Jump to content

***** Andhra High Court Daily Updates ******


Recommended Posts

Posted
5 hours ago, kidney said:

TG, MH, Punjab, Tamil Nad, Guj lo kuda 50% salaries thakkuva icharu during lockdown

aa states lo  HC - said to pay min salary -  Balance tharuvatha settle chedham ani 

AP lo idhendhi kotha lolli - to pay with interest

High court ade chethitho private employees ki kooda full salaries ippinchela soodali. Also layoffs should be banned.  

Posted

మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకున్న 1+1 భద్రతను తొలగించడాన్ని సమర్థిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. ప్రాణహాని లేనప్పుడు భద్రత కల్పించాల్సిన అవసరం లేదన్న సింగిల్‌ జడ్జి తీర్పును సమర్థించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఆదినారాయణరెడ్డి దాఖలు చేసిన రిట్‌ అప్పీల్‌ను ధర్మాసనం కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది.   

Posted

రాజధాని తరలింపు బిల్లులపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రాజధాని పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. స్టేటస్‌ కోను కొనసాగించాలని రైతుల అభ్యర్థనపై హైకోర్టు విచారించనుంది. రాజధాని తరలింపు బిల్లులపై విచారణ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Posted

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సోమవారం సీనియర్ న్యాయవాది శ్రావణ్ కుమార్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే దీనిని విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరారు. దీనికి సంబంధించి కొన్ని కీలక అంశాలు ప్రస్తావించారు. ఈ పిటిషన్‌పై విచారణ జాప్యం చేస్తే.. కీలక సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులను కూడా  శ్రావణ్ కుమార్ న్యాయమూర్తి ఎదుట ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది తీవ్రమైన నేరంగా పరిగణించాలన్నారు. వాదనలు విన్న అనంతరం మంగళవారం విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.

Posted

విశాఖపట్నం: విద్యా సంస్థల భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని ఏపీ హైకోర్టు తప్పుబట్టింది. విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ భూములను ఇళ్ల పట్టాలకు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ న్యాయవాది యోగేష్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది.

Posted
4 hours ago, tom bhayya said:

విశాఖపట్నం: విద్యా సంస్థల భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని ఏపీ హైకోర్టు తప్పుబట్టింది. విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ భూములను ఇళ్ల పట్టాలకు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ న్యాయవాది యోగేష్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది.

Phone tapping case updates high court website lo pedathara ?

Boothu kittu and saakshit wrote their own versions. 

Posted

అమరావతి: రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. కేసుకు సంబంధించి పిటిషనర్ దాఖలు చేసిన అఫిడవిట్‌ను మెయిన్ పిటిషన్‌లో ఇన్ కోపరేట్ చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు వచ్చే గురువారానికి వాయిదా వేసింది.

Posted

అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కుంభకోణాలపై విచారణ జరపాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు. కేసుల తుది వాదనలను హైకోర్టు తిరిగి ప్రారంభం అయిన తర్వాత విచారిస్తామని హైకోర్టు వెల్లడించింది. 2015లో దాఖలైన పిటిషన్లు కాబట్టి ప్రస్తుతం అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరంలేదని హైకోర్టు అభిప్రాయపడింది. సెప్టెంబర్ 7 నుంచి హైకోర్టు కార్యకలాపాలు భౌతికంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.

Posted

అమరావతి: ఏపీలో రాజధాని తరలింపు, సీఆర్డీఏ చట్టం రద్దుపై స్టేటస్‌ కోను రాష్ట్ర హైకోర్టు మరోసారి పొడిగించింది. వచ్చే నెల 21 వరకు స్టేటస్‌ కో పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈలోపు కౌంటర్లు దాఖలు చేయాలని ధర్మాసంనం ఆదేశించింది. ఇదిలా ఉంటే రాజధాని పిటిషన్‌లపై రోజు విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది. మరోవైపు హైకోర్టు విధించిన స్టేటస్ కోను ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. కేసు ప్రాముఖ్యతను బట్టి హైకోర్టే చూసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.

Posted

విశాఖ: నగరంలో ప్రభుత్వ గెస్ట్ హౌస్ నిర్మాణంపై హైకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలైంది. దీనిపై గురువారం విచారణ జరిగింది. రాష్ట్రపతి భవనం ఐదు ఎకరాల్లో ఉండగా.. కాపులుప్పాడులో 30 ఎకరాల్లో ప్రభుత్వ గెస్ట్ హౌస్‌ను ఎలా కడతారని న్యాయవాది నితీష్ గుప్తా ప్రశ్నించారు. ఒక వైపు స్టేటస్ కో నడుస్తుండా గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన ఎలా చేస్తారని ప్రశ్నించారు. వాదనలు విన్న అనంతరం  దీనిపై వచ్చేనెల 10లోపు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఏపీ సీఎస్‌కు ఆదేశించింది.

