Jump to content

***** Andhra High Court Daily Updates ******


snoww

Recommended Posts

ఎల్‌జీ పాలీమర్స్ వ్యవహారంపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. మరికొన్ని పిటిషన్‌లు దాఖలు చేసేందుకు ఎ‌‌ల్‌జీ పాలిమర్స్ తరుపు న్యాయవాది సమయం కోరారు. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అందలేదని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.

Link to comment
Share on other sites

న్యాయవాదులకు 100 కోట్లపై...

న్యాయవాదుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల కేటాయింపు, తదుపరి  చర్యల వివరాలను అందించాలని హైకోర్టు ఆదేశించింది.  లాక్‌డౌన్‌తో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న న్యాయవాదులకు ఎస్‌బీఐ ద్వారా వడ్డీ రహిత రుణాలు ఇప్పించాలని న్యాయవాది ఎం.గిరిబాబు దాఖలు చేసిన పిల్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ఫలానా వారికి రుణం ఇవ్వాలంటూ తాము బ్యాంకులను ఆదేశించలేమని స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

Link to comment
Share on other sites

సీఐడీ దర్యాప్తుపై నమ్మకం లేదు

06162020034918n58.jpg

 

 

 

డిప్యూటీ సీఎం అనుచరులు వేధిస్తున్నారు

పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు

హైకోర్టును ఆశ్రయించిన డాక్టర్‌ అనితారాణి

 

అమరావతి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రభుత్వాసుపత్రిలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకు, కిందిస్థాయి సిబ్బంది, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అనుచరులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొంటూ డాక్టర్‌ పి.అనితారాణి హైకోర్టును ఆశ్రయించారు. వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు.

 

రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిందని, అయితే, సీఐడీ అధికారులు కనీసం తన వాంగ్మూలం తీసుకోకుండా తన ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రకటించినందున వారి దర్యాప్తుపై నమ్మకం లేదని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని అభ్యర్థించారు. ఈ మేరకు ఆమె హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆస్పత్రిలో తాను లేనప్పుడు ప్రైవేటు/ఆర్‌ఎంపీ డాక్టర్లతో అబార్షన్లు చేయించడం, రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు పంపించడం, విధులకు డుమ్మాకొట్టి మూడు నాలుగు రోజులకొకమారు రిజిస్టర్‌లో సంతకాలు చేయడం వంటి పనులకు పాల్పడేవారని తెలిపారు. 

Link to comment
Share on other sites

 బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ జరిగింది. బిల్డ్ ఏపీ కింద ప్రభుత్వ భూముల అమ్మకాన్ని తప్పు పడుతూ 8 పిటిషన్లు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లను కలిపి జస్టిస్ సత్యనారాయణ మూర్తి విచారణ జరిపారు. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం సమయం అడగడంతో విచారణను  జస్టిస్ రమేష్ సోమవారానికి వాయిదా వేశారు.

Link to comment
Share on other sites

On 6/16/2020 at 3:49 PM, Hydrockers said:

CBI vallu antha kaliga unnara 

Or 

Next baboru case lu vache time ki cbi daggara ekkuva man power lekunda cheyali ani plan chestunara ?..

 

@Android_Halwa u r inputs pls

@JaiTDP u also

Baboru cases ni CBI ki isthe emi mazaa vastadi kaka...ACB vallu aithe state control lo vuntaru...

CBN asale evadi leg padithe vadi leg patukuntadu...Central lo Modi and Shah leg pattukunte CBI ni manage cheyadam easy aipotadi kada

Link to comment
Share on other sites

ప్రభుత్వ స్థలాల విక్రయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. గుంటూరు, విశాఖ తదితర ప్రాంతాల్లోని స్థలాలను విక్రయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై గురువారం జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు మరోమారు విచారణ జరిగింది. 

Link to comment
Share on other sites

9 minutes ago, snoww said:

Lemongadda updates enti ?

Next week SC lo arguments start avuthayi.... from both parties including filed Caveat cases.

SC refused to give Stay Order on HC supporting Lemongadda to take charge.. But both SC, HC did not give any time line on their judgement... This gives govt 2 months time to implement HC/SC Orders. I think SC gives its final judgement before that time

Link to comment
Share on other sites

22 hours ago, kidney said:

Next week SC lo arguments start avuthayi.... from both parties including filed Caveat cases.

SC refused to give Stay Order on HC supporting Lemongadda to take charge.. But both SC, HC did not give any time line on their judgement... This gives govt 2 months time to implement HC/SC Orders. I think SC gives its final judgement before that time

March 2021 lo term ayipothadi emo kada lemongadda di ?

Link to comment
Share on other sites

అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్టుపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. తనపై పెట్టిన నిర్భయ కేసు కొట్టివేయాలంటూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నర్సిపట్నం మున్సిపల్ కమిషనర్‌ను దూషించారంటూ ఆయనపై కేసు నమోదైంది. అయ్యన్నపై నమోదైన ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పలపై నమోదైనా అట్రాసిటి కేసుపై హైకోర్టు విచారణ జరిపింది. వారిని అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...