Jump to content

Raghurama: నా ఫోన్‌తో తప్పుడు సందేశాలు


Somedude

Recommended Posts

Raghurama: నా ఫోన్‌తో తప్పుడు సందేశాలు

 పీవీ రమేశ్‌ కుటుంబానికి వెళ్లాయి
 ఆయన సోదరితో ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్‌కు వైవాహిక విభేదాలు
 ఆ ఫోన్‌ సీఐడీ ఆధీనంలోనే ఉంది
 దిల్లీ డీసీపీకి ఎంపీ రఘురామ ఫిర్యాదు

5ap-main3a_12.jpg

ఈనాడు - దిల్లీ, అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజు ఫోన్‌ నంబరు నుంచి తనకు, తన కుటుంబానికి వాట్సప్‌ సందేశాలు వస్తున్నాయని మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేశ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన నేపథ్యంలో.. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ దిల్లీ పార్లమెంటు స్ట్రీట్‌ డీసీపీకి ఎంపీ ఫిర్యాదు చేశారు. మే 14న తనను అరెస్టు చేసినప్పుడే ఏపీ సీబీసీఐడీ పోలీసులు తన సెల్‌ఫోన్‌ తీసేసుకున్నారని, అప్పటి నుంచి అనధికారికంగా వారి వద్దనే ఉందని వివరించారు. ఏపీ సీబీసీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్‌ ఆ ఫోన్‌ ద్వారా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ.. ఆయనపై క్రిమినల్‌ లయబిలిటీ కింద చర్యలు చేపట్టాలని కోరారు. పీవీ రమేశ్‌ సోదరికి, అదనపు డీజీ సునీల్‌కుమార్‌కు మధ్య వైవాహిక విభేదాలున్నాయని తెలుస్తోందని ఫిర్యాదులో చెప్పారు. ఈ అంశానికి సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు తన ఫోన్‌ ద్వారా  వారికి మోసపూరితంగా వాట్సప్‌ సందేశాలు పంపి తనను మరో తప్పుడు కేసులో ఇరికించి, తన ప్రతిష్ఠను దెబ్బతీసేంద]ుకు కుట్ర పన్నినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. ఆ ఫోన్‌ నంబరు నుంచి మే 14- జూన్‌ 1 మధ్య ఇంకెన్ని సందేశాలు వెళ్లాయో దర్యాప్తు చేయాలని కోరారు. ‘మే 14న నన్ను అరెస్టు చేసినరోజు నా భార్య, కుమారుడి సమక్షంలో పోలీసులు నా నుంచి ఐఫోన్‌ 11 మోడల్‌ మొబైల్‌ ఫోన్‌ తీసేసుకున్నారు. అందులో 90009 22222 నంబరు సిమ్‌తో 90009 11111 వాట్సప్‌ నంబరు ఉంది. ఆ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు రికార్డుల్లో చూపలేదు, తిరిగి ఇవ్వనూలేదు. దీనిపై శుక్రవారం సునీల్‌కుమార్‌కు నేను లీగల్‌ నోటీసు పంపాను. మే 14వ తేదీ రాత్రి ఏపీ సీబీసీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్‌ మరో నలుగురితో కలిసి నన్ను దారుణంగా కొట్టారు. తర్వాత అందులో ఒకరు నా గుండెలపై కూర్చొని నా మొబైల్‌ ఫోన్‌ పాస్‌వర్డ్‌ చెప్పాలని బలవంతపెట్టారు. నా ప్రాణాలను కాపాడుకోడానికి అది చెప్పాను. నా ఫోన్‌ నంబరు నుంచి వాట్సప్‌ సందేశాలు వచ్చినట్లు మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేశ్‌ శనివారం ట్వీట్‌ చేయడం విస్మయాన్ని కలిగించింది. వెంటనే జరిగిన విషయాన్ని ఆయనకు ట్విటర్‌ ద్వారా వివరించాను. పీవీ రమేశ్‌ కుటుంబసభ్యులకే కాక.. ఇతర నంబర్లకూ సునీల్‌కుమార్‌ నా నంబరు నుంచి వాట్సప్‌ సందేశాలు పంపి ఉండొచ్చన్నది నా అనుమానం. అందువల్ల నా ఫోన్‌ నుంచి వారు ఏయే నంబర్లకు ఎన్ని సందేశాలు పంపారో పూర్తిస్థాయి దర్యాప్తు ద్వారానే తేలుతుంది. ఈ కేసులో ఎన్నో చట్టాల ఉల్లంఘన చోటుచేసుకొంది. అందువల్ల పీవీ సునీల్‌కుమార్‌పై సెక్షన్‌ 119, 379, 403, 409, 418, 426, 504, 506 కింద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’ అని రఘురామకృష్ణరాజు దిల్లీ డీసీపీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ లేఖతోపాటు ఆయన పీవీ రమేశ్‌ చేసిన ట్వీట్‌, దానికి తానిచ్చిన స్పందన, పీవీ సునీల్‌కుమార్‌కు తానిచ్చిన లీగల్‌ నోటీసు, తాను మరో సిమ్‌ తీసుకున్నట్లు సర్వీస్‌ ప్రొవైడర్‌ ఇచ్చిన లేఖను జత చేశారు.
