Jump to content

***** Andhra High Court Daily Updates ******


snoww

Recommended Posts

11 minutes ago, tom bhayya said:

Zoomnaidu ey last time opposition party leader lekunda chesaaadu annaru ippudu enti idhi?

Yes. Abn convenient gaa deenini kooda jaggadiki mottikaya account lo vesindi

Link to comment
Share on other sites

కొవిడ్‌- 19 బాధితుల నుంచి ప్రైవేటు ఆస్పత్రులు వసూ లు చేస్తున్న అధిక ఫీజుల నియంత్రణకు తీసుకు న్న చర్యలను తమ ముందుంచాలని హైకోర్టు రా ష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొవిడ్‌ చికిత్సకు ప్ర భుత్వం నిర్దేశించిన ఫీజు వివరాలు, ఆ ఉత్తర్వుల అమలు తదితరాలను సమర్పించాలని, ఆ మేరకు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్‌ బాధితుల నుంచి ప్రైవేటు ఆస్పత్రులు భారీగా డబ్బులు గుంజుతున్నాయని, దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ సామాజికవేత్త తోట సురేశ్‌బాబు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు.

 

సోమవారం దీనిపై విచారణ జరగ్గా.. పిటిషనర్‌ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. అధిక ఫీజులు వసూలు చేసే ఆస్పత్రుల వివరాలతో అదనపు అఫిడవిట్‌ దాఖలు చేశామన్నారు. కొవిడ్‌ బా ధితుల నుంచి ప్రైవేటు ఆస్పత్రులు రోజుకు రూ. 3500 మాత్రమే వసూలు చేయాలని ప్రభు త్వం ఉత్తర్వులిచ్చినా, కొన్ని ఆస్పత్రుల్లో రోజుకు రూ.లక్షకుపైగా వసూలు చేస్తున్నారని తెలిపారు. ప్రభు త్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవో లు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. భారీగా ఫీజులు వసూలు చేసే ఆస్పత్రులపై తగిన చర్య లు తీసుకుంటున్నామని, వివరాలతో కౌంటర్‌ దాఖ లు చేస్తామన్నారు. 

Link to comment
Share on other sites

జగన్‌ క్రైస్తవుడని ఎలా చెబుతారు!

10202020032246n86.jpgKaakateeya

 

ఆధారాల్లేకుండా సీఎం మతం ప్రస్తావనా?

పిటిషనర్‌ను ప్రశ్నించిన హైకోర్టు

ఆధారాలుంటే సమర్పించాలని ఆదేశం

ప్రతివాదిగా గవర్నర్‌ పేరు తొలగింపు

 

అమరావతి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలోకి హిందూయేతరులు వెళ్లేటప్పుడు డిక్లరేషన్‌ ఇవ్వాల్సివుంటుందని, కానీ అన్యమతస్థుడైన సీఎం జగన్‌ అందుకు విరుద్ధంగా వ్యవహరించారన్న పిటిషనర్‌ వాదనతో హైకోర్టు విభేదించింది. సీఎం జగన్‌ హిందువు కాదని, క్రైస్తవుడని ఏ ఆధారంతో చెబుతా రని? ప్రశ్నించింది. అలాంటి ఆధారాలుంటే తమ ముం దుంచాలని పిటిషనర్‌ను ఆదేశించింది. ఆధారాల్లేకుం డా సీఎం మతం గురించి మాట్లాడ్డం సరికాదని పే ర్కొంది. తగిన ఆధారాలుంటేనే తదుపరి విచారణను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అదేవిధంగా పిటిషన్‌లో ప్రతివాదిగా గవర్నర్‌ పేరును ప్రస్తావించడాన్ని ఆక్షేపిస్తూ.. దానిని సుమోటోగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గవర్నర్‌ను ప్రతివాదిగా పే ర్కొన్నప్పటికీ ఆ పిటిషన్‌కు ఎలా నం బరు కేటాయించారంటూ రిజిస్ట్రీని(జుడీషియల్‌)ని పిలిపించి అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల తిరుమల వెళ్లిన సీఎం జగన్‌.. స్వామి దర్శనానికి ముం దు డిక్లరేషన్‌ ఇవ్వలేదని, ఇది దేవాదాయ చట్టానికి విరుద్ధమని పేర్కొంటూ గుంటూరు జిల్లా వైకుంఠపురానికి చెందిన సుధాకర్‌బాబు హైకోర్టులో కో-వారెంటో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 

