Jump to content

***** Andhra High Court Daily Updates ******

Recommended Posts

Posted
07022020174756n81.jpg

అమరావతి: మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు మెరుగైన వైద్యకోసం వెంటనే ఆస్పత్రికి తరలించాలని.. ఆయన తరపు లాయర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  అచ్చెన్న ఆరోగ్యం బాగా లేకపోయినా బలవంతంగా  జైలుకు తరలించారని పిటిషన్‌లో లాయర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు.. శుక్రవారం విచారించే అవకాశం ఉంది. 

కాగా ఈఎస్ఐ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడును బుధవారం విజయవాడ సబ్ జైలుకు తరలించారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆయనను వైద్యులు డిశ్చార్జి  చేయండతో పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అయితే అచ్చెన్న ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని, కొన్ని రిపోర్టులు కూడా రావాల్సి ఉందని అచ్చెన్న తరపు లాయర్, టీడీపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అచ్చెన్నాయుడి లాయర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు

Posted

If you're bad...I'm your dad ni nijam chestunnaru

Posted

అచ్చెన్నాయుడును ఆస్పత్రికి తరలించే అంశంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ అంశంపై శనివారం తీర్పు ఇస్తామని హైకోర్టు తెలిపింది. అచ్చెన్నాయుడుకు రెండోసారి శస్త్రచికిత్స జరిగిందని, చికిత్స తర్వాత పరిస్థితి ఇబ్బందిగా మారిందని అచ్చెన్న.. లాయర్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, అచ్చెన్నకు మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాలని లాయర్‌ విజ్ఞప్తి చేశారు. అచ్చెన్నాయుడుకు పూర్తిస్థాయిలో చికిత్స అందించామని, ఆయనకు మెరుగైన వైద్యం అవసరం లేదని ప్రభుత్వ లాయర్‌ తెలిపారు.

Posted
23 hours ago, snoww said:

Vachinda judgement ? Eagerly waiting for another mottikaaya to jalaganna. count 69 daggare aagipoyindi. 

Posted

కస్టడీ ముగిసింది.. బెయిలివ్వండి

విచారణకు పూర్తిగా సహకరిస్తా

మాపై కక్షతోనే కేసులో ఇరికించారు

విచారణ లేకుండానే అరెస్టు చేశారు

హైకోర్టును ఆశ్రయించిన అచ్చెన్నాయుడు

అమరావతి, జూలై 6(ఆంధ్రజ్యోతి): ఈఎస్‌ఐ కొనుగోళ్లలో జరిగిన అవకతవకలకు సంబంధించి తనను అక్రమంగా ఇరికించారని, బెయిల్‌ మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. గుంటూరు జనరల్‌ ఆసుపత్రిలో ఏసీబీ అధికారులు మూడు రోజుల పాటు విచారించారని, కస్టడీ ముగిసిందని తెలిపారు. ఇక తన నుంచి వారు రాబట్టాల్సిన వివరాలు కూడా ఏమీ లేనందున, కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదన్నారు. ఈ వ్యవహారంలో త్వరితగతిన విచారణ పూర్తయ్యేందుకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొంటూ సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. 

అధికారుల అత్యుత్సాహం

ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో తనను కక్షపూరితంగా ఇరికించారని అచ్చెన్నాయుడు తన పిటిషన్‌లో తెలిపారు. ఈ కేసులో జూన్‌ 10న ఐఎంఎస్‌ డైరెక్టర్‌ ఫిర్యాదు చేయగా, అదేరోజు కేసు నమోదు చేశారని తెలిపారు. అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద తనపై నమోదు చేయదగ్గ అంశాలేవీ ఆ ఫిర్యాదులో లేవని వివరించారు. తన అరెస్టు చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. వైద్య సేవల పనుల అప్పగింతపై ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌కు 2016లో తాను ఆదేశాలు జారీ చేశానంటూ తనపై ఆరోపణలు చేశారని, కానీ, తాను 2017లో ఆ శాఖ మంత్రిగా వైదొలగానని వివరించారు. ఇంతకాలం తర్వాత గత జూన్‌ 10న కేసు నమోదు చేశారన్నారు.

గత నెల 16న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా, అదే నెల 19న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకునేందుకు తనను హడావుడిగా అరెస్టుచేశారని వివరించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సీఎం జగన్‌ ఆదేశాల మేరకు తనను అక్రమ కేసులో ఇరికించారని తెలిపారు. దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తనకు బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. 

