comment
Share on other sites

Amma

Just now, snoww said:

Ammadam tinadam.. 

Link to comment
Share on other sites

ప్రభుత్వవిధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకునే విషయంలో న్యాయస్థానాలు నిగ్రహం పాటించాలి.

SelfreliantSilverClumber-size_restricted

Link to comment
Share on other sites

5 minutes ago, johnydanylee said:

ప్రభుత్వవిధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకునే విషయంలో న్యాయస్థానాలు నిగ్రహం పాటించాలి.

SelfreliantSilverClumber-size_restricted

Good post. 

Assalu India lo inthaka mundu ee government lands ammaledu. Jalaganna is first. Good job pulkas filing case in high court. 

Link to comment
Share on other sites

5 minutes ago, snoww said:

Bramaravathi ki 50k acres public lands enduku ani jaffas case eyyocha ?

 Vizag  Bramaravathi ki 50k acres public lands enduku ani jaffas phulkas case eyyocha ? - Yes FB! diguthahdhi @3$%

Link to comment
Share on other sites

రాజధాని కార్యాలయాల తరలింపుపై నేడు హైకోర్టులో విచారణ

07232020112846n53.gif

అమరావతి: రాజధాని నుంచి కార్యాలయాల తరలింపుపై దాఖలైన పిటిషన్‍పై ఈరోజు హైకోర్టులో విచారణ జరుగనుంది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై దాఖలైన పిటిషన్లపై నేడు హైకోర్టు విచారించనుంది. త్రిసభ్య ధర్మాసనం పిటిషన్లపై విచారణ చేపట్టనుంది. ప్రభుత్వ భూముల విక్రయాలపై వేసిన పిటిషన్‍పైనా నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది.

Link to comment
Share on other sites

32 minutes ago, Hydrockers said:

Jagga sandu dorikindi ga

Last govt lo ammina lands mottam registration lu cancel chesi tisukovacha ani adigite pulkas noru musukuntaru

Mari adhi cheyochu ga evaru stopping? 

Link to comment
Share on other sites

టీడీపీ కార్యాలయ భవనంపై.. ఎన్నిసార్లు పిటిషన్‌ వేస్తారు?

ఈ వ్యవహారంలో మీకున్న ఆసక్తేంటి?

తదుపరి విచారణ అవసరం లేదు

ఎమ్మెల్యే ఆళ్ల తీరును తప్పుబటివ్టన ధర్మాసనం

అమరావతి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో నిర్మితమైన టీడీపీ కార్యాలయ భవనం అక్రమ కట్టడమని, దానిని కూల్చివేసి.. ఆ భూమిని స్వాధీనం చేసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తప్పుబట్టింది. 2017లో ఆయనే దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిందని, ఇదే వ్యక్తి ఇదే అంశంపై మళ్లీ ఇప్పుడు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) పేరుతో రావడం సరికాదని వ్యాఖ్యానించింది. ఇంతకూ ఈ వ్యవహారంలో పిటిషనర్‌కు ఉన్న ఆసక్తి ఏమిటని ప్రశ్నించింది. ఏది ప్రజాప్రయోజన వ్యాజ్యమో, ఏది రాజకీయ ప్రయోజన వ్యాజ్యమో తమకు బాగా తెలుసని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌లో వాదనలు వినిపించేందుకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ముందుకు రాగా.. మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నించింది.

దీనిపై తదుపరి విచారణ అవసరం లేదని పేర్కొంటూ పిటిషన్‌ను పరిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ఏవైనా అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వాగుపోరంబోకుకు చెందిన సర్వే నంబరు 392లో 3.65 ఎకరాల భూమిని టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం 99 సంవత్సరాల పాటు లీజుకిస్తూ 2017లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయడంతో పాటు టీడీపీ భవనాన్ని కూల్చివేసి, ఆ భూమిని స్వాధీనం చేసుకునేలా సీఆర్‌డీఏ కమిషనర్‌ను ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే.

Link to comment
Share on other sites

13 hours ago, tom bhayya said:

HC inka full time Ivey case laa leka inkemanna kuda avuthunnaya?

Taaghubhothu sudhakar, hotel lemongadda, brahmaravathi, givey case lu. 

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...