చట్టాన్ని ఉల్లంఘించిన సీఎం జగన్‌, మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్‌, కొడాలి నాని, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఏ అధికారంతో ఆయా పదవుల్లో కొనసాగుతున్నారో వివరణ కోరాలంటూ పిటిషన్‌లో అభ్యర్థించారు. దీనిపై సోమవారం న్యాయమూర్తి ముందు విచారణ జరగ్గా... పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ.. హిందూయేతరులు శ్రీవారిని దర్శించుకోవాలంటే కచ్చితంగా డిక్లరేషన్‌ ఇవ్వాలని, కానీ జగన్‌ దీనిని పాటించలేదన్నారు. ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని ప్రభుత్వాధినేతే ఉల్లంఘించడం సరికాదన్నారు. ఆయన డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రులు వెలంపల్లి, కొడాలి వ్యాఖ్యానించారని కోర్టుకు తెలిపారు. నిబంధనలు అమలు చేయడంలో టీటీడీ చైర్మన్‌, ఈవో విఫలమైనందున వారిని ఆ పదవుల నుంచి నిలువరించాలని కోరారు. జగన్‌ ఏ మతస్థుడన్నదానిపై ప్రజల్లోనూ సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన ఆవశ్యకత రాష్ట్ర పాలకుడి గా జగన్‌కు ఉందని వాదించారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం, టీటీడీ తరఫున సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు.

Link to comment
Share on other sites

1 hour ago, snoww said:

జగన్‌ క్రైస్తవుడని ఎలా చెబుతారు!

10202020032246n86.jpgKaakateeya

 

ఆధారాల్లేకుండా సీఎం మతం ప్రస్తావనా?

పిటిషనర్‌ను ప్రశ్నించిన హైకోర్టు

ఆధారాలుంటే సమర్పించాలని ఆదేశం

ప్రతివాదిగా గవర్నర్‌ పేరు తొలగింపు

 

అమరావతి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలోకి హిందూయేతరులు వెళ్లేటప్పుడు డిక్లరేషన్‌ ఇవ్వాల్సివుంటుందని, కానీ అన్యమతస్థుడైన సీఎం జగన్‌ అందుకు విరుద్ధంగా వ్యవహరించారన్న పిటిషనర్‌ వాదనతో హైకోర్టు విభేదించింది. సీఎం జగన్‌ హిందువు కాదని, క్రైస్తవుడని ఏ ఆధారంతో చెబుతా రని? ప్రశ్నించింది. అలాంటి ఆధారాలుంటే తమ ముం దుంచాలని పిటిషనర్‌ను ఆదేశించింది. ఆధారాల్లేకుం డా సీఎం మతం గురించి మాట్లాడ్డం సరికాదని పే ర్కొంది. తగిన ఆధారాలుంటేనే తదుపరి విచారణను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అదేవిధంగా పిటిషన్‌లో ప్రతివాదిగా గవర్నర్‌ పేరును ప్రస్తావించడాన్ని ఆక్షేపిస్తూ.. దానిని సుమోటోగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గవర్నర్‌ను ప్రతివాదిగా పే ర్కొన్నప్పటికీ ఆ పిటిషన్‌కు ఎలా నం బరు కేటాయించారంటూ రిజిస్ట్రీని(జుడీషియల్‌)ని పిలిపించి అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల తిరుమల వెళ్లిన సీఎం జగన్‌.. స్వామి దర్శనానికి ముం దు డిక్లరేషన్‌ ఇవ్వలేదని, ఇది దేవాదాయ చట్టానికి విరుద్ధమని పేర్కొంటూ గుంటూరు జిల్లా వైకుంఠపురానికి చెందిన సుధాకర్‌బాబు హైకోర్టులో కో-వారెంటో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 

చట్టాన్ని ఉల్లంఘించిన సీఎం జగన్‌, మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్‌, కొడాలి నాని, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఏ అధికారంతో ఆయా పదవుల్లో కొనసాగుతున్నారో వివరణ కోరాలంటూ పిటిషన్‌లో అభ్యర్థించారు. దీనిపై సోమవారం న్యాయమూర్తి ముందు విచారణ జరగ్గా... పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ.. హిందూయేతరులు శ్రీవారిని దర్శించుకోవాలంటే కచ్చితంగా డిక్లరేషన్‌ ఇవ్వాలని, కానీ జగన్‌ దీనిని పాటించలేదన్నారు. ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని ప్రభుత్వాధినేతే ఉల్లంఘించడం సరికాదన్నారు. ఆయన డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రులు వెలంపల్లి, కొడాలి వ్యాఖ్యానించారని కోర్టుకు తెలిపారు. నిబంధనలు అమలు చేయడంలో టీటీడీ చైర్మన్‌, ఈవో విఫలమైనందున వారిని ఆ పదవుల నుంచి నిలువరించాలని కోరారు. జగన్‌ ఏ మతస్థుడన్నదానిపై ప్రజల్లోనూ సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన ఆవశ్యకత రాష్ట్ర పాలకుడి గా జగన్‌కు ఉందని వాదించారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం, టీటీడీ తరఫున సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు.

