Jump to content

Raghu Rama Krishna Raju Letters On Public Issues


Somedude

Recommended Posts

Just now, Somedude said:

DB Intellect @ShruteSastry gaariki vishayam thakkuva. News follow avvadhu, context theloyadhu. Jaggadini ante thattukoledhu.

True chala mandi jaggad musugu abhimanulu untaru vishya parigananam takkuva, jaggad midha guddi abhimanam ekkuva, acc to RRR, alanti vallu undadam jaggad adrustam

  • Upvote 2
Link to comment
Share on other sites

  • Replies 36
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Somedude

    17

  • Battu123

    3

  • ShruteSastry

    3

  • NiranjanGaaru

    3

Top Posters In This Topic

49 minutes ago, Somedude said:
గౌరవ హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవిలో మరియు పార్టీ పదవిలో కొనసాగుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎదో ఒక్క పదవికి మాత్రమే పరిమితం చేయాలని సూచిస్తూ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారికి లేఖ రాసిన నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ రఘురామకృష్ణ రాజు గారు.
సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతూ పార్టీ వ్యవహారాలు చూడడం సరికాదని, ఈ విషయంపై సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఈ నెల 6వ తేదీన మీకు లేఖ రాశానని, ఇప్పుడు ఇదే విషయంపై రాష్ట్ర హైకోర్టు కూడా వ్యాఖ్యానించిందని అన్నారు.
ఈ నెల 19 న తదుపరి విచారణ జరిగే లోపు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎదో ఒక పదవికే పరిమితం చేస్తే ముఖ్యమంత్రిగా మీ గౌరవం పెరుగుతుందని లేకపోతే ఈ అంశంపై విమర్శనాస్త్రాలు సంధించేందుకు ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టవుతుంది అని పేర్కొన్నారు.
 
215901224_2965147793725567_5406116984364
214582173_2965058987067781_4279440370277
216402537_140364758201483_88215261768818

Foodcourt kutra antunna @kidney

Link to comment
Share on other sites

31 minutes ago, NiranjanGaaru said:

True chala mandi jaggad musugu abhimanulu untaru vishya parigananam takkuva, jaggad midha guddi abhimanam ekkuva, acc to RRR, alanti vallu undadam jaggad adrustam

telugu states duradrustam

  • Haha 1
Link to comment
Share on other sites

రాష్ట్ర ప్రభుత్వం సుమారు 41000 కోట్ల రూపాయలకు పైగా నిధులకు సరైన లెక్కలు చూపలేదని మీడియా, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు రాష్ట్ర ఆర్ధిక మంత్రి గారు తగు వివరణ ఇస్తే ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పెరుగుతుందని సూచిస్తూ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారికి లేఖ రాసిన నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ రఘురామకృష్ణ రాజు గారు.

204193504_2965707677002912_2225473260760

205805251_2965707720336241_5857534012478

Link to comment
Share on other sites

ప్రజా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్న తనపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసేందుకు పార్టీకి చెందిన పలువురు ఎంపీలను పదే పదే ఢిల్లీ కి పంపే బదులు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, రైల్వే జోన్ వంటి రాష్ట్ర సమస్యలపై మాట్లాడేందుకు పంపితే బాగుంటుందని సూచిస్తూ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారికి లేఖ రాసిన నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ రఘురామకృష్ణ రాజు గారు.
ఇటీవల తనపై వేసిన అనర్హత పిటీషన్ విషయంలో రాజ్యసభ సభ్యుడు శ్రీ విజయసాయి రెడ్డి గౌరవ లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారిని అగౌరపరిచేలా మీడియా ముఖంగా మాట్లాడారని మరియు పార్లమెంటు సమావేశాలు జరుగకుండా స్తంభింపచేస్తామని అన్నారని, గౌరవప్రదమైన పదవిలో ఉన్న వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని అందుకే శ్రీ విజయసాయి రెడ్డి పై పార్లమెంటులో ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేశానని తెలిపారు.
రాజ్యాంగ బద్దంగా నడుచుకుంటున్న తనపై అనర్హత వేయించాలని సమయం వృధా చేయకుండా ఇప్పటికైనా రాబోయే పార్లమెంట్ సమావేశాలలో రాష్ట్రానికి సంబంధించిన హక్కుల కోసం పోరాడాలని ఎంపీలకు దిశానిర్దేశం చేయాలని ముఖ్యమంత్రి గారికి సూచించారు.
 