నాకు సందేశాలు వచ్చాయి: పీవీ రమేశ్‌
ఎంపీ రఘురామకృష్ణరాజు ఫోన్‌ నుంచి తమకు వాట్సప్‌ సందేశాలు వచ్చినట్లు మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేశ్‌ శనివారం ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. ‘ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నేను ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాను. నాకు, నా కుటుంబసభ్యులకు 90009 11111 అనే నంబర్‌ నుంచి వాట్సప్‌ సందేశాలు వస్తున్నాయి. బహుశా ఆ నంబరు ఎంపీ రఘురామకృష్ణరాజుది కావచ్చు. దీనిపై ఎంపీ స్పందించాలి’ అని కోరారు. దానిపై ఎంపీ స్పందించి, తన ఫోన్‌ సీఐడీ పోలీసుల వద్ద ఉన్న విషయాన్ని, నాలుగు రోజుల క్రితం సిమ్‌ బ్లాక్‌ చేసి కొత్త సిమ్‌ తీసుకున్న విషయాన్ని ట్వీట్‌లో వివరించారు.
సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటా: ఎంపీ
తనను అరెస్టు చేసినప్పుడు స్వాధీనం చేసుకున్న ఐ-ఫోన్‌ను తక్షణం మేజిస్ట్రేట్‌ ముందు ఉంచాలని, అలా చేయకపోతే సివిల్‌, క్రిమినల్‌ చర్యలకు ఉపక్రమిస్తానంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు.. సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్‌, మంగళగిరి సీఐడీ ఠాణా ఎస్‌హెచ్‌వోకు శుక్రవారం లీగల్‌ నోటీసు జారీ చేశారు.
నోటీసులో ఏముందంటే..
‘ఈ ఏడాది మే 14న హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసినప్పుడు 90009 22222 నంబరున్న ఐ ఫోన్‌ను నా నుంచి చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకున్నారు. ఆ రోజు రాత్రి మీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారు. థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడంతో తట్టుకోలేక ఫోన్‌ పాస్‌వర్డ్‌ వెల్లడించాను. వద్దని అడ్డుపడుతున్నా ఫోన్‌లోని డేటాను కాపీ చేసుకున్నారు. పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన గోప్యంగా ఉండే సమాచారాన్ని మాత్రమే కాకుండా రాజ్యాంగ, చట్టనిబంధనల ప్రకారం రహస్యంగా ఉండేందుకు రక్షణ ఉన్న కుటుంబసభ్యుల సమాచారాన్ని సైతం మీ మనుషులు తీసుకున్నట్లు సందేహం కలుగుతోంది. నేను వివిధ పార్లమెంటరీ కమిటీలలో సభ్యుడిని. అధికారికంగా గోప్యంగా ఉంచాల్సిన సమాచారం... చట్టవిరుద్ధంగా మీరు తీసుకున్న ఆ సెల్‌ఫోన్‌లో ఉంది. సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు, చికిత్స నిమిత్తం చేరినప్పుడూ మీ స్వాధీనంలో ఉన్న ఫోన్‌ను నాకు తిరిగివ్వలేదు. ఇప్పటివరకూ ఆ ఫోన్‌ చూపించకపోవడం, సీజ్‌ చేసిన వస్తువుగా మేజిస్ట్రేట్‌ ముందు ఉంచకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పోలీసు కస్టడీలో అయిన గాయాల నుంచి నేనింకా పూర్తిగా కోలుకోలేదు. నాఫోన్‌ను నిబంధనల మేరకు తిరిగి పొందాలనుకుంటున్నా. ఆ ఫోన్‌ మే 14 నుంచి ఇప్పటివరకు 20 రోజులకు పైగా మీ కస్టడీలో ఉంది. స్వాధీనం చేసుకున్న ఫోన్‌ను మేజిస్ట్రేట్‌ ముందు ఉంచకపోవడం సీఆర్‌పీసీ కింద తీవ్ర ఉల్లంఘనకు పాల్పడటమే. తక్షణమే ఫోన్‌ను మేజిస్ట్రేట్‌ ముందు ఉంచాలి. విధుల నిర్వహణ కోసం ఆ ఫోన్‌ పొందేందుకు కోర్టు నుంచి తగిన ఉత్తర్వులు పొందుతాను. మేజిస్ట్రేట్‌ వద్ద ఉంచడంలో విఫలమైతే ప్రత్యామ్నాయ న్యాయమార్గాలైన సివిల్‌, క్రిమినల్‌ చర్యలు చేపడతా’ అని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Appatlo Judge RamaKrishna phone kooda alane theesukunnaru. Athani meedha kooda sedition (Raja dhroham) case pettaru. RRR antha rich kadhu. So obviously, SC level lo lawyers pettukoledu. Chittor jail lo unnadu ippataki. Recent ga thanani champadaniki plan chesthunnaru ani athani son media lo chepthunnadu.

