Jump to content

రూ.కోట్లు తెచ్చిన కోకాపేట భూములు


Somedude

Recommended Posts

  • టీపీసీసీ చేపట్టిన ధర్నాకు ముందస్తు బ్రేక్‌.. ఎక్కడికక్కడ ముఖ్య నేతల గృహనిర్బంధం
  • సబితానగర్‌ వాసుల ఆందోళనతో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జి.. పలువురి అరెస్టు
  • వేలం వేసిన భూముల్ని గుంజుకుంటాం.. సోనియా ప్రభుత్వం వచ్చాక లెక్కలు తీస్తాం
  • మళ్లీ వేలం వేస్తాం.. కేంద్ర హోం మంత్రి, సీబీఐకి ఫిర్యాదు చేస్తాం: రేవంత్‌రెడ్డి
  • పార్లమెంట్‌కు రాకుండా అడ్డుకున్నారంటూ స్పీకర్‌కు లేఖ రాసిన ఎంపీ

 

 

నార్సింగ్‌/హైదరాబాద్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): కోకాపేట భూముల వేలంలో గోల్‌మాల్‌ జరిగిందని, ఇళ్ల పట్టాలు పొందిన వారికి స్థలాలు చూపాలంటూ టీపీసీసీ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో కోకాపేట భూముల పరిశీలన కార్యక్రమాన్ని టీపీసీసీ తలపెట్టింది. అయితే, ముందే అప్రమత్తమైన పోలీసులు సోమవారం ఉదయమే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌అలీ, దామోదర్‌రెడ్డి తదితరులను గృహ నిర్భంధంలో ఉంచారు.

 

అదే క్రమంలో కోకాపేట గుట్టకు నలువైపులా భారీ బందోబస్తు  ఏర్పాటు చేశారు. కానీ, పోలీసుల కళ్లు గప్పి మహే్‌షకుమార్‌ గౌడ్‌తోపాటు మరికొందరు నేతలు కోకాపేట భూముల వద్దకు వెళ్లి జెండాలు పాతారు. కోకాపేట గుట్ట కింద ఇళ్లు కోల్పోతున్న సబితానగర్‌ వాసులు సైతం అక్కడికి చేరుకుని మెరుపు ధర్నా నిర్వహించారు. తాజాగా వేలం వేసిన స్థలానికి రోడ్డు వేసేందుకు సబితానగర్‌లోని 50కిపైగా ఇళ్లను తొలగించనుండడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారందరినీ నిర్దాక్షిణ్యంగా లాగి పడేసి, లాఠీలు ఝళిపించారు. కాంగ్రెస్‌ నాయకులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Link to comment
Share on other sites

హైటెక్‌ సిటీ పక్కన, నాలెడ్జి పార్కు దగ్గర గజం భూమి ధర రూ.3లక్షలకుపైగా పలుకుతుండగా, 7,621 గజాల మిగులు భూమిని కల్వకుంట్ల శైలిమ, యలమంచిలి సుష్మ, సీమలకు తక్కువ ధరకే రెగ్యులరైజ్‌ చేశారని రేవంత్‌ ఆరోపించారు. ఆ భూమిని వారు కేటీఆర్‌ సన్నిహితుడు తేలుకుంట్ల శ్రీధర్‌ కంపెనీకి డెవల్‌పమెంట్‌ కోసం ఇచ్చారని తెలిపారు. కోకాపేట భూములు సైతం ఇదేవిధంగా త్వరలో కేటీఆర్‌ సన్నిహితుల వద్దకే డెవల్‌పమెంట్‌ పేరుతో వస్తాయని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

  • 5 weeks later...
On 7/15/2021 at 12:31 PM, Khali_ista said:

idhem comedy kaaka okadu Hyd nt even comparable to remotest place in vomerica antey inkokar compare with Dallaspuram/cary antaru What do these two people have in common? - Discussions - Andhrafriends.com

😂

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...