Jump to content

***** Andhra High Court Daily Updates ******


snoww

Recommended Posts

21 minutes ago, snoww said:
మరో 44 మందికి హైకోర్టు నోటీసులు

మరో 44 మందికి హైకోర్టు నోటీసులు

అమరావతి: న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యల అంశంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో  మరో 44 మందికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు, పంచ్‌ ప్రభాకర్‌ సహా 44 మందికి నోటీసులు జారీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇదే కేసులో రెండ్రోజుల క్రితం 49 మందికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను మూడువారాల పాటు వాయిదా వేసింది.

Punch Prabhakar..!!! 

ROFL...

  • Haha 2
Link to comment
Share on other sites

 

సుధాకర్ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదనే నమ్మకం ఏంటి?: హైకోర్టు

05292020173903n26.jpg

 

అమరావతి: డాక్టర్‌ సుధాకర్ రిట్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సుధాకర్‌కు మెరుగైన వైద్యం అందించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. సుధాకర్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వ తరపు న్యాయవాది, కోర్టుకు తెలిపారు. సుధాకర్ పోలీస్‌ కస్టడీలో ఉన్నారా.. జుడిషియల్ కస్టడీలో ఉన్నారో తెలపాలని న్యాయమూర్తి ప్రశ్నించారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు ప్రభుత్వ తరపు న్యాయవాది రెండు రోజుల గడువు కోరారు. ఈ రెండు రోజుల్లో సుధాకర్ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదనే నమ్మకం ఏంటని న్యాయమూర్తి ప్రశ్నించారు.

విశాఖ మానసిక వైద్యశాలలో సంబంధం లేని మందులిస్తున్నారని, ఆ ఆస్పత్రి చికిత్సపై నమ్మకం లేని తనను మెరుగైన చికిత్స కోసం తక్షణం వేరే ఆస్పత్రికి తరలించి, కోర్టు పర్యవేక్షణలో వైద్యం అందించేలా ఆదేశాలు జారీచేయాలంటూ డాక్టర్‌ సుధాకర్‌ హైకోర్టును అభ్యర్థించిన విషయం తెలిసిందే. తనకు అందిస్తున్న చికిత్సపై ఇప్పటికే ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు లేఖ రాశానని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విశాఖ సీపీ, విశాఖ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్‌లను పేర్కొన్నారు. 

Link to comment
Share on other sites

14 minutes ago, snoww said:

 

సుధాకర్ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదనే నమ్మకం ఏంటి?: హైకోర్టు

05292020173903n26.jpg

 

అమరావతి: డాక్టర్‌ సుధాకర్ రిట్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సుధాకర్‌కు మెరుగైన వైద్యం అందించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. సుధాకర్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వ తరపు న్యాయవాది, కోర్టుకు తెలిపారు. సుధాకర్ పోలీస్‌ కస్టడీలో ఉన్నారా.. జుడిషియల్ కస్టడీలో ఉన్నారో తెలపాలని న్యాయమూర్తి ప్రశ్నించారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు ప్రభుత్వ తరపు న్యాయవాది రెండు రోజుల గడువు కోరారు. ఈ రెండు రోజుల్లో సుధాకర్ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదనే నమ్మకం ఏంటని న్యాయమూర్తి ప్రశ్నించారు.

విశాఖ మానసిక వైద్యశాలలో సంబంధం లేని మందులిస్తున్నారని, ఆ ఆస్పత్రి చికిత్సపై నమ్మకం లేని తనను మెరుగైన చికిత్స కోసం తక్షణం వేరే ఆస్పత్రికి తరలించి, కోర్టు పర్యవేక్షణలో వైద్యం అందించేలా ఆదేశాలు జారీచేయాలంటూ డాక్టర్‌ సుధాకర్‌ హైకోర్టును అభ్యర్థించిన విషయం తెలిసిందే. తనకు అందిస్తున్న చికిత్సపై ఇప్పటికే ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు లేఖ రాశానని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విశాఖ సీపీ, విశాఖ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్‌లను పేర్కొన్నారు. 

Erragadda hospital lo join cheste saripodi ga

Link to comment
Share on other sites

On 5/28/2020 at 11:51 AM, snoww said:

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలపై హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ ముగిసింది. దాదాపు మూడుగంటల పాటు వాదనలు విన్న న్యాయస్థానం చివరకు తీర్పును వెలువరించింది. కరోనా వైరస్‌ కట్డడికి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి విపత్తు నివారణ చట్టం 2005 ప్రకారం ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే తొలుత సంబంధిత శాఖకు ఫిర్యాదు చేయకుండా నేరుగా హైకోర్టును ఆశ్రయించడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది.