Denamma comedy. Jagan christian ani proof kavala? G tho navvali anipisthundi. Looks like they are dealing this case based on emotions than logics.  
 

Link to comment
Share on other sites

Dhebba ki Uthara Kumarulu baga Salla baddaru @3$%

Ledhantae prathi dhikkumalina case ki DG'P resign cheyyali, Asala Govt run avuthundha ani yedava stmts iche vallu ..

Aa Stmts records lo pettndi.. SC lo chusukuntam antae--  Gu.. vanikedhi.. Off the record ani covering iche vallu

Yedhi ippudu Stmts ivvamanandi Uthara kumarulani VigorousSpryBoutu-max-1mb.gif

Link to comment
Share on other sites

Haha.. Looks like SC muttakayalu, Jalaga letter work aiythandhi!

FC ichina Stay Order on Tahsild@r case..FC nae malli kottesindhi jaya+prakash+reddy.gif

ekkada media lo news lekunda silient ga order ichindhi anta

inka Bramaravath! stay order muttakayalu, Gag Order muttakayalu coming soon...

 

  • Haha 1
Link to comment
Share on other sites

2 minutes ago, kidney said:

Haha.. Looks like SC muttakayalu, Jalaga letter work aiythandhi!

FC ichina Stay Order on Tahsild@r case..FC nae malli kottesindhi jaya+prakash+reddy.gif

ekkada media lo news lekunda silient ga order ichindhi anta

inka Bramaravath! stay order muttakayalu, Gag Order muttakayalu coming soon...

 

Corruption cases lo stays ivvadam, bail ivvadam bullshit assalu. India lo corruption peragadaniki reason adhey.  Jaya meedha corruption cases early 90’s nunchi vunnayi. Arrest kooda ayindi. Aa tharuvatha cm kooda ayindi. Babori meedha 15+ years nunchi stay orders. Jagga 18 months jail lo unnadu. Bail meedha vachi cm ayyadu.

 Endi raa ee daridram. Okka chinna case untey mana inti pillaney ivvam manam. Ikkada mathram illu andaru antha pedha cases undi kooda cm lu avuthunnaru. Nobody is culprit until proven Antaru. Courts lo prove kaniki 20+ yrs. denamma inka prove ayyi em labham

  • Upvote 2
Link to comment
Share on other sites

10222020041509n86.jpgKaakateeya

 

‌ ప్రైవేటు కాలేజీల పిటిషన్‌పై హైకోర్టు

 

అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల సీట్లను తగ్గిస్తూ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన జీవోను హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి తదితరులను ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో సీట్లను కుదిస్తూ పాఠశాల విద్యాశాఖ గత మే నెలలో జీవో 23ను జారీ చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ సెంట్రల్‌ ఆంధ్రా జూనియర్‌ కళాశాల యాజమాన్యాల సంఘ అధ్యక్షుడు కె.బ్రహ్మయ్య తదితరులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై మంగళవారం న్యాయమూర్తి ముందు విచారణ జరగ్గా.. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఇంటర్‌బోర్డు కార్యదర్శి నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరూ కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ.. నిర్ణీత కాలంలో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించినా స్పందనలేదని, వారి నిర్లక్ష్య ధోరణి వల్లనే అధికారులను పిలిపించాల్సి వచ్చిందని వివరించారు.

