Jump to content

కోసేవాడికి కోడి మీద పగ ఉండదు.. నేనూ అంతే. చాలా పద్ధతిగా నరుకుతా.


Peruthopaniemundhi

Recommended Posts

Veera Simha Reddy: ‘వీర సింహారెడ్డి’.. పవర్‌ఫుల్‌ మాస్‌ డైలాగులు.. థియేటర్స్‌లో విజిల్స్‌..

Veera Simha Reddy: ‘వీర సింహారెడ్డి’.. పవర్‌ఫుల్‌ మాస్‌ డైలాగులు.. థియేటర్స్‌లో విజిల్స్‌..

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ (Bala Krishna).. ఈ పేరు వినగానే మాస్‌ డైలాగ్‌లు, భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లు కోరుకుంటారు సినీ ప్రియులు. దర్శక నిర్మాతలు సైతం అందుకు అనుగుణంగానే కథలు సిద్ధం చేస్తారు. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ‘వీర సింహారెడ్డి’లో (Veera Simha Reddy) అభిమానులతో ఈలలు వేయించే పవర్‌ఫుల్‌ సంభాషణలను గోపీచంద్‌ మలినేని ఉపయోగించారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, రాయలసీమ సంస్కృతి గురించి సాయిమాధవ్‌ బుర్రా రాసిన డైలాగ్స్‌ థియేటర్స్‌లో ఈలలు వేయిస్తున్నాయి. ఇంతకీ అవి ఏమిటంటే..!

  • ‘‘అన్నం మీద గౌరవం లేని వాడు ఆకలికి పనికిరాడు.. అమ్మ మీద గౌరవం లేనివాడు భూమికి పనికి రాడు’’
  • ‘‘కోసేవాడికి కోడి మీద పగ ఉండదు.. నేనూ అంతే. చాలా పద్ధతిగా నరుకుతా’’
  • ‘‘సెంట్రల్ అయినా.. స్టేట్ అయినా.. రాజకీయాల మీద బతికే మనిషిని కాదు.. రాజకీయాల్ని మార్చే మనిషిని’’
  • ‘‘సమాధానం చెప్పలేని వాడికి ప్రశ్నించే హక్కు లేదు’’
  • ‘‘నన్ను తట్టుకొని నిలవాలంటే మూడే దారులు. మారిపోవాలి.. పారిపోవాలి.. లేదంటే సచ్చిపోవాలి’’
  • ‘‘నువ్వు సవాలు విసరకు.. నేను శవాలు విసురుతా’’
  • ‘‘నేనెవరో చెప్పే అలవాటు నాకు లేదు. జీవోను ఉన్నది ఉన్నట్టుగా అమలు చేస్తా. నీ జీవో గవర్నమెంట్‌ ఆర్డర్‌. నా జీవో గాడ్స్‌ ఆర్డర్‌’’
  • ‘‘ఏది అభివృద్ధి హోం మినిస్టర్‌.. ప్రగ‌తి సాధించ‌డం అభివృద్ధి.. ప్రజ‌ల్ని వేధించ‌డం కాదు. జీతాలు ఇవ్వడం అభివృద్ధి.. బిచ్చమెయ్యడం కాదు. ప‌ని చెయ్యడం అభివృద్ధి.. ప‌నులు ఆప‌డం కాదు. నిర్మించ‌డం అభివృద్ధి.. కూల్చడం కాదు. ప‌రిశ్రమ‌లు తీసుకురావ‌డం అభివృద్ధి.. ఉన్న ప‌రిశ్రమ‌లు మూయ‌డం కాదు. బుద్ధి తెచ్చుకో.. అభివృద్ధికి అర్థం తెలుసుకో’’ 
  • ‘‘సింహం మనిషైతే మీ నాన్న.. మంది గుండెల్లో ధైర్యం మీ నాన్న..! ఆ పేరు వింటే వేట కొడవళ్ల వెన్నెముకలు వణుకుతాయి. భూమ్మీద బతకడానికి అందరూ పుడతారు. కానీ, భూమిని బతికించడానికి పుట్టిన సింహాం మీ నాన్న’’
  • ‘‘దేశానికి రాష్ట్రప‌తినిచ్చింది రాయ‌ల‌సీమ‌. అవిభ‌క్త ఆంధ్రప్రదేశ్‌కు ఆరుగురు ముఖ్యమంత్రుల్ని ఇచ్చింది రాయ‌ల‌సీమ‌. తెలుగు జాతి ఆత్మగౌర‌వం కోసం పిడికిలెత్తిన మ‌హ‌నీయుడ్ని గుండెల్లో పెట్టుకుంది రాయ‌ల‌సీమ‌. ఇది రాయ‌ల్‌ సీమ‌. గ‌జ‌రాజులు న‌డిచిన దారిలో గ‌జ్జి కుక్కలు కూడా న‌డుస్తుంటాయి. రాజును చూడు.. కుక్కను కాదు..’’
  • ‘‘సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదని.. నేనొక్కడినే కత్తిపట్టా. పరపతి కోసమో పెత్తనం కోసమో కాదు. ముందు తరాలు నాకిచ్చిన బాధ్యత. నాది ఫ్యాక్షన్‌ కాదు. సీమ మీద ఎఫెక్షన్‌. వీర సింహారెడ్డి పుట్టింది పులిచర్ల. చదివింది అనంతపురం. రూలింగ్‌ కర్నూలు’’
  • ‘‘అపాయింట్‌మెంట్‌ లేకుండా వస్తే అకేషన్‌ చూడను.. లొకేషన్‌ చూడను.. ఒంటి చేత్తో ఊచకోత.. కోస్తా..’’
  • ‘‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు. మార్చలేరు’’
  • ‘‘పదవి చూసుకుని నీకు పొగరేమో.. బై బర్త్‌ నా డీఎన్‌ఏకే పొగరెక్కువ’’
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...