Posted

అమరావతి: ఏపీ ప్రభుత్వానికి వరుసగా హైకోర్టు షాకిచ్చింది. ప్రభుత్వ నిర్ణయాలను ధర్మాసనం తప్పుబట్టింది. ‘బిల్డ్ ఏపీ’ పేరుతో విశాఖలో అమ్మాలనుకున్న ఆరు స్థానాల్లో రెండు స్థలాల హైకోర్టు స్టే ఇచ్చింది. చినగదిలి మండలంలోని చినగదిలి మండలం డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్‌లో 75 సెంట్ల స్థలం, ఏఆర్ పోలీస్ క్వార్టర్స్‌లో ఎకరం స్థలంపై హైకోర్టు స్టే విధించింది. అగనంపూడిలో భూముల విక్రయంపైనా హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటీషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం  ‘బిల్డ్ ఏపీ’ పేరుతో విశాఖలో అమ్మాలనుకున్న ఆరు స్థానాల్లో రెండు స్థలాల హైకోర్టు స్టే ఇచ్చింది.

 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా ‘బిల్డ్ ఏపీ’ పేరుతో కొత్త పథకాన్ని తెచ్చింది. దీనికనుగుణంగా గుంటూరు, విశాఖ జిల్లాలలోని కొన్ని భూములను ‘ఇ-వేలం’ వేయడానికి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ పథకం ద్వారా అవసరం లేని ప్రభుత్వ భూములను మార్కెట్ ధరకు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు విక్రయించాలని, దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావించిందని పలువురు విశ్లేషిస్తున్నారు. బిల్డ్ ఏపీ మిషన్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక స్టేట్ లెవెల్ మోనిటరింగ్ కమిటీ (ఎస్‌ఎల్‌ఎంసి)ని ఏర్పాటు చేసింది. దీనికి సంభంధించి జిఓ 447ను విడుదల చేశారు. అసలు ప్రభుత్వ భూములు ఇలా అమ్మడం వివేకమేనా అనే ప్రశ్న కూడా వస్తోంది.

Posted

I hope AP is in better hands now. Atu Jaggad vunna lenatte gov la. Thanks to CBN for his Mundhu choopu S@nC#aZiNuv lekapoyina nee case la valle kadyya AP people peaceful ga nidrapothunnaru. 

Posted

వైఎస్సార్‌ ఫొటో ఎందుకు పెట్టకూడదు: హైకోర్టు

 
AP-HIGH-COURT.jpg?itok=sQxwLi3U

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై దివంగత ముఖ్యమం‍త్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫోటో పెట్టడంలో తప్పేముందని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వైఎస్సార్‌ తండ్రి అని, ఆయన గతంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారని న్యాయస్థానం గుర్తుచేసింది. ప్రభుత్వ ప్రకటనల్లో వైఎస్సార్‌ ఫోటోను తొలగించాలని కోరుతూ టీడీపీకి చెందిన ఓ వ్యక్తి ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఆయన ఫోటోలను ఎందుకు పెట్టకూడదని, వైఎస్సార్‌ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా? అని వ్యాఖ్యానించింది. ఈ వ్యాజ్యాన్ని తాము విచారించబోమని, రెగ్యులర్‌ బెంచ్‌ వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. పిటిషన్‌పై సోమవారం విచారణ సందర్భంగా అడ్వకేట్‌ జరనల్‌ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ఇది పక్కా బినామీ పొలిటికల్‌ పిటిషన్‌ అని అన్నారు.

పిటిషన్‌ దాఖలు చేసిన వ్యక్తి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి చెందిన వ్యక్తి అని, ఆయన టీడీపీ సానుభూతి పరుడని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ‘పిటిషనర్‌ టీడీపీతో విడదీయరాని అనుబంధం ఉన్న వ్యక్తి. టీడీపీతో రాజకీయ అనుబంధాన్ని ఇక్కడ తొక్కిపెడుతున్నారు. చంద్రబాబు హయాంలో పసుపురంగులో ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చినప్పుడు ఈయనకు చాలా సుఖంగా ఉంది. టీడీపీ అధికారానికి దూరంకాగానే పాపం ఈయన అంతరాత్మ క్షోభిస్తోంది.’ అని వాదించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రచురించిన ప్రభుత్వ ప్రకటలను అడ్వకేట్‌ హైకోర్టుకు నివేదించారు. చంద్రబాబు, లోకేష్, నారాయణ, ఎన్టీఆర్‌ ఫొటోలు పెట్టారని తెలిపారు. మంత్రులు, ఇతర వ్యక్తుల ఫొటోలు ప్రకటనల్లో పెట్టుకోవచ్చని దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలోనే తీర్పునిచ్చినిందని గుర్తుచేశారు.

Posted

అమరావతి: సాక్షి టీవీ, పత్రికకు ప్రకటనలపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా వాటికి ప్రభుత్వ ప్రకనటలు ఇస్తున్నారంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ప్రకటనలను వైసీపీ జెండా పోలిన రంగులతో ప్రచురిస్తున్నారని పిటిషనర్ తన పిటిషన్‌లో ఆరోపించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఉమాదేవితో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌కు బదిలీ చేయాల్సిందిగా ద్విసభ్య ధర్మాసనం కోరింది.

  • 2 weeks later...
Posted

కోవిడ్ బాధితులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. గుంటూరు వాసి సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. అదనపు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు వాయిదా ఇవ్వాల్సిందిగా అదనపు అడ్వకేట్ జనరల్ కోరడంతో పిటిషన్‌‌పై విచారణను ఉన్నత న్యాస్థాయం వచ్చే వారానికి వాయిదా వేసింది. పిటీషన్ తరపున  న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...