 

విచారణ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు, న్యాయవాది జీఆర్‌ సుధాకర్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ జీవో కారణంగా ప్రైవేటు కళాశాలలతోపాటు విద్యార్థులు కూడా నష్టపోయే అవకాశం ఉందన్నారు. గతంలో ఒక్కో కళాశాలలో సెక్షన్‌కు 88 మందిని అనుమతించేవారని, మొత్తం 9 సెక్షన్లలో 792 మందికి అవకాశం కల్పించారన్నారు. తాజా జీవోతో సెక్షన్‌కు 40 చొప్పున 9 సెక్షన్లకు 360 మందిని మాత్రమే చేర్చుకోగలరన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కళాశాలలు సిబ్బందిని నియమించుకుని, మౌలిక సదుపాయాలను కల్పించాయని, ఇప్పుడు హఠాత్తుగా సీట్ల కుదింపు వల్ల ప్రైవేటు కళాశాలలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. ప్రభుత్వ కళాశాలలకు నిబంధనలు విధించకుండా కేవలం ప్రైవేటు కళాశాలలకే వర్తింపజేయాలనుకోవడం సరికాదన్నారు. అందువల్ల ఆ జీవోను రద్దు చేయాలని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కొన్ని ప్రైవేటు కళాశాలలు తరగతుల్ని అపార్ట్‌మెంట్లలో నిర్వహిస్తున్నాయని, చిన్న చిన్న గదుల్లో 88 మందిని కుక్కుతున్నారని తెలిపారు. కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదన్నారు. ఇలాంటి వాటిని అరికట్టేందుకే జీవో తెచ్చామన్నారు. తగిన మౌలిక సదుపాయాలు కల్పించిన కళాశాలలకు ఈ జీవోతో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. సెక్షన్‌కు ఎన్ని సీట్లు ఉండాలో కోర్టు ఖరారు చేస్తే.. ఆమేరకు భర్తీ చేస్తామన్నారు. అందువల్ల ప్రభుత్వ విధానాన్ని నిలువరించరాదని అభ్యర్థించారు. ఇరువర్గాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ప్రభుత్వ జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

 

తుళ్లూరు రిటైర్డ్‌ తహసీల్దార్‌ పిటిషన్‌ కొట్టివేత

రాజధానిలో అసైన్డ్‌ భూముల వ్యవహారానికి సంబంధించి సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండల రిటైర్డ్‌ తహసీల్దారు సుధీర్‌బాబు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసుపై దర్యాప్తు జరగాల్సిందేనని, ప్రాథమిక దశలో దర్యాప్తును నిలిపివేయరాదని సుప్రీంకోర్టు సైతం చెప్పిందని గుర్తు చేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ బుధవారం తీర్పు వెలువరించారు.

Link to comment
Share on other sites

జనం సొమ్ముతో హైదరాబాద్‌లో ఇల్లా?

 
223.jpg?itok=3dNWMkPq

నిమ్మగడ్డకు రెండు చోట్లా అధికార నివాసాలా?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు రెండు ఇళ్లా?.. ఎందుకు?.. హైదరాబాద్‌లో అధికార నివాసం ఏమిటి?.. ఆయన విధులు నిర్వర్తించాల్సింది ఎక్కడ నుంచి?.. అక్కడొక అధికార నివాసం, ఇక్కడొక అధికార నివాసం అంటే అందుకు ఎంత ఖర్చవుతున్నట్లు?.. ఆ డబ్బంతా ఎవరిది?.. ప్రజలదే కదా?.. మనమంతా పన్నుల రూపంలో చెల్లించే డబ్బే అంతిమంగా ఇలా దుర్వినియోగం అవుతోంది..  – నిమ్మగడ్డపై హైకోర్టు వ్యాఖ్యలు

 

సాక్షి, అమరావతి: ఎన్నికల నిర్వహణ విషయంలో తనకు ఆర్థిక, ఆర్థికేతర సహాయ, సహకారాలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యంపై హైకోర్టు నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సహాయ, సహకారాలపై అనుబంధ అఫిడవిట్‌ను దాఖలు చేసిన నిమ్మగడ్డ అందులో ప్రధానంగా నిధుల గురించే ప్రస్తావించారు. న్యాయవాదులకు చెల్లించాల్సిన ఫీజులు పెద్ద మొత్తంలో బకాయి ఉన్నాయని వెల్లడించారు. ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్నారు.

సాయం కావాలంటూ కేసుల ప్రస్తావన ఏమిటి?
అనుబంధ వ్యాజ్యంపై తాజా విచారణ సందర్భంగా నిమ్మగడ్డ తరఫు న్యాయవాది డీవీ సీతారామమూర్తి ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్‌ సిబ్బందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారని ప్రస్తావించడంతో న్యాయమూర్తి జస్టిస్‌ దేవానంద్‌ స్పందిస్తూ.. సహాయ, సహకారాల కోసం పిటిషన్‌ వేసి, ఈ కేసుల గురించి ఎందుకు చెబుతున్నారని, ఈ వ్యాజ్యంలో అవి అవసరమా? అని ప్రశ్నించారు. 