నేరుగా పిల్ వేయటం మూలంగా వాస్తవ విషయాలపై విచారణ చేయలేమని పిటిషన్‌ విచారణ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు

Problem solved. 

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై నందిగామ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయన లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించలేదని ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. దాదాపు రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు పలు చోట్ల లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారు. భారీ కాన్వాయ్‌తో ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా జగ్గయ్యపేట, కంచికర్లలో జనసమీకరణకు కారణమయ్యారని లాయర్‌ శ్రీనివాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్‌ 188 కింద కేసుల నమోదు చేశారు. (చదవండి : ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి సిద్ధం: బొత్స)

కాగా, ప్రత్యేక అనుమతితో మే 25న ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు మార్గమధ్యంలో పలుచోట్ల జనసమీకరణ, బైక్‌ ర్యాలీలతో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం కూడా దాఖలైంది. మరోవైపు విశాఖ వెళ్తానని ఏపీ డీజీపీ అనుమతి కోరిన చంద్రబాబు.. మహానాడు ముగియగానే తిరిగి హైదరాబాద్‌కు వెళ్లడం గమనార్హం. 

Link to comment
Share on other sites

05312020163813n16.jpg

 

 

హైదరాబాద్: హైకోర్టు తీర్పును, ఆదేశాలను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన అంశాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందన్నారు. తాను పదవీ బాధ్యతలు స్వీకరించడంపై రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అంశాలపై స్పందించిన నిమ్మగడ్డ... రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్వయం ప్రతిపత్తి, సమగ్రతను దెబ్బతీసేలా ఉందన్నారు. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంపై.. తిరిగి హైకోర్టును ఆశ్రయించాలని నిమ్మగడ్డ నిర్ణయించుకున్నారు. కోర్టు ధిక్కారం కింద పిటిషన్‌ వేయాలనే యోచనలో ఉన్నారు. తాను ఛార్జ్‌ తీసుకున్నట్లు ప్రకటించిన తర్వాత కూడా.. ఉత్తర్వులను ఉపసంహరించుకున్న విషయాన్ని ప్రస్తావించారు. హైకోర్టు వేసవి సెలవుల్లో ఉండటంతో వెకేషన్‌ బెంచ్‌ని ఆశ్రయించడమా? లేక సెలవుల అనంతరం పిటిషన్‌ వేయాలనే అంశంపై రేపోమాపో నిర్ణయం తీసుకుంటానన్నారు. ఇప్పటికే తీర్పు అమలును నిలిపివేయాలని హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్‌ వేయడం.. తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తీర్పును అమలు చేయకపోవడంపై.. కోర్టు ధిక్కారం కింద పిటిషన్‌ వేయాలని నిర్ణయించుకున్నారు. 

 

 

రాష్ట్ర హైకోర్టు తన తీర్పులో ఆర్డినెన్స్‌ను, ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను కొట్టివేసిందన్నారు. జస్టిస్‌ కనగరాజ్‌ నియామకాన్ని హైకోర్టు రద్దు చేసిందన్నారు. తీర్పు 308 నెంబర్‌ పేరాలో ఎస్‌ఈసీగా తనను కొనసాగించే పరిస్థితిని పునరుద్ధరించాలని హైకోర్టు పేర్కొందన్నారు. తన పదవీకాలం పూర్తయ్యే వరకు, అంటే 2021 మార్చి 31వ తేదీ వరకు తనను ఆ పదవిలో కొనసాగించాలని ఆదేశించిందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగే తన హక్కును రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసిందన్నారు. తీర్పులోని అంశాల దృష్ట్యా ఎస్‌ఈసీ పదవి ఖాళీగా ఉండకూడదన్నారు. తనను ప్రభుత్వం తొలగించలేదని తేల్చి చెప్పారు. ఆర్డినెన్స్‌ తీసుకురావడం ద్వారా వేరేవారిని నియమించారన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తనను ఎన్నికల కమిషనర్‌గా కొనసాగాలని.. పాత పరిస్థితిని పునరుద్ధరించాలని తీర్పులో పేర్కొన్న విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ఈ తీర్పు ప్రకారమే తాను ఛార్జ్‌ తీసుకున్నట్లు సమాచారం ఇచ్చానని తెలిపారు. ఇదే అంశాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి కూడా సర్క్యులర్‌ ద్వారా నోటిఫై చేశారన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు జరిపే పరిస్థితి కనిపించకపోవడం అసమంజసంగా ఉందన్నారు. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...