Jump to content

Raghu Rama Krishna Raju Letters On Public Issues

Somedude

Recommended Posts

RRR ప్రెస్సుమీట్స్ మిస్ అవుతున్నాం. ఆలా అని RRR సైలెంట్ గా అయితే లేరు. లెటర్స్ రూపం లో ప్రతి రోజు ప్రజల సమస్యల ని ఒక నిబద్ధధ కలిగిన ఎంపీ గా ఒక్కొకటి గా ప్రజల తరుపున ప్రభుత్వంని రిక్వెస్ట్ చెయ్యడం జరుగుతుంది. లెటర్స్ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం.

దయ చేసి లెటర్స్ తప్ప వేరే RRR రిలేటెడ్ టాపిక్స్ పోస్ట్ చెయ్యవొద్దు అని మనవి.

  • Upvote 1
Link to comment
Share on other sites

  • Replies 36
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Somedude

    17

  • Battu123

    3

  • ShruteSastry

    3

  • NiranjanGaaru

    3

Top Posters In This Topic

రెడ్డి ఎంటర్‌ప్రైజెస్ చేస్తున్న వసూళ్లపై తక్షణమే విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్‌ మోహన్‌రెడ్డి గారికి లేఖ రాసిన నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ రఘురామకృష్ణ రాజు గారు.
రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయాన్నిచ్చే ఏపీబెవరేజెస్ సంస్థ ఉద్యోగులు వారి సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారని కానీ తమరు అవకాశం ఇవ్వకపోవడంతో ఈ సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు.
6 నెలల క్రితం రెడ్డి ఎంటర్‌ప్రైజెస్ ఏజెన్సీ సుమారు 10,258 మంది ఉద్యోగులకు నెల జీతం చెల్లించాలంటూ రాష్ట్రంలోని మద్యం షాపుల నుంచి దాదాపు 5 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు పకడ్బందీ ప్లాన్ వేసిందని, ఇప్పుడు మరో 10.25 కోట్ల వసూలు చేసేందుకు ప్లాన్ వేసిందని, ఈ సంఘటనలపై డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేసినా ఇంకా ఎటువంటి విచారణ చేపట్టలేదని పేర్కొన్నారు.
214860027_2965058950401118_2015359160191
214582173_2965058987067781_4279440370277
  • Upvote 2
Link to comment
Share on other sites

రైతు దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని రైతుల బాధలను అర్ధం చేసుకుని ధాన్య సేకరణ నిమిత్తం వారికి చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారికి లేఖ రాసిన నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ రఘురామకృష్ణ రాజు గారు.
రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సుమారు రూ.1,619 కోట్లు చెల్లించాల్సి ఉందని, ధాన్యం సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసిందని తెలిపారు. కేంద్రం విడుదల చేసిన నిధులను ఇతర పథకాల కోసం మళ్లించకుండా రైతుల బకాయిలు చెల్లించేందుకు మాత్రమే వినియోగించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో రైతులను దళారులు దోచుకుంటున్నారని, రైతు పేరును పార్టీ పేరులో మాత్రమే కాదు వారిని గుండెల్లో కూడా పెట్టుకోవాలని పేర్కొన్నారు.
214737546_2964287977144882_5633049710971
211338922_2964288047144875_8706621764436
  • Upvote 1
Link to comment
Share on other sites