Link to comment
Share on other sites

Phone gurunchi SC case appudu enduku cheppaledhu. Even passcode vallaki cheppinattu kooda ippati varaku cheppaledhu. Y he acted this late?

  • Haha 1
Link to comment
Share on other sites

24 minutes ago, Vaampire said:

Phone gurunchi SC case appudu enduku cheppaledhu. Even passcode vallaki cheppinattu kooda ippati varaku cheppaledhu. Y he acted this late?

Bold one applies here 

  • Upvote 1
Link to comment
Share on other sites

30 minutes ago, JustChill_Mama said:

Koratala no , 3vikram no adagalsindhi pk gadilaga

Yeah, better options.

Boothu Kitti batch ollu rastunaru anukunta...kastha Chandranna schemes ..Ade chakram tippe type stories vunayi..

Link to comment
Share on other sites

11 minutes ago, kidney said:

@3$% saal^ey gaadidhi legs sarrigga aiyyao ledho..

Inko year tarvata kuda as usual wheel chair mida me vuntadu...

Link to comment
Share on other sites

7 hours ago, Vaampire said:

Phone gurunchi SC case appudu enduku cheppaledhu. Even passcode vallaki cheppinattu kooda ippati varaku cheppaledhu. Y he acted this late?

First day nundi chepthunnaru. I replied you in one of the threads on the 2nd of the arrest, password cheppevaraku kottaru ani.

SC arguments were just about the bail. Everything else lower court lo choosukomani. Even lower courts lo initial hearings were about getting the hospital tests and bail. Next arguments start ayinappudu, they will bring all these issues.

Starting nundi phone gurunchi chepthunnaru. Meeru follow avvakapothe RRR cheppanatta?

There were too many things in the case - kottadam, megitrate order, HC order, GGH manipulating the reports, SC ordering test in army hospital and etc. People and RRR was concentrating on those. Phone thing was not that important in the early days because they had already got the password and copied everything from the phone.

 

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...