పోస్టుల భర్తీకి ప్రభుత్వాన్ని కోరారా?
ఆర్థికేతర సాయం అంటే ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించడంతో సిబ్బంది ఖాళీల భర్తీ అని సీతారామమూర్తి పేర్కొన్నారు. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి కావాలా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అనుమతి అవసరమని, ఖాళీలను ప్రత్యక్ష పద్ధతిలో లేదా, డిప్యుటేషన్‌లో భర్తీ చేయవచ్చని సీతారామమూర్తి తెలిపారు. ఈ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎప్పుడు కోరారని న్యాయమూర్తి ప్రశ్నించడంతో సీతారామమూర్తి జవాబు చెప్పలేకపోయారు.

ఆ డబ్బంతా న్యాయవాదుల ఫీజులకే..!
విచారణ సందర్భంగా పిటిషన్‌తోపాటు జత చేసిన పలు బిల్లులను పరిశీలించిన న్యాయమూర్తి అవన్నీ ఏమిటని ప్రశ్నించారు. అవి న్యాయవాదులకు చెల్లించాల్సిన బిల్లులని సీతారామమూర్తి పేర్కొనగా, అలా అయితే నిన్న ప్రభుత్వం విడుదల చేసిన రూ.39 లక్షలు ఈ బిల్లులు చెల్లించేందుకు అయిపోతాయని న్యాయమూర్తి నవ్వుతూ వ్యాఖ్యానించారు. ‘ఈ డబ్బంతా ప్రజలదే. ఎంతోమంది పన్నుల రూపంలో చెల్లించిన డబ్బు ఇలా న్యాయవాదుల ఫీజులకు వెళుతుంది.. చాలా బాగుంది..’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో సీతారామమూర్తి కేసుల గురించి చెప్పేందుకు ప్రయత్నించడంతో.., కేసుల గురించి అవసరం లేదని, సహాయ, సహకారాల అంశానికే పరిమితం కావాలని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. 

ఎన్నికల నిర్వహణకు రూ.117 కోట్లు ఇచ్చాం...
ఎన్నికల కమిషన్‌కు ఏ రకమైన సహకారం కావాలో ప్రభుత్వాన్ని ఎన్నడూ కోరలేదని ప్రభుత్వ న్యాయవాది సుమన్‌ నివేదించారు. సిబ్బంది ఖాళీల భర్తీ విషయాన్ని కమిషనర్‌ ప్రభుత్వ దృష్టికి తీసుకురాలేదన్నారు. రూ.40 లక్షలు అడిగితే ఇచ్చేశామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఈ ఏడాది జనవరి 21న రూ.95 కోట్లు ఇచ్చామని, గత ఏడాది జూన్‌లో రూ.9.52 కోట్లు ఇచ్చామని, ఇలా వివిధ సందర్భాల్లో ఎన్నికల నిర్వహణకు రూ.117 కోట్లు ఇచ్చామని సుమన్‌ తెలిపారు. 

ప్రజల డబ్బును ఇలా ఖర్చు చేయడం దురదృష్టకరం...
ఈ సమయంలో ఎన్నికల కమిషనర్‌ వ్యక్తిగత సిబ్బంది అంశం ప్రస్తావనకు వచ్చింది. నిమ్మగడ్డ రమేశ్‌కు హైదరాబాద్‌లో అధికార నివాసం ఉన్న విషయం కూడా న్యాయమూర్తి దృష్టికి వచ్చింది. దీనిపై జస్టిస్‌ దేవానంద్‌ ఒకింత విస్మయం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్‌ అధికార నివాసం హైదరాబాద్‌లో ఉండటం ఏమిటన్నారు. హైదరాబాద్‌లో అధికార నివాసం, విజయవాడలో మరో నివాసం అంటే ఎంత ఖర్చు అవుతున్నట్లని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇదంతా ప్రజాధనమని గుర్తు చేశారు. పన్నుల రూపంలో చెల్లించిన డబ్బంతా ఇలా దుర్వినియోగం అవుతోందని, అంతిమంగా ప్రజలే పరాజితులని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. న్యాయవాదులకు ఎన్నికల కమిషన్‌ చెల్లించాల్సిన ఫీజు రూ.5.61 కోట్లు ఉందని, ఇదంతా పన్నుల రూపంలో ప్రజలు చెల్లిస్తున్న డబ్బని, ఆ డబ్బును ఇలా ఖర్చు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.  