‘కార్పొరేట్‌ చికిత్స’ పిటిషన్‌పై తీర్పు రేపు

మెరుగైన వైద్యం కోసం గుంటూరు లేదా విజయవాడ నగరాల్లోని ఏదైనా కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరి, తన సొంత ఖర్చుతో చికిత్స చేయించుకునేందుకు అనుమతించాలని అభ్యర్థిస్తూ అచ్చెన్నాయుడు గతంలో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌పై సోమవారం కూడా న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత ముందు మరోమారు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు పూర్తి కావడంతో తీర్పును బుధవారానికి వాయిదా వేశారు.

Posted

స్పీకర్‌ తమ్మినేనిపై ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు రమేష్‌నాయుడు సీరియస్ అయ్యారు. కోర్టు తీర్పులను ఉద్దేశించి తమ్మినేని చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. స్పీకర్ తమ్మినేనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు రమేష్‌నాయుడు సీజేకు లేఖ రాశారు. కోర్టు ధిక్కరణ కింద స్పీకర్‌పై సుమోటోగా విచారించాలని ఆయన కోరారు. 

Posted

Motti kaaya number 70 

అచ్చెన్న కేసులో హైకోర్టు కీలక ఆదేశం

07082020110635n84.jpg

అమరావతి: అచ్చెన్నాయుడు కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అచ్చెన్నాయుడిని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది. వెంటనే న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కోర్టు నిర్ణయంపై ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడును ఏ ఆస్పత్రికి తరలించాలన్నది.. ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నిర్థారించాలని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ప్రభుత్వ తరుపు న్యాయవాది వాదనను ధర్మాసానం తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అచ్చెన్నాయుడును గుంటూరు రమేష్‌ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Posted
పశువుల మేత భూముల్లో ఇళ్ల స్థలాలా?

స్టాండింగ్‌ ఆర్డర్స్‌కు విరుద్ధంగా జీవో ఎలా ఇస్తారు?

అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారో మాకు తెలుసు

ఇప్పటికే నిర్మించిన ఇళ్లను పక్కనపెట్టి ఈ హడావుడి ఏమిటి?

రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

చిత్తూరు జిల్లాలో 31 ఎకరాల్లో ఇళ్ల స్థలాలపై ‘స్టే’

పశువుల మేత భూముల్లో ఇళ్ల స్థలాలా?

ఈనాడు, అమరావతి: నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కోసం భూసేకరణ, స్థలాల కేటాయింపు విషయంలో కొన్ని ప్రాంతాల్లో అధికారులు అనుసరిస్తున్న తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. రెవెన్యూ బోర్డు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ ప్రకారం పశువుల మేత కోసం కేటాయించిన భూములు, నదులు, చెరువులు, కుంటల తీర ప్రాంతాల్ని ఇతర అవసరాలకు మార్చడం నిషేధమని స్పష్టంచేసింది. ఆ భూముల్ని ఇళ్ల స్థలాలుగా మార్చే అధికారం ఎక్కడుందని నిలదీసింది. బోర్డు స్టాండింగ్‌ ఆర్డర్స్‌కు విరుద్ధంగా జీవో ఎలా జారీ చేస్తారని ప్రభుత్వ న్యాయవాది సుభాష్‌ను ప్రశ్నించింది. ఇళ్ల స్థలాలిచ్చే పేరుతో అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారో మాకు తెలుసని వ్యాఖ్యానించింది. ఈ విషయమై అధికారుల తీరును సవాలు చేస్తూ సింగిల్‌ జడ్జి వద్ద ఉన్న వ్యాజ్యాలన్నింటినీ అవసరమైతే ధర్మాసనం ముందుకు తెప్పించి విచారణ చేస్తామని స్పష్టం చేసింది. చిత్తూరు జిల్లా పాకాల మండలం ఆదెనపల్లి గ్రామంలో పశువుల మేతకు ఉద్దేశించిన 31 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు, స్థలాలిచ్చే ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. నాలుగు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, చిత్తూరు జిల్లా కలెక్టర్‌, పాకాల ఆర్డీవో, తహసీల్దార్లను ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

పాకాల మండలంలోని ఆదెనపల్లిలో వివిధ సర్వే నంబర్లలో పశువుల మేతకు ఉద్దేశించిన (మందబయలు, మేతబీడు) 31 ఎకరాల్లో నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాలు ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదించడాన్ని సవాలు చేస్తూ జి.రాజారత్నంనాయుడు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎస్‌.ప్రణతి వాదనలు వినిపిస్తూ.. పశువుల మేత భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నారన్నారు. ఆ భూముల స్వభావాన్ని మార్చకుండా అధికారుల్ని నిలువరించాలని కోరారు. ఇళ్ల స్థలాల కోసం 4 ఎకరాల్నే తీసుకుంటున్నామని.. నిబంధనల ప్రకారమే జీవో 558 జారీ చేశామని జీపీ చెప్పారు. ఆ వాదనలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. బోర్డు స్టాండింగ్‌ ఆర్డర్స్‌కు విరుద్ధంగా జీవో ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. ఇళ్ల స్థలాల వ్యవహారంలో సాధారణ ఆదేశాలు (జనరల్‌ ఆర్డర్‌) ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

అనుసరిస్తున్న విధానమేంటి?

పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం కె.సముద్రపుగట్టు గ్రామ పరిధిలో తనకు చెందిన చేపల చెరువులోని 150సెంట్ల భూమిలో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ఖాళీ చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని అరిగెల వెంకట్రావు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ జేకే మహేశ్వరి బుధవారం విచారణ జరిపారు. ప్రభుత్వ న్యాయవాది (జీపీ) వాదనలు వినిపిస్తూ.. ఆ స్థలం విషయంలో పిటిషనర్‌కు హక్కు లేదన్నారు. సీజే స్పందిస్తూ.. భూములు తీసుకోవడానికి ఏ విధానాన్ని అనుసరిస్తున్నారు, ఆ స్కీం వివరాల్ని సమర్పించాలన్నారు. ఇప్పటికే పలు గృహాలను ప్రభు త్వం నిర్మించి ఉన్నప్పటికీ కొన్నిచోట్ల కనీసం విద్యుత్తు కనెక్షన్‌ ఇవ్వలేదని గుర్తుచేశారు. ఆ ఇళ్లను ఎందుకు పంచిపెట్టడంలేదని ప్రశ్నించారు. ఆ విషయాన్ని పక్కనపెట్టి ఇళ్ల పట్టాల పంపిణీ అంటూ హడావుడి ఏమిటని వ్యాఖ్యానించారు. విచారణను వారంరోజులకు వాయిదా వేశారు.

Posted

మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే  గవర్నర్‌ను కలిసి హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సిందిగా కోరాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కోర్టు ఆదేశించింది. తాము ఇచ్చిన తీర్పు ప్రకారం ఎన్నికల కమిషనర్‌ను నియమించే అవకాశం గవర్నర్‌కు ఉందని చెప్పామని..సుప్రీంకోర్టులో మూడు సార్లు విచారణ జరిగినా స్టే రాలేదని రమేష్ తరపు న్యాయవాది అశ్వనీకుమార్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  స్టే ఇవ్వలేదు కాబట్టి, తాము ఇచ్చిన తీర్పు అమల్లో ఉన్నట్లేనని హైకోర్టు పేర్కొంది. ధర్మాసనం తీర్పు అమలు జరపాల్సిందేనని, ఈలోపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేయాలని కోర్టు సూచించింది. అనంతరం వచ్చే శుక్రవారానికి విచారణను వాయిదా వేసిన హైకోర్టు...ఈలోపు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

Posted

Eppudu meeting lemongadda governor ni.

Mister governor. Give me my job back. 

Posted
Just now, snoww said:

Eppudu meeting lemongadda governor ni.

Mister governor. Give me my job back. 

7months job kosam enduku ila prakuladuthunadu annadi ippati ki ardam kavatamledu, poni elections emanna unnaya ee madhya lo ante emi ledu

Posted
49 minutes ago, bhaigan said:

7months job kosam enduku ila prakuladuthunadu annadi ippati ki ardam kavatamledu, poni elections emanna unnaya ee madhya lo ante emi ledu

Battle of egos..

Posted
53 minutes ago, bhaigan said:

7months job kosam enduku ila prakuladuthunadu annadi ippati ki ardam kavatamledu, poni elections emanna unnaya ee madhya lo ante emi ledu

Egos of both parties is one thing....

Secondly.... Ikkada NImmagadda will not loose anything ... At the max he will loose the case and as you said he is just going to retire in 7 months.... but it is causing damage to the state government if there is going to be any ...

Just an unnecessary fight ...

Posted
On 7/15/2020 at 11:36 PM, snoww said:
పశువుల మేత భూముల్లో ఇళ్ల స్థలాలా?

స్టాండింగ్‌ ఆర్డర్స్‌కు విరుద్ధంగా జీవో ఎలా ఇస్తారు?

అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారో మాకు తెలుసు

ఇప్పటికే నిర్మించిన ఇళ్లను పక్కనపెట్టి ఈ హడావుడి ఏమిటి?

రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

చిత్తూరు జిల్లాలో 31 ఎకరాల్లో ఇళ్ల స్థలాలపై ‘స్టే’

పశువుల మేత భూముల్లో ఇళ్ల స్థలాలా?

ఈనాడు, అమరావతి: నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కోసం భూసేకరణ, స్థలాల కేటాయింపు విషయంలో కొన్ని ప్రాంతాల్లో అధికారులు అనుసరిస్తున్న తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. రెవెన్యూ బోర్డు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ ప్రకారం పశువుల మేత కోసం కేటాయించిన భూములు, నదులు, చెరువులు, కుంటల తీర ప్రాంతాల్ని ఇతర అవసరాలకు మార్చడం నిషేధమని స్పష్టంచేసింది. ఆ భూముల్ని ఇళ్ల స్థలాలుగా మార్చే అధికారం ఎక్కడుందని నిలదీసింది. బోర్డు స్టాండింగ్‌ ఆర్డర్స్‌కు విరుద్ధంగా జీవో ఎలా జారీ చేస్తారని ప్రభుత్వ న్యాయవాది సుభాష్‌ను ప్రశ్నించింది. ఇళ్ల స్థలాలిచ్చే పేరుతో అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారో మాకు తెలుసని వ్యాఖ్యానించింది. ఈ విషయమై అధికారుల తీరును సవాలు చేస్తూ సింగిల్‌ జడ్జి వద్ద ఉన్న వ్యాజ్యాలన్నింటినీ అవసరమైతే ధర్మాసనం ముందుకు తెప్పించి విచారణ చేస్తామని స్పష్టం చేసింది. చిత్తూరు జిల్లా పాకాల మండలం ఆదెనపల్లి గ్రామంలో పశువుల మేతకు ఉద్దేశించిన 31 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు, స్థలాలిచ్చే ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. నాలుగు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, చిత్తూరు జిల్లా కలెక్టర్‌, పాకాల ఆర్డీవో, తహసీల్దార్లను ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

పాకాల మండలంలోని ఆదెనపల్లిలో వివిధ సర్వే నంబర్లలో పశువుల మేతకు ఉద్దేశించిన (మందబయలు, మేతబీడు) 31 ఎకరాల్లో నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాలు ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదించడాన్ని సవాలు చేస్తూ జి.రాజారత్నంనాయుడు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎస్‌.ప్రణతి వాదనలు వినిపిస్తూ.. పశువుల మేత భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నారన్నారు. ఆ భూముల స్వభావాన్ని మార్చకుండా అధికారుల్ని నిలువరించాలని కోరారు. ఇళ్ల స్థలాల కోసం 4 ఎకరాల్నే తీసుకుంటున్నామని.. నిబంధనల ప్రకారమే జీవో 558 జారీ చేశామని జీపీ చెప్పారు. ఆ వాదనలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. బోర్డు స్టాండింగ్‌ ఆర్డర్స్‌కు విరుద్ధంగా జీవో ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. ఇళ్ల స్థలాల వ్యవహారంలో సాధారణ ఆదేశాలు (జనరల్‌ ఆర్డర్‌) ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

అనుసరిస్తున్న విధానమేంటి?

పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం కె.సముద్రపుగట్టు గ్రామ పరిధిలో తనకు చెందిన చేపల చెరువులోని 150సెంట్ల భూమిలో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ఖాళీ చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని అరిగెల వెంకట్రావు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ జేకే మహేశ్వరి బుధవారం విచారణ జరిపారు. ప్రభుత్వ న్యాయవాది (జీపీ) వాదనలు వినిపిస్తూ.. ఆ స్థలం విషయంలో పిటిషనర్‌కు హక్కు లేదన్నారు. సీజే స్పందిస్తూ.. భూములు తీసుకోవడానికి ఏ విధానాన్ని అనుసరిస్తున్నారు, ఆ స్కీం వివరాల్ని సమర్పించాలన్నారు. ఇప్పటికే పలు గృహాలను ప్రభు త్వం నిర్మించి ఉన్నప్పటికీ కొన్నిచోట్ల కనీసం విద్యుత్తు కనెక్షన్‌ ఇవ్వలేదని గుర్తుచేశారు. ఆ ఇళ్లను ఎందుకు పంచిపెట్టడంలేదని ప్రశ్నించారు. ఆ విషయాన్ని పక్కనపెట్టి ఇళ్ల పట్టాల పంపిణీ అంటూ హడావుడి ఏమిటని వ్యాఖ్యానించారు. విచారణను వారంరోజులకు వాయిదా వేశారు.

Inturi vunle assalu thaggatle 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...