  • Somedude changed the title to Raghu Rama Krishna Raju Letters On Public Issues
గౌరవ సుప్రీంకోర్టు ఇప్పటికే రద్దు చేసిన ఐటి చట్టం 66 (ఏ) కింద నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఇలాంటి కేసులలో కోర్టు ఇచ్చిన తీర్పులను, సూచనలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో చట్టాలు సక్రమంగా అమలు అయ్యేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారికి లేఖ రాసిన నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ రఘురామకృష్ణ రాజు గారు.
రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై రాష్ట్ర ప్రభుత్వం ఐటి చట్టం 66 (ఏ) సెక్షన్ ప్రకారం విచ్చలవిడిగా తప్పుడు కేసులు బనాయిస్తున్నట్లు పౌర సమాజం, మానవహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయని, పోలీసులు ఇక నుంచి అయినా కేసుల నమోదుపై తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఐ టి చట్టం సెక్షన్ 66 (ఏ) కి సంబంధించి కోర్టు ధిక్కరణ చర్యగా భావించి సుప్రీంకోర్టు తనంత తానుగా (సుమోటో) కేసు స్వీకరించే అవకాశం ఉందని తెలిపారు.
మహిళ పట్ల నిర్దిష్టమైన నేరాలు చేసే వారికి సంబంధించిన కేసులను 21 రోజుల్లో పరిష్కరించి వారికి శిక్ష పడేలా చేయాలని "దిశ" చట్టం తీసుకువచ్చారని, అయితే కేంద్రం నుంచి అనుమతి రాకుండానే 18 దిశ పోలీసు స్టేషన్లను మరియు దిశ యాప్ ను కూడా మొదలు పెట్టారని తెలిపారు. దిశ యాప్ లాంటి సాంకేతిక అంశాలు ప్రవేశ పెట్టడం ప్రశంసనీయమే అయినా తద్వారా వచ్చే ఫిర్యాదులను దిశ చట్టం కింద నమోదు చేయాలంటే ముందుగా ఈ దిశ చట్టాన్ని కేంద్రం ఆమోదించాల్సి ఉంటుందని లేదంటే రాజ్యాంగ పరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
209217121_2963467530560260_4089998559818
214082909_2963467573893589_2901653889038
  • Upvote 1
Link to comment
Share on other sites

ప్రభుత్వంలో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి హోదా, అధికారంపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారికి లేఖ రాసిన నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ రఘురామకృష్ణ రాజు గారు.
ప్రభుత్వ సలహాదారుగా ఉండి మంత్రులు సమాధానం చెప్పవలసిన అంశాలపై కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ఏంటి అని ప్రజలు అనుకుంటున్నారని, అందుకే ముఖ్యమంత్రి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర మీద వివరణ ఇవ్వాలని కోరారు.
213120743_2962725760634437_3228224226977
214004447_2962725787301101_8739009766063
  • Upvote 1
Link to comment
Share on other sites

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఇసుక పాలసీని తక్షణమే మార్చాలని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారికి లేఖ రాసిన నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ రఘురామకృష్ణ రాజు గారు.
ఇసుక సరఫరా బాధ్యతను కాంట్రాక్టర్‌ లకు అప్పగించిన తరవాత రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రమైందని, నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పడిపోయాయని, ప్రభుత్వం తీసుకువచ్చిన రెండో ఇసుక పాలసీ కూడా దారుణంగా విఫలమైందని, ఇప్పుడు మూడో ఇసుక పాలసీ కోసం పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీకి భిన్నంగా ఇసుక ర్యాంపుల దగ్గర దళారీల ప్రమేయం ఉందని అన్నారు. అన్ని చోట్లా ఒకే ధరకు ఇసుక లభించేలా వెంటనే ఇసుక పాలసీను మార్చాలని కోరారు.
211887789_2961944950712518_5105889043441
213312843_2961944990712514_6937391473840
  • Upvote 2
Link to comment
Share on other sites

22 minutes ago, jawaani_jaaneman said:

Season-2 epudu start ?

meesam meleyadam scene baaga kudirindi first season lo...

second season lo kuda ilanti scenes vunaya ?

Yea season 2 opening shot da babu malli jail lo tennis 🎾 kottukune shot tho estart avudi ending ki bro anil ap cm avutadu.. idi da sequence

Link to comment
Share on other sites

7 minutes ago, psycopk said:

Yea season 2 opening shot da babu malli jail lo tennis 🎾 kottukune shot tho estart avudi ending ki bro anil ap cm avutadu.. idi da sequence

Chandranna pasupu kumkuma panche scene kaka…chala baaga kudirindi, background lo Amaravati skyline…

Link to comment
Share on other sites

గౌరవ హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవిలో మరియు పార్టీ పదవిలో కొనసాగుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎదో ఒక్క పదవికి మాత్రమే పరిమితం చేయాలని సూచిస్తూ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారికి లేఖ రాసిన నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ రఘురామకృష్ణ రాజు గారు.
సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతూ పార్టీ వ్యవహారాలు చూడడం సరికాదని, ఈ విషయంపై సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఈ నెల 6వ తేదీన మీకు లేఖ రాశానని, ఇప్పుడు ఇదే విషయంపై రాష్ట్ర హైకోర్టు కూడా వ్యాఖ్యానించిందని అన్నారు.
ఈ నెల 19 న తదుపరి విచారణ జరిగే లోపు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎదో ఒక పదవికే పరిమితం చేస్తే ముఖ్యమంత్రిగా మీ గౌరవం పెరుగుతుందని లేకపోతే ఈ అంశంపై విమర్శనాస్త్రాలు సంధించేందుకు ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టవుతుంది అని పేర్కొన్నారు.
 
215901224_2965147793725567_5406116984364
214582173_2965058987067781_4279440370277
216402537_140364758201483_88215261768818
  • Upvote 1
Link to comment
Share on other sites

ఉత్తరాలు రాయడమేన లేక ఎన్నికైన నియోజకవర్గాల్లోని ఏదైనా పని చేస్తున్నారా రాజు గారు?

  • Haha 1
Link to comment
Share on other sites

3 hours ago, Somedude said:
రెడ్డి ఎంటర్‌ప్రైజెస్ చేస్తున్న వసూళ్లపై తక్షణమే విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్‌ మోహన్‌రెడ్డి గారికి లేఖ రాసిన నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ రఘురామకృష్ణ రాజు గారు.
రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయాన్నిచ్చే ఏపీబెవరేజెస్ సంస్థ ఉద్యోగులు వారి సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారని కానీ తమరు అవకాశం ఇవ్వకపోవడంతో ఈ సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు.
6 నెలల క్రితం రెడ్డి ఎంటర్‌ప్రైజెస్ ఏజెన్సీ సుమారు 10,258 మంది ఉద్యోగులకు నెల జీతం చెల్లించాలంటూ రాష్ట్రంలోని మద్యం షాపుల నుంచి దాదాపు 5 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు పకడ్బందీ ప్లాన్ వేసిందని, ఇప్పుడు మరో 10.25 కోట్ల వసూలు చేసేందుకు ప్లాన్ వేసిందని, ఈ సంఘటనలపై డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేసినా ఇంకా ఎటువంటి విచారణ చేపట్టలేదని పేర్కొన్నారు.
214860027_2965058950401118_2015359160191
214582173_2965058987067781_4279440370277

Eddy enterprise aa.. E toka gallu direct danda chestunnaru

Link to comment
Share on other sites

4 minutes ago, ShruteSastry said:

ఉత్తరాలు రాయడమేన లేక ఎన్నికైన నియోజకవర్గాల్లోని ఏదైనా పని చేస్తున్నారా రాజు గారు?

Prajalaki pani cheyali a??? E kaalam lo unav guru

Prajale pedda porambokulu vallaaki endhi chesedhi

50 cr petti konukadau election time lo, maro 50 to jaggad, lite

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

2 minutes ago, NiranjanGaaru said:

Prajalaki pani cheyali a??? E kaalam lo unav guru

Prajale pedda porambokulu vallaaki endhi chesedhi

50 cr petti konukadau election time lo, maro 50 to jaggad, lite

DB Intellect @ShruteSastry gaariki vishayam thakkuva. News follow avvadhu, context theloyadhu. Jaggadini ante thattukoledhu.

  • Haha 1
Link to comment
Share on other sites

3 minutes ago, NiranjanGaaru said:

Prajalaki pani cheyali a??? E kaalam lo unav guru

Prajale pedda porambokulu vallaaki endhi chesedhi

50 cr petti konukadau election time lo, maro 50 to jaggad, lite

song discussions GIF అలాగ, 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...