Link to comment
Share on other sites

నిధుల కోసం..ఎస్ఈసీ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు  రిజర్వ్ చేసింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌‌పై గురువారం కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. అయితే గత విచారణలో రాజ్యాంగ సంస్థలకు సహకరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని హైకోర్టు తెలిపింది. 

 

కాగా ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల నిర్వహణకు ఖర్చయ్యే నిధులను ప్రభుత్వం మంజూరు చేయకుండా నిలిపి వేసిందని, ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం సహకరించడం లేదని రమేశ్ కుమార్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై కోర్టు వెంటనే జోక్యం చేసుకుని నిధులు విడుదల అయ్యేలా చూడాలని ఆయన కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్243(కే) ప్రకారం ఎన్నికల కమిషన్‌కు నిధులు ఆపేయడం చట్ట విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.  వెంటనే నిధులు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర అత్యున్నత ధర్మాసనాన్ని ఎన్నికల కమిషనర్ కోరారు. 

Link to comment
Share on other sites

రేపటి వరకు తదుపరి కూల్చివేతలొద్దు

 
HIGH-COURT-1_0.jpg?itok=4lIttxG-

గీతం ఆక్రమణలపై హైకోర్టు ఆదేశం

 

విశాఖపట్నం, రిషికొండ, యందాడ గ్రామాల పరిధిలో తమ విద్యా సంస్థలకు చెందిన నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారంటూ గీతం యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. శనివారం రాత్రి అత్యవసరంగా హౌస్‌ మోషన్‌ రూపంలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డి సోమవారం ఉదయం వరకు తదుపరి ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని అధికారులను ఆదేశించారు. తదుపరి విచారణను ఆదివారానికి వాయిదా వేశారు.  

Link to comment
Share on other sites

గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేతలపై హైకోర్టు స్టే

విశాఖలోని గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది. నవంబర్‌ 30 వరకు నిర్మాణాల కూల్చివేతపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. అంతేకాదు కూల్చివేతలపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అర్థరాత్రి 100 మంది పోలీసులతో నిర్మాణాలు కూల్చివేశారని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. నోటీసులు, ఆర్డర్లు లేకుండా కూల్చడం సరికాదని పిటిషనర్‌ తెలిపారు. యూనివర్సిటీ ప్రైవేట్‌ భూముల్లో నిర్మాణాలు కూల్చారని పిటిషనర్‌ తెలిపారు. అదనపు భూమి కొనడానికి డాక్యుమెంట్‌ ప్రభుత్వం వద్దే ఉందని పిటిషనర్‌ చెప్పారు. ఇరువాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను నవంబర్‌ 30కి వాయిదా వేసింది.

 

 

ఇప్పటికే విశాఖలోని గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేత వ్యవహారంలో తదుపరి చర్యలను సోమవారం వరకు నిలుపుదల చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై పూర్తిస్థాయి విచారణ ఆదివారం చేపడతామని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కనీసం ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా అధికారులు అక్రమంగా వర్సిటీ కట్టడాలను కూల్చివేస్తున్నారని, నిర్మాణాల క్రమబద్ధీకరణ ప్రక్రియ పెండింగ్‌లో ఉండగా హఠాత్తుగా కూల్చివేతలకు దిగారంటూ వర్సిటీ యాజమాన్యం హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

 

విశాఖపట్నం గీతం విశ్వవిద్యాలయంలోని పలు నిర్మాణాలను రెవె న్యూ, గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీవీఎంసీ) అధికారులు శనివారం తెల్లవారుజామున కూల్చివేశారు. ప్రభుత్వ భూమి ఉన్నదంటూ ఎక్స్‌కవేటర్‌లతో పలు కట్టడాలను తొలగించారు. అర్ధరాత్రి దాటాక ప్రారంభమైన ఈ ఆపరేషన్‌ శనివారం ఉదయం 11 వరకు కొనసాగింది. ఆ సమయంలో గీతం పరిసరాల్లో భారీఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. అక్రమాల సమాచారం నిర్వాహకులకు ఉందని అధికారులు చెబుతుంటే, కనీసం చెప్పకుండా కూల్చివేతలకు పాల్పడ్డారని గీతం యాజమాన్యం ఆరోపించింది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...