214900170_2966499240257089_9193203912485
216743045_2966499320257081_6325037006166
217472970_2966499260257087_8430826958095
Link to comment
Share on other sites

తెలుగు అకాడమీ పేరును తెలుగు సంస్కృత అకాడమీగా మారుస్తూ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు మరియు నిపుణుల యొక్క అభిప్రాయం తీసుకోవాలని సూచిస్తూ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారికి లేఖ రాసిన నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ రఘురామకృష్ణ రాజు గారు.
ఎందరో మహనీయుల కృషితో మన తెలుగు భాషకు ప్రాచీన భాషగా గుర్తింపు వచ్చినందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు అందరూ గర్వపడుతున్నారని, కానీ ప్రభుత్వం మాత్రం తెలుగు భాషను తుడిచిపెట్టేలా ప్రాధమిక విద్యలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలనుకోవడం ఇప్పుడు దీనికి కొనసాగింపుగా తెలుగు అకాడమీలో సంస్కృతాన్ని చేర్చేలా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై తెలుగు ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.
 
204345490_2967240890182924_6330666644162
215664211_2967240973516249_8962436731476
215004642_2967241080182905_3796595736488
Link to comment
Share on other sites

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని కేంద్రం ప్రభుత్వం ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకూ రాష్ట్రంలో అది అమలు కాలేదని, ఈ కారణంగా ఉన్నత విద్య కొరకు విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని కావున ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి వ్యాక్షినేషన్ ప్రక్రియ తక్షణమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారికి లేఖ రాసిన నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ రఘురామకృష్ణ రాజు గారు.
రాష్ట్ర ప్రభుత్వం రోజూ విడుదల చేస్తున్న కరోనా బులిటెన్లు పరిశీలించినా, ప్రభుత్వం నిర్వహించే జననమరణల రిజిస్టర్ చూసినా దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో మరణాల శాతం ఎక్కువగా ఉందని, అదేవిధంగా చాలా మరణాలు కరోనా కింద చూపించండం లేదని ప్రజలలో సందేహాలు ఉన్నాయని, ఒకవేళ అవి కరోనా మరణాలు కాకపోతే ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు ఎలా సంభవించాయో తెలుసుకుని ప్రజల సందేహాలు నివృత్తి చేసి వారిలో నెలకొన్న భయం తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అలాగే ఈ మరణాలను అదుపు చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారికి సూచించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యులు ఎవరూ ప్రైవేట్ గా ప్రాక్టీస్ చేయకూడదని నిషేధం విధించారని, కానీ AP మెడికల్ కౌన్సిల్ మరియు AP మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లలో మెంబర్లుగా తెలంగాణా రాష్ట్రంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాక్టీస్ చేసుకునే న్యూరో సర్జన్ డాక్టర్ శివా రెడ్డి, అదే ఆసుపత్రికి చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ బి చంద్రశేఖర్ రెడ్డి లను నియమించడం సరికాదని వారికి సరైన అనుభవం కూడా లేదని తెలిపారు.
205308427_2967956293444717_4797727253208
206691631_2967956336778046_5455711601131
Link to comment
Share on other sites

On 7/9/2021 at 8:32 AM, NiranjanGaaru said:

True chala mandi jaggad musugu abhimanulu untaru vishya parigananam takkuva, jaggad midha guddi abhimanam ekkuva, acc to RRR, alanti vallu undadam jaggad adrustam

Andulo converted batch ayite 100% malokam Batch jagan ni blind ga support chestaru 

Link to comment
Share on other sites

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరముల నుండి 57 సంవత్సరాలకు తగ్గించాలని ముఖ్యమంత్రి గారికి వచ్చిన ఆలోచన గురించి విని చాలా నిరాశకు గురయ్యానని, ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని తక్షణమే ఈ ఆలోచనను విరమించుకోవాలని సూచిస్తూ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారికి లేఖ రాసిన నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ రఘురామకృష్ణ రాజు గారు.
ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల అధికారాలను ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ చేయడం సరైన చర్య కాదని, అది ఎన్నికైన ప్రజా ప్రతినిధుల హక్కులను హరించడం అవుతుందని అన్నారు. దానికి ఇటీవల గ్రామ సర్పంచ్‌ల యొక్క అధికారాలను VRO లకు బదిలీ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన GO No. 2 ను గౌరవ హైకోర్టు సస్పెండ్ చేయడమే ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇలాంటి విషయాలలో నిర్ణయాలు తీసుకునేముందు నిపుణులతో చర్చించాలని లేకపోతే కోర్టులలో ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని ముఖ్యమంత్రి గారికి సూచించారు.
217725116_2968747826698897_6307106503514
217467136_2968747863365560_4985663500468
216512653_2968747946698885_7